"ని" "నే" "గా" "నీ" "ని"
-
లోకంతో నా సమరం 💥
లికితంతో సాగే పయనం �... read more
కాటికి పోడు వాడు - కన్నీరు చుక్క రాదు
కాలం కాటేసినా కంఠం సవరించడు
వేల వేదనలు వెన్నంటి వేదిస్తున్నా
సముద్రం దాచిన బడబాగ్నిలా
లోలోన రగులుతుంటాడు.
జీవన బంధాలు వెనక్కి లాగుతున్నా
ఆముదం పూసిన అద్దంలా
పైపైన నవ్వుతుంటాడు.-
📝...కవిత్వం...✍️
కనిపిస్తుంది నాకు
కలం అల్లిన రంగుల్లో
కాలం పేర్చిన పేజీల్లో
వినిపిస్తుంది నాకు
వినాలేగాని గాలి రాగాల్లో
కనాలేకాని కవి తలపుల్లో
-
విన్నపం వినవా... వన్నెల వెన్నెలమ్మ
వినేసి విసుగుచెందక వొడిలో వాలిపోవా,
కన్నీరు కరిగించవా...కర్కశ కలువపువ్వా
క్షమాపణ కాదనక కౌగిట్లో కరిగిపోవా.
మురిపించకే మందాకిని మాయ
మనసియ్యవే మల్లెల మాల,
రవలించే రమ్యరాతిరి రాగమా
రగిలించకే రక్తాన్ని రాక్షసిలా.
జగడం జార్చవా... జాతర్లో జాబిలమ్మ
జట్టుగా జతకట్టేస్తే జాతరే జీవితమంతా
పన్నీరు ప్రసవించవా...ప్రణయ పూలవాన
ప్రేమను పారెయ్యక ప్రాణంగా ప్రేమించవా.-
నా ఆలోచనలు
అకస్మాత్తు ఆవేశాలు
అనర్ధపు అభ్యోషాలు
నాకున్న సంవేదనలు
సంక్షిప్త సంశయాలు
సరికాని సంఘర్షణలు
నాలోని వేదనలు
వీడని పోరామిలు
వినాశ విస్మయాలు
నాతోనాకే ఉద్వేగాలు
ఉసూరుమనే ఉచ్స్వాసలు
ఊషము పైనే ఊహలు-
అలవాటే నాకీ ప్రయాసం
పరుగులు తీస్తున్న ఏకాకి కెరటం
దాచి ఉంచింది నాలోని ప్రళయం
ఆరాలు తీస్తున్న ఓనాటి పావురం
ఎగరేసుకుపోయింది నిన్నటి జీవితం
చిత్రంగా ఆగిపోయాను
నాలో నాకు, నాతోనే నేను
నాకంటూ నేనే, నేనంటే నేనుగా.
రేపటి ఆలాపనం
అనుకుంటే మారని కల్లోలం
అడుగులు వేస్తున్న ఒంటి పాదం
పాతి పెడుతుంది కంటి కలవరం
తీరాలు మోస్తున్న చీకటి కల్లాపం
లాగేసుకుపోయింది సోపతి స్నేహం
చివరకు మిగిలిపోయాను
నాలో నేను, నాతో నేనుగా
నాకే నేను, నేనే నాతొడుగా.-
పిలిచింది నన్ను తన గూటిలోకి
బయట ప్రపంచమే విప్పేసిన సంకెళ్ళని
వాకిట స్వాతంత్య్రమే విసిరేసిన భిక్షమని
...
Read below 👇👇👇-
అనువైన అందంలో లక్ష్మీదేవి
తమకాల పోటీల్లో తమ్మికంటి
అనురాగాల పాటల్లో వెన్నెలకంటి
తానే పల్లెటూరిలో పొలాల చాటు సూర్యోదయం
అనగా ఆకాశాన అరమరిచిన చంద్రోదయం
తానే మల్లెమూరిలో మొగ్గల చాటు హరిణయం
అల్లగా ఆమణి సింగారించిన బిడియం
తనకోసం తారసపడుతుంది అత్తరుపాణి
అలరుతామరం నీరసపడుతుంది బిత్తరుపోయి
తనకోసం తుల్లిపడుతుంది తేనెఝరి
ఆమెకోసం మల్లిపుడుతుంది నా గుండెఝరి-