ఆకాశమంత కాగితంపైన
ఇసుకరేణువులన్నీ అక్షరాలైనా...
సరిపోవుగా అమ్మని పొగడాలంటే!-
అదేంటో
ఇకపై బాధపడకూడదు అనుకున్న ప్రతిసారి కన్నీరు రెట్టింపు అవుతూ వస్తుంది
కానీ
ఇకపై సంతోషంగా ఉండాలి అనుకున్నప్పుడు మాత్రం నవ్వు రాదు
బహుశా
నా నవ్వు తనతోనే ఉండిపోయిందేమో-
చలి కాచే మంట కాదు భోగి
చీకటిని చీల్చే వెలుగు ఇది
విజ్ఞానం ముసుగులో
అజ్ఞాన అంధకారంలో ఉన్న మనల్ని
జ్ఞానం వైపు తీసుకెళ్ళే వెలుగు ఇది-
నీకై వేచే
నింగిన తారను నేను.
నిన్నే తలచే
నిత్య వసంతం నేను..
-
కాదనుకుని
నువ్వెళుతున్నా...
నాదనుకుని
నేనేడుస్తున్నా...
నాగుండెను
నువు కోస్తున్నా...
నీ గురుతుగ
నే మిగిలున్నా..
భారంగా
నువు చూస్తున్నా
మౌనంగా
నే నిలుచున్నా...
-
తన గుండెకు ఎంత గాయమైందో
తను రాసే ప్రతి కవితలో విరహం, ప్రేమ, వేదన
ఈ మూడింటి కలయిక కచ్చితంగా ఉంటుంది
తన ప్రేమకై ఎంత వేచి ఉందో
ప్రతీ కవితలో తన ప్రియుడు పై ప్రేమ,
అతని కొరకు అన్వేషణ,
అతని కై నిరీక్షణ ఆ కవితల్లో ఉంటుంది
తన కవితలో ప్రతీ వాక్యం ఒక అల్లికల లతలా ఉంటుంది
ప్రతి కవితలోని చివరి వాక్యాలను కలిపిన
ఓ కొత్త కవితగా మారుతుంది
ఆమె కవితల సారాంశం తన ప్రియుడితో సహవాసం అయితే
ఆ సహవాసం సహచర్యంగా మారాలని మనసారా కోరుకుంటూ...
శ్రీలత lion కవితల అభిమానిగా తనకై ఈ కవితను అంకితం చేస్తున్నాను-
నా ప్రేమ నిరతం చిరుజల్లై కురిపిస్తే
నీ ప్రేమ నాకు కన్నీటి జల్లు మిగిల్చెను ..-
రెండింటిలో ఏది ఇచ్చిన
ఇచ్చినవాళ్ళు మోసపోక తప్పదు
తీసుకున్నవాళ్ళకి శత్రువులు అవ్వక తప్పదు-
U get what u deserve
- karma
U get what u want
- luck
U lost what u have
- daridhram-