Paid Content
-
Nick name Sweet Heart 💞
I love surprises 😍
Heart ❤️+Heart beat 💓... read more
ఊసులు పంచుకోవాలి అని ఉన్నా పంచుకునే సమయం లేక...
కలవాలి అని ఉన్నా కలిసే తీరిక లేక...
కాసింత సమయం గడపాలి అని ఉన్నా గడిపే గత్యంతరం లేక...
నా ప్రేమను ఎటూ మలుచుకో లేక...
మౌనంతో మనస్సు విప్పి నా మసుకి రాస్తున్న లేఖ...
-RADHIKAKRISHNA AADARI-
చీపురిని భావిస్తారు
లక్ష్మి దేవిగా...
మరి ఎందుకు వాడతారు
చిపురిని చెత్త చెదారం
చిమ్మే వస్తువుగా...???
-RADHIKAKRISHNA AADARI-
గుర్తుంచుకోవాలి గుర్తుంచుకోవాలి అని గుర్తుంచుకునేది కాదు ప్రేమంటే...
మర్చిపోవాలి మర్చిపోవాలి అని అనుకున్నా మర్చిపోలేనిది ప్రేమంటే...
కలిసుండాలి కలిసుండాలి అని కలిసుండేది కాదు ప్రేమంటే...
విడిపోవాలి విడిపోవాలి అని అనుకున్న విడిపోలేనిది ప్రేమంటే...
-RADHIKAKRISHNA AADARI-
బంధుత్వంతో మొదలైన మన
బంధం...
కావాలి ఏడు ఏడు జన్మల వీడని
అనుబంధం...
పెద్దలు కలిపిన ఈ సంబంధం...
కావాలి కలకాల కమనీయ
రుణానుబంధం...
దేవుడు ముడి వేసి ఈ
మూడు ముళ్ళ బంధం...
కావాలి మునుపెన్నడూ
మరువని మధురాను బంధం...
Happy Wedding Anniversary
-RADHIKAKRISHNA AADARI-
ఎన్ని ఉన్నా...
చుట్టూ ఎందరు ఉన్నా...
ఏమి చేస్తూ ఉన్నా...
ఏమి ఆలోచిస్తూ ఉన్నా...
నువ్వు లేవు అనే లోటుని ప్రతి క్షణం అనుభవిస్తూనే ఉన్నా...
నిన్ను కలిసే ఆ క్షణం కోసం
ఎదురుచూస్తూనే ఉన్నా...
Radhikakrishna Aadari-
నీ గుండెల మీద తల వాల్చిన తొలి సారి...
నీ గుండె చప్పుడిని విన్న మొదటి సారి...
నీ చేతిలో చెయ్యి వేసిన సారి...
నా ఊసులు నీతో పంచుకున్న ప్రతి సారి...
ఇలాంటి క్షణాలు వస్తూ వుంటే బాగున్ను మరో సారి...
ఆ దేవున్ని ఇంకా ఏమి కోరుకోను చివరి సారి...
-RADHIKAKRISHNA AADARI
-
వద్దు అనుకున్న బంధాన్ని *కావాలి* అనుకోవడం...
వదిలెళ్లిపోయిన మనిషి *రావాలి* అనుకోవడం...
మరల బంధం ముడిపడి *పోవాలి* అనుకోవడం...
మునుపటి రోజులని *తేవాలి* అనుకోవడం...
మన మూర్ఖత్వమే అవుతుంది...
-RADHIKAKRISHNA AADARI
-
ప్రేమించిన వాళ్ళు తిరిగి ప్రేమని
ఆశిస్తారో లేదో తెలియదు కానీ...
ప్రేమగా కాసింత సమయం గడపాలి
అని మాత్రం కోరుకుంటారు...
ఒకరికి ఒకరుగా ఉండాలి
అనుకుంటారు...
ఒకరిపై ఒకరు ప్రేమని
పెంచుకోవాలి అనుకుంటారు...
ఎన్నో ఊసులు పంచుకోవాలి
అనుకుంటారు...
కొందరు వీటిని అందని ఆశలుగా
భావిస్తూనే ఉంటారు...
ప్రేమించిన వాళ్ళు వాటిని
అడిఆశలు చేస్తునే ఉంటారు...
-RADHIKAKRISHNA AADARI
-
ప్రేమ కూడా మారిపోతుంది అని తెలియదు...
నీ మాటల్లో మార్పు వచ్చేంత వరకు...
ప్రేమ కూడా మారిపోతుంది అని తెలియదు...
నీ మదిలో మార్పు వచ్చేంత వరకు...
ప్రేమ కూడా మారిపోతుంది అని తెలియదు...
నీ ప్రవర్తనలో మార్పు వచ్చేంత వరకు...
ప్రేమ కూడా మారిపోతుంది అని తెలియదు...
నీ ప్రేమ నాలోని ప్రేమని కంఠతడి పెట్టించ్చెంత వరకు...
కను రెప్ప సడి ఆగేంత వరకు...
గుండె సడి ఆ దేవుడి గుడి చేరేంత వరకు...
-RADHIKAKRISHNA AADARI
-