ఎదురుగా ఉన్నప్పుడు పిలిచే పెదవి కన్నా ,
దూరంగా ఉన్నప్పుడు తలిచే హృదయం గొప్పది.....!!!
- యలగందుల నరేష్-
కట్టే కాలి బూడిద అయినా....
మాట మండుతూ బ్రతికే ఉంటుంది....
-యలగందుల.నరేష్-
మన బాధ బయటకు చెప్పుకుంటే
మనసు తెలికైపోతుందనుకోవడం అబద్ధం...
వాళ్ళ దృష్టిలో చులకనైపోతారు అనేది నిజం...!!!
-యలగందుల నరేష్-
చెట్లనుండి కింద పడిన పువ్వులు
వాటి అందాన్ని కోల్పోతాయేమో కానీ,
సువాసనని వీడలేవు...!!
మనుషులు , మనసులు దూరం అవుతాయేమో కానీ,
వారి జ్ఞాపకాలు ఎప్పటికీ దూరం కావు...!!!
-యలగందుల నరేష్
-
నాజీవితంలోకి అలలా వచ్చి,
కలలు మిగిల్చి , శిలలా మార్చి
వెళ్లిపోయావా ప్రియా....!!
నువ్వు రావని తెలిసినా,
ఎదురుచుస్తూనే ఉంది....
నామనసు ఎందుకిలా....!!!
౼యలగందుల నరేష్-
గెలిచిన కథలో గమ్యం ఉంటుంది...
ఓడిన కథలో జీవితం ఉంటుంది....!!
-యలగందుల నరేష్-
ఎవరితో ఎంతవరకు ఉండాలో , అంతవరకే ఉండలి....
అంతామనవాళ్లే అనుకోని , మంచికోసం ఏమైనా చేస్తే....
చివరకు మనమే చెడ్డవాళ్ళం అయిపోతాం....
-యలగందుల నరేష్-
Beauty is not validity...
Behaviour is Lifetime Validity...
-