ఆపలేని ఆలోచనా పరంపర
-
పాహి దుర్గే పాహిదుర్గే
పాహి దుర్గే పాహిమాం
త్రాహి దుర్గే త్రాహి దుర్గే
త్రాహి దుర్గే త్రాహిమాం
దురిత ధ్వంసిని దుఃఖ నాశిని
దైత్య హన్త్రి పాహిమాం
రక్త లోచని శక్తి వాసిని
భుక్తి దాయిని త్రాహిమాం
విశ్వ శోభిని సృష్టి కారిణి
నిత్య షోడశి పాహిమాం
వ్యక్త రూపిణి చిత్ప్రకాశిని
చిత్త మేధిని త్రాహిమాం
శంభు మోహిని వ్యోమ కేశిని
శూల ధారిని పాహిమాం
చిత్ర శోధిని మృత్యునాశిని
ముక్తిదాయిని త్రాహిమాం
పాహి దుర్గే పాహిదుర్గే
పాహి దుర్గే పాహిమాం
త్రాహి దుర్గే త్రాహి దుర్గే
త్రాహి దుర్గే త్రాహిమాం-
ఇజాల చాటున
నిజాలు దాచిన
భుజాలు తడిమే
ప్రజాంతక భూతమ్
జగాన్ని దోచే
సగాన్ని బ్రోచే
ఇజాన్ని మేసే
నైతిక దేశం
నడవని మార్గం
నడిచే చూద్దాం
ఇజాన్ని మాన్పే
ఊపిరి పొద్దాం
-
రాయి లా౦టి నీ మదిని రత్నంలా మార్చడం నా తర౦
రత్న రమనీయతలో రేరాజువై కా౦తులీనడ౦ నీ వర౦-
ఏదైనా మనసుకు తెలిసిన పనే..
ఆ విషయం మనకు తెలియక చతికిలపడి
పరిస్థితుల పైన పడి తెగ తిట్టుకుంటున్న సందర్భం లో, లే...మేలుకో.. అంటూ సింహ గర్జన చేస్తూ మనుషుల్లో నిద్రిస్తున్న కొన్ని కోట్ల సింహాల్ని, మాటల మంత్రాల తో తట్టి లేపి, మానవ జాతికి మళ్ళీ ధర్మపు పురుడు పోసిన యోగి.. "ధర్మసంస్థాపనార్ధాయా సంభావామి యుగే యుగే" అన్న వేదోక్తి ని నిజం చేయటానికి ఈ యుగానికి సరిపడే ప్రతిధ్వనిని ఆనాడే నిక్షిప్తం చేసిన మహనీయుడు. అంత అద్భుత మైన శిష్యుడిని ప్రపంచానికి పరిచయం చేసిన రామకృష్ణ పరమహంస చారణారవిందాల పై శిరస్సు వంచి మమ్మల్ని కృతార్థులను చేసిన వివేకానందుని మార్గం లో ఇంకా మిగిలిన ప్రపంచం కనీసం కాలైన మోపాలని ఆశిస్తూ
-
ఓ నవీన ఉదయాన
ఉషస్సు ఉసురు పోసుకునే సమయాన
సోముడు సొమ్మసిల్లి నిద్రాయుక్తుడైన ఝామున
దిక్కులు అవసరం లేని దిశలో
ప్రకృతి తన రంగులు దిద్దుకునే శోభలో
ఓ నూతన ప్రపంచాన్ని నేను సందర్శించాను
ఆ ప్రపంచమంతా నా వశం అయిపోవాలి-
"ఇవాళ నువ్వు చీకటి నవ్విన చిన్ని వెలుగువే కావచ్చు కానీ, ప్రళయం తాకని పర్వత శిఖరానివి.. ఓ మనసా భయపడకు ఆకలికైనా, ఆ... కలి కైనా "
-
గతాన్ని మాయలా చూపిస్తుంది
భవిష్యత్తుని ఆశ లా చూపిస్తుంది
అద్భుతంగా అబద్దాన్ని చూపిస్తుంది
నిజాన్ని దర్పణం లో చూపిస్తుంది
ఆ ఉహని నమ్మితే
అధః పాతాళం లో నెడుతుంది
నిచ్చెనేసి అందలాన్ని ఎక్కిస్తుంది
ఊహ కి ఊహించనంత గుణం ఉంది
కవులు, చిత్రకారులు లాంటి ఎందరో ఊహలకి ప్రాణం పోస్తారు
నిరాశావాదులు, శంక సంధుడు వంటి ఎందరో ఊహలకి ప్రాణం తీస్తారు
చివరగా "యద్భావం తత్ భవతి" ఎలా ఊహిస్తే అలానే జరుగుతుందని వేద వాక్కు-
ఎగసిపడే కెరటాలకు
తీక్షణ రవి కిరణాలకు
ఉధృత ధృత పవనాలకు
అనిపించిందా ఎప్పుడైనా
ఓటమంటే భయం?-
కలలో పారాడే ప్రశ్నవి
కలతలో జారిపోయే తృష్ణవి
తదేకంగా చూసే ఆశవి
తలోదారిన వెళ్లే ధ్యాసవి
కన్నీళ్లు నిండిన కాసారానివి
కష్టాలనెదురించు ప్రాకారానివి
మనోదైన్యపు తమస్సువి
మనోధైర్యపు ఉషస్సువి
ఓ మనసా...
కారణం,కార్యం
అనృశం,అనివార్యం
అన్నీ నీవల్లే-