యం. కిరణ్మయి  
252 Followers · 65 Following

Joined 4 January 2019


Joined 4 January 2019

ప్రేమ ఉన్న చోట
మోసం ఉండదు
మోసం ఉన్న చోట
ప్రేమ నిలబడదు

-



అబద్దం ఎంత నిజాయితీగా చెబుతారంటే
నిజం కూడా అది నిజమేనని నమ్మేసేంత

-



అబద్దం నిజం రెండిటిలో అబద్దం వైపే అడుగేస్తాం
అబద్దం ఈ క్షణానికి ఆనందాన్నిస్తుంది
నిజం ఇప్పుడు కష్టపెట్టచ్చు కానీ
అదే నిను ఎప్పటికి నిలబెడుతుంది

-




ఆడిన ఆటలకు
చేసిన పాపాలకు
జరిపిన వినాశనానికి
సాక్షాలే లేవని
సంబరపడకు మిత్రమా
రగిలించిన కన్నీటి జ్వాలలే
నిన్ను ఆహుతిచేస్తాయి
మోసాలు పండిన రోజు
మట్టిలో కలిసిపోతావు

కాలం ఇచ్చే సమాధానమే
నువ్వు అనుభవించబోయే కర్మ

-




ఆడిన ఆటలకు
చేసిన పాపాలకు
జరిపిన వినాశనానికి
సాక్షాలే లేవని
సంబరపడకు మిత్రమా
రగిలించిన కన్నీటి జ్వాలలే
నిన్ను ఆహుతిచేస్తాయి
మోసాలు పండిన రోజు
మట్టిలో కలిసిపోతావు

కాలం ఇచ్చే సమాధానమే
నువ్వు అనుభవించబోయే కర్మ

-



యుద్ధం నీలో జరుగుతుంటే
ఎటు పారిపోగలవు
నువ్వు బ్రతకాలంటే
నీతో నువ్వు
సమరం చేయక తప్పదు
ఈ సంఘర్షణలో ఒక్కోసారి
గెలిచి ఓడిపోతావు
ఓడి గెలుస్తావు

-



కోన్నిసార్లు
సమస్యలు
ఎక్కడి నుండో
పుట్టుక రావు
నువ్వే కోరి
తెచ్చుకుంటావు

-



They are here for
a second and then
gone for an eternity

-



ప్రశ్నించే వారే లేరని
పొరపడకు
కాలం సమాధానం ఇచ్చిన నాడు
కూలిపోతావు

-



మనసుకి మస్తిష్కానికి మధ్యన ఎప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంటుంది
మనసు ఎప్పుడు తన ఆనందాన్ని కోరుకుంటుంది
మస్తిష్కము రాబోయే అనర్ధాలను లెక్కిస్తుంది
అందుకే కొన్ని నిర్ణయాలలో మస్తిష్కాన్నే గెలవనివ్వాలి ..

-


Fetching యం. కిరణ్మయి Quotes