QUOTES ON #SAMETHALU

#samethalu quotes

Trending | Latest
8 AUG 2017 AT 22:42

*సామెతల నానీలు* (ప్రయత్నం)


పెళ్ళాం మీద
కోపం
పాలవాడి మీద
చూపించినట్టు

ముందొచ్చిన
ల్యాండ్ లైన్ కన్నా
వెనకొచ్చిన
సెల్ ఫోన్ మీదే మోజు

ఏ ఫోనూ
లేనివాడికి
చైనా ఫోనే
దిక్కు...


బార్లో కూర్చొని
బార్లీ తాగినా
బీరు అనే
అనుకుంటారు

-


10 AUG 2017 AT 21:46

సామెతల నానీలు-4


వెన్నుపూస
వంకర
రోడ్డు గతుకు
తీరుస్తుంది

నెట్ ఆఫర్
అయిపోయిన తర్వాత
గూగుల్ సెర్చ్
చేసినట్టు

ఏ ఫోనూ
కొనలేనివాడికి
చైనా ఫోనే
ఐఫోను

ప్రేయసే కదా అని
షాపింగ్ కి తీసుకెళితే
పర్సు ఖాళీ
అయ్యిందట

-


10 AUG 2017 AT 8:18

సామెతల నానీలు-3


సెల్లూ లేదు మీటింగ్ కి వెళుతూ
ఛార్జరూ లేదు మొబైల్ ని
సిమ్ కార్డ్ కేమో జేబులో
అన్ లిమిటెడ్ ఆఫరు పెట్టుకెళ్లినట్టు




ఆడి కార్లకు కాలం
అధిపతి అయినా కలిసిరానప్పుడు
'ఆవిడ' దగ్గర ఫోనే బాంబై
డ్రైవరే ప్రాణం తీస్తుంది

-


9 AUG 2017 AT 8:58

సామెతల నానీలు-2 (ప్రయత్నం)

మాట్లాడటం
చేతకాదు కానీ
ముఖ్యమంత్రి అవుతా
అన్నాడంట

మన ఫోనే కదా
అని మాట్లాడితే
బిల్లు అవ్వకుండా
ఉంటుందా

అవినీతి నాయకుడు
నిజాయితీ అధికారిని
బదిలీ
చేయించాడట

టాక్స్ లు అన్నీ
రద్దు అయినా
జి యస్ టీ పోటు
తప్పదు

-


14 APR AT 18:23

అప్పుడప్పుడు మన జీవితంలో మనం ఎన్నో ఊహించుకుంటాం ఎలా అంటే..
" ఆలు లేదు సోలు లేదు కొడుకు పేరు సోమలింగం అని". దానికి ఒక కథ కూడా ఉంది అసలు ఎలా వచ్చిందో ఈ సామెత..
(కింద క్యాప్షన్ లో చదవండి)

-



"పొరుగింటి పుల్ల కూర రుచి" అనే సామెత ఎప్పుడూ

"మనింటి పియ్యి కాబట్టి తియ్యగానే ఉంటది తిను అన్నాడట"
అనే దాంతో కలిపి చదవాలి.

-