QUOTES ON #PHIRANGIQUOTES

#phirangiquotes quotes

Trending | Latest
29 AUG 2018 AT 20:50

When life gives you tough questions and you feel like ....
Why (Y) ? क्यू (Q) ?

& Wants to express your feelings...

Don't worry here comes this app to increase your happY Quotient!

-


19 AUG 2018 AT 12:08

The beauty of life depends
on how you see and capture it !

-


28 DEC 2020 AT 11:45

నీ స్వరము పలుకునులే
నా హృదయ స్పందనలు
నీ కనులు చూపునులే
నా గుండెకు గతిలయలు

నీ పాదం నడుచునులే
నా హృదయపు దారులు
నీ కరములు రాయునులే
నా ప్రేమ కావ్య సుమాలు

నీ చెవులకు నచ్చునులే
నా పలుకుల పదనిసలు
నీ నాసికకు తగులునులే
నా ఉచ్వసపు సుమగంధాలు

-


29 FEB 2020 AT 8:58


బంగారు పంజరంలో
బందీగా మిగిలాను
బతుకంతా భయం నీడలో
బలవంతంగా గడిపాను
బయటపడే తోవ తెలియక
బాధగా వగచాను
బద్దలైన ప్రేమతో గుండె
బరువై బతుకుతున్నాను
బంధనాలు తెంచి
బలైపోయిన నీ తోడులేక

ఇంకా నేను ఎగరలేను!

-


11 DEC 2019 AT 11:34

నీ కన్నుల్లో సూటిగా చూడలేక
నీ ఎదుట నిలబడి మాట్లాడలేక
నీ మీదున్న ప్రేమని దాచుకోలేక
నీ కలలతో రాత్రుళ్ళు నిదురలేక
నీ విరహ వేదన తట్టుకోలేక
నీకై రాస్తున్నా నా మొదటి ప్రేమలేఖ!

-


30 DEC 2019 AT 13:10

దూరంగా ఉన్నా విడవలేనిది
దగ్గరగా ఉన్నా వదలలేనిది

దూరాలకు అతీతంగా
దృశ్యానికి అందకుండా
హృదయాలను పెనవేసే
అద్భుత శక్తే ప్రణయం!

-


24 DEC 2019 AT 15:08

పట్టు పురుగును మట్టు పెట్టి
పట్టు దారమును చుట్ట బెట్టి
పట్టు వస్త్రములు కట్ట బెట్టి
పట్టు కుందువా పదవులు
పట్టి నిలుచునా పసిడి కలలు
పుట్టె ముంచును ఆ పాపపు వలలు

-


28 APR 2019 AT 19:26

హైపర్ ఆది పంచ్ కి నాగబాబు నవ్వులా
హై పవర్ మాస్ బీట్స్ కి మెగాస్టార్ స్టెప్పులా
హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ కి పవరిచ్చే స్టార్ లా
హైలో వుంటాయి మన వైక్యు లో కవితలు!

-


9 NOV 2018 AT 1:43

बुरे वक़्त कि खासियत हैं के वो तभी तक दुख देता हैं के जब तक वो होतीं हैं
वरना अच्छा वक़्त गुज़र जाने के बाद याद करने पे बहूत दुख देता हैं ।

-


9 JAN 2020 AT 9:34

కనులకు కనపడే అందాల్ని
కెమెరాలో బంధించాలని




కనులకు కూడా అందని అందాలు వుంటాయి, వాటిని ఆస్వాదించాలే కానీ అందుకోలేము

-