ఎదలోని గందరగోళం
గొంతులో గరళమై
దించుకోలేని భారమై
మాటలుగా మారలేక
కన్నీటితో కరగలేక
ఆవేశముతో ఆగలేక
నిస్సహాయ జ్వలనమై దహిస్తోంది
నటిస్తూ జీవించమని ప్రోత్సాహిస్తోంది...!!
-
కాష్టానికి చేరే అంత కష్టమూ కాదు
కన్నీటితో కరిగే అంత క్షణికమూ కాదు
ఎదిరించలేని గళమై, మౌనం భరించలేని భారమై
మనసుని మోసం చేస్తూ, మదిని మయ చేస్తూ
మరమనిషిలా సాగలేక, మరలా మనిషిలా మారలేక
ఈ జగన్నాటక తెలియని పాత్రని నేను పోషితున్నా..!!-
అరిచి సాధించలేను, ఆలోచిస్తూ సాగించలేను
మాటకు మౌనం బదులైతే,మనిషికి సహనం కరువైతే
కలహాల కొలిమిలో స్నేహం కన్నుమూయదా, వైరానికి పురుడుపోయదా ...!!!-
నొప్పించకూడదని నటించేవారు కొందరు
నటనని తెలిసినా చిరునవ్వు చాటున నిజాన్ని దాచి నడుచుకునేవారు మరికొందరు...!!!-
అలికిడేలేని అలజడిలా ఆ నడి సముద్రాన నిలువలేనుకానీ..
తారలని కాకపోయినా పడి లేచే అలనై తీరానికైన చేరుతాను...!!-
విశ్వాంతరాలలో విగతమవుతున్న వింతలెన్నో
వికట నవ్వులతో నీ ముందు వాలాయా...
సుడిలోపడి సతమతమవుతున్న నీకు
మది మరిచిన దారులను, విధి దాచిన తీరులును
సందేహాలతో చూపుతున్నాయా..!!-
మేఘమైతే కరిగింది
దేహమైతే తడిసింది
తాను చినుకులై కురిసినా
నా చిరాకులన్ని తెలిసినా
గాయాలను కడగలేక
కన్నీటితో కలవలేక
మౌనంగా జారిపోయింది
నన్ను నాకే విడిచిపోయింది-
మదిని వదిలిపోదే...
కన్నీటితో కరిగిపోదే..
అలుపెరుగని నా ఆశలకు
అలసట రుచి చూపాలనా...
అర్థం ఎరుగని నా ఊహలను
వ్యర్థమని తెలుపాలనా...???-