QUOTES ON #GURUVU

#guruvu quotes

Trending | Latest
2 MAR 2018 AT 2:14

నీ విజయం

మీ అమ్మ కళ్లలో మెరుస్తుంది
మీ నాన్న తలకెక్కి నర్తిస్తుంది
మీ గురువు మనసుకి తృప్తినిస్తుంది
మీ దోస్త్ గుండెల్లో గూడు కడుతుంది
నీ జీవితంలో వెలుగును నింపుతుంది.🤘

-


14 SEP 2018 AT 7:08

మ్రింగగులుగుతున్నాను పూటకొక్క దైవ జ్ఞానమనబడే చేదు గుళిక
చేదు చేదని నేను మ్రింగ లేకున్నచో మాయ రోగము వదలదు
నన్నిక
నిజ దైవజ్ఞానమే సర్వసృష్టిలోన ఎంతగానో రుచియైనది వేరు లేదిక
జ్ఞానులకు జ్ఞానమే రుచియని జెప్పిన జ్ఞాన గురువు మాటను
నమ్మిక

-


6 SEP 2018 AT 12:59

శీర్షిక : నాకు ఉత్తమ ఉపాధ్యాయుడు-మా హిందీ మాష్టారు
--------------------------------------------------------------------
part-06

ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తుకు తెచ్చుకునే ఈ "గురు పూజ్యోత్సవం రోజు" భావి విద్యార్థులను తీర్చి దిద్దే బాధ్యతలను నిర్వహిస్తున్న ఉపాధ్యాయులందరికీ మా(నా)హృదయ పూర్వక నమస్కారములు.

అందరికీ గురు పూజ్యోత్సవ శుభాకాంక్షలు.
ఇట్లు
మీ
మిత్రుడు
రవీంద్ర నందుల.గిరిగెట్ల గ్రామము,కర్నూలు జిల్లా.



-


11 SEP 2018 AT 19:27

ధనము విలువ నెరుగ ధరణిలోన దాచి ఉంచుకోవలెను విలువైనదనిన
దొంగలెవ్వరు దోచుకొనుటకు వీలుపడని చోటును వెదకి
విలువైనదనిన
ధనము విధము ప్రాపంచికమైన మిగుల్చును దుఃఖమును
దోచుకొనిపోయిన
ధనము విధము దైవజ్ఞాన సంబంధమైన కలుగు లాభము
దాచుకోకపోయిన

దైవజ్ఞాన ధనము అను దాని విలువ ఎట్టిదో తెలియదెవ్వరికీ మాయ మాటల రుచిని మరిగియున్న లోకులకు
మాయమర్మమెట్టిదో విశదపరచెను శ్రీభగవంతుడు పార్థునికి
మాయను జయించక మాయమౌచున్న దీలోకము
పోయేటప్పుడు వెంటరానిది వెంటతీసుకెళ్ళగ వీలు పడనిదీ అగ్నిలో పడేసినచో కాలిబూడిదౌను ప్రపంచ ధనము
పోయేటప్పుడు వెంటవచ్చునది వెంటతీసుకెళ్ళగ వచ్చునదీ
అగ్నివలే మండుతూ కర్మలెల్లకాల్చును దైవజ్ఞానము

-


6 SEP 2018 AT 12:54

శీర్షిక : నాకు ఉత్తమ ఉపాధ్యాయుడు-మా హిందీ మాష్టారు
----------------------------------------------------------------------------
part-05

ఆయన స్థానంలో మరొక మాష్టారు రావడం జరిగింది.కొద్ది రోజులు గడచిన తరువాత ప్రీ ఫైనల్ పరీక్షలు మేము(నేను)  తరగతి గదిలో వ్రాస్తూ ఉండగా ఆ మాష్టారు గారు తరగతి గదిలోకి వచ్చారు. రవీంద్ర ఎక్కడ? అని అడిగారు. పరీక్ష రాయటంలో పూర్తిగా మునిగిపోయి ఉన్నాము(ఉన్నాము) మేము(నేను ).మా పరీక్షను ఆటంక పరచకుండా ఆయన తిరిగి బయలుదేరి వెళ్ళారు.

ఆ తరువాత 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 1999వ సంవత్సరము మార్చి నెలలోన మొదలయ్యాయి.మేము (నేను)కూడా పరీక్షలకు హాజరయ్యాము. ఆ తరువాత ఫలితాలు దిన పత్రికలో చూడటం జరిగింది.రవీంద్ర నందుల హాల్ టిక్కెట్ నంబరు ప్రథమ శ్రేణి వరులో అచ్చయింది.

మాకు (నాకు)చాలా ఆనందం కలిగింది.అప్పుడు రవీంద్ర నందుల మార్కులు 447/600. హిందీ సబ్జెక్టులో 74/100 మార్కు వచ్చాయి.మొత్తం మీద 74.6% మార్కులతో మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకే ప్రథమ విద్యార్థిగా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించడం మాకు(నాకు) ఎంతో ఆశ్చర్యం కలిగించే అనుభవం.
మా స్కూలు చరిత్రలో సువర్ణాధ్యాయముగా చెప్పుకోగలిగే గొప్ప అనుభూతితో కూడిన యదార్థమైన అనుభవం ఇది.

-


11 SEP 2018 AT 19:24

దైవజ్ఞాన ధనము అను దాని విలువ ఎట్టిదో తెలియదెవ్వరికీ మాయ మాటల రుచిని మరిగియున్న లోకులకు
మాయమర్మమెట్టిదో విశదపరచెను శ్రీభగవంతుడు పార్థునికి
మాయను జయించక మాయమౌచున్న దీలోకము
పోయేటప్పుడు వెంటరానిది వెంటతీసుకెళ్ళగ వీలు పడనిదీ అగ్నిలో పడేసినచో కాలిబూడిదౌను ప్రపంచ ధనము
పోయేటప్పుడు వెంటవచ్చునది వెంటతీసుకెళ్ళగ వచ్చునదీ
అగ్నివలే మండుతూ కర్మలెల్లకాల్చును దైవజ్ఞానము

-


11 SEP 2018 AT 18:45

మరుగున పడిపోక నిలిచియుండును సత్ సాంప్రదాయము
గుట్టును విప్పిచెప్పుటకొరకే అరుదెంచున్ గురువెన్నటికైనను
చాటుమాటుగా మాటలెన్ని ఆడినను వినువాడొకడుండును
గోప్యంబుగ దాచబడియున్న ధనం బయల్పడు నెన్నటికైనను

నోరు పండవలెనన్న ఆకు వక్కలతో పాటు సున్నమవసరము
కర్మనంటకూడదనుకున్న కావలయు జీవుడు గుణరహితము
త్రైగుణ్యా విషయా వేదాయన్న దైవవాక్కును తెలియవలెను
ఆకు వక్క సున్నములనుంచక చేసిన పూజ పండదు నిజము

-


6 SEP 2018 AT 12:31

శీర్షిక : నాకు ఉత్తమ ఉపాధ్యాయుడు-మా హిందీ మాష్టారు
----------------------------------------------------------------------------- part-01

అది 1996వ సంవత్సరము.రవీంద్ర నందుల అనబడే పేరుతో మేము (నేను) 8వ తరగతిలో ప్రవేశించాము. మెదటి యూనిట్ పరీక్షలు రాయడం పూర్తయింది.అప్పటి వరకు ఉన్న హిందీ మాష్టారు పదవీ చేయడం చేయడం జరిగింది. విద్యార్థులందరూ వ్రాసిన పరీక్ష పేపర్లు దిద్దేవాళ్ళు లేక కట్టలు కట్టబడి మూకుమ్మడిగానే మూలుగుతున్నాయి. కొద్దిరోజుల తరువాత కొత్తగా హిందీ భాషలో పాఠ్యాంశాలను బోధన చేయటానికి హిందీ మాష్టారు గారు మరొక పాఠశాల నుండి ఇక్కడికి బదిలీ అయ్యి మా జిల్లా పరిషత్ పాఠశాలకు రావడం జరిగింది.

వచ్చీ రావడంతోనే ఆ మాష్టారుగారు మా మొదటి యూనిట్ పరీక్షా పత్రములను కట్లు విప్పి తూకము వేసినట్లుగా తూచి తూచి మా చేతిరాతల గీతలకు మార్కులు కేటాయించారు.
మా అందరి పరిస్థితులను ఆ మాష్టారు పూర్తిగా ఒక అంచనా వేయగలిగారు.

ఒక రోజు హిందీ పీరియడ్ ఉన్నపుడు ఆ మాష్టారు గారు మా పరీక్షా పత్రాల కట్టలను తన చేతిలో పట్టుకొని మా క్లాసులో ప్రత్యక్షమయ్యారు.పేరు పెట్టి పిలుస్తూ ఒక్కొక్కరికీ మొదటి యూనిట్ పరీక్షా పత్రములను అందజేయడం జరిగింది.
రవీంద్ర.ఎన్ అంటూ ఆ మాష్టారు గారు పేరు పెట్టి పిలవగానే మేము(నేను) ఆ మాష్టారు గారి దగ్గరికి వెళ్ళి మా పేపరును అందుకొని వచ్చి నేలమీదనే అందరితో పాటుగానే కూర్చున్నాము.

-


11 SEP 2018 AT 18:40

మరుగున పడిపోక నిలిచియుండును సత్ సాంప్రదాయము
గుట్టును విప్పిచెప్పుటకొరకే అరుదెంచున్ గురువెన్నటికైనను
చాటుమాటుగా మాటలెన్ని ఆడినను వినువాడొకడుండును
గోప్యంబుగ దాచబడియున్న ధనం బయల్పడు నెన్నటికైనను

-


6 SEP 2018 AT 12:50

శీర్షిక : నాకు ఉత్తమ ఉపాధ్యాయుడు-మా హిందీ మాష్టారు
----------------------------------------------------------------------------
part-04
రెండవ యూనిట్టు పరీక్షలకు సమయం వచ్చింది.పూర్వపు గుండుసున్నాకు ఆకృతులను కల్పించాల్సిన సమయము ఖచ్చితముగా ఇదే కదా మరి!
మాష్టారు గారు ప్రశ్నల పత్రాన్ని సిద్ధం చేసుకుని తరగతి గదిలోకి ప్రవేశించారు. నల్లని బోర్డు మీద ప్రశ్నల్ని వ్రాస్తూ ఉండగా మేము(నేను) చిన్న కాగితంపై ఆ ప్రశ్నల్ని చూస్తూ ఒక్కొక్కటిగా వ్రాసుకున్నాము. అసలు పరీక్ష మొదలైంది.
కంఠాపాఠం చేసుకున్న ప్రశ్న జవాబులను గుర్తుకు తెచ్చుకుంటూ మాష్టారు గారిచ్చిన సవాళ్ళకు సరియైన విధంగా సమాధానాలు రాయడం జరిగిపోయింది.

ఆ తరువాత మాష్టారు గారు తమదైన విచక్షణా అనబడే తమ తక్కెడలో మా సమాధానాల్ని తూచి తూచి మార్కుల్ని ఇచ్చారు.ఈసారి రవీంద్ర నందులకు (మాకు( నాకు))వచ్చిన మార్కులు 14/25.ఆ తరువాత 21/24.

సాధించాలన్న పట్టుదలతో శ్రద్ధతో ముందుకు అడుగులు వేస్తే కొంతైనా అభివృద్ధి సాధ్యమౌతుంది కదా!

8వ తరగతి పూర్తయింది.9వ తరగతి పూర్తయింది.10వ తరగతిలోకి ప్రవేశించాము.మా(నా) కెంతో ఇష్టమైన మాష్టారు గారు కొద్ది నెలలకు మరొక పాఠశాలకు బదిలీ మీద వెళ్ళడం జరిగింది తనతో మా జ్ఞాపకాల్ని వదిలిపెట్టి.

-