పండుగ కోసం పల్లె వచ్చిన పక్షులన్నీ పట్నానికి పనికోసం ఎగిరిపోతున్నాయి..
కిలకిలరావాలతో మురిసిన తెలుగు లోగిళ్ళు మూగబోతున్నాయి..
ఉత్సాహం తో పలకరించిన ఊరి పొలిమేరలు ఉసూరుమంటూ వీడ్కోలు చెబుతున్నాయి..
మరిచిపోలేని జ్ఞాపకాలతో అడిగింది ఊరు మల్లెప్పుడు వస్తావని...!
మది నిండిన ఆనందంతో చెప్పా.. మరల తప్పక వస్తానని...!!-
ప్రజాస్వామ్యపు ముసుగులో నిరంకుశత్వం..!
రాజకీయపు రొచ్చులో కొట్టుమిట్టాడే పాలక పక్షం ..!
గీతని ప్రపంచానికి బోధించినా..
సీతలా చెరపట్టాలనుకునే మనస్తత్వం..!
కులమతాల కార్చిచ్చు లో మసైపోతున్న ప్రజానీకం..!
ఏళ్ళు గడుస్తున్నా ఇంకా అభివృద్ధి చెందుతూ ఉన్నామని చెప్పుకొనే అమాయకత్వం...!
అవినీతి, అసమానతలే మన ఎజెండా..!
78 వసంతాల స్వతంత్రపు భారత జెండా..!!
-
ఈ ఒక్క రోజు కులం కుమ్ములాటలు లేని,
మత మూఢత్వాల్లేని మరో లోకంలో విహరిద్దాం..!
ఈ ఒక్క పూట, అవమానాల్ని అవకాశాలుగా మార్చి
ఆకాశానికెగసిన మన కీర్తి పతాకాన్ని చూసి గర్విద్దాం..!
ఈ ఒక్క జాము, జాతిని జాగృతం చేసిన
వీరుల్ని గుర్తు చేసుకుందాం..!
ఈ ఒక్క క్షణం, మనకు తెలియని మనమెరుగని
మన భారతాన్ని స్మరించుకుందాం..!
జై హింద్ ..!!
-
ఆదికవి ఆరంభించగా...! రాజరాజే ఆదరించగా ...!!
కవిత్రయానికి భారతంగా..! పోతన భాగవతంగా..!!
శ్రీనాథుని చాటువుగా..! సామాన్యుని సామెతగా..!!
విదేశీయులే మెచ్చంగా..! రాయలు కీర్తించంగా...!!
క్షేత్రయ్య గానంగా...! అన్నమయ్య నోట గాత్రంగా...!!
రాయప్రోలు గేయంగా...! గురజాడ కవిత్వంగా...!!
వేమన శతకంగా..! గిడుగుతో నిత్య నూతనంగా..!!
విశ్వనాథుని కావ్యంగా..! శ్రీశ్రీ చేతి ఆయుధంగా..!!
గతమెంతో ఘనంగా.! నేడు అయినవారికే భారంగా..!!
తేనెలొలికే తెలుగు భాష..!వన్నె తగ్గని వెలుగు భాష.!!!
-
వెయ్యేళ్లు నిరంకుశత్వం.. వందేళ్లు బానిసత్వం
మనలో... మనకే.. మనపై తెల్లవాడి కుతంత్రం
ముక్కలు చేసిన మతం...మరచిన ఐకమత్యం
ఆటల్లో.. అంతరిక్షంలో...ఆధునికతలో...
అణుశక్తిలో.. ఆయుర్దాయంలో..ఆర్థికంగా
ఆది నుంచి అనాదిగా ఎదిగిన తీరు ఓ అద్భుతం
ఆకలి చావుల నుండి అన్నపూర్ణ గా...!
అవమానాల నుండి ఆకాశమే హద్దుగా..!
సాగిన ఈ ప్రయాణం అసామాన్యం.. అనితరసాధ్యం
గతమెంతో ఘనం.. అపురూపం మన చరితం..!
ఇదీ డెబ్భై ఐదేళ్ల స్వతంత్ర భారతం...!
విశ్వ వేదకపై ఎగరాలి మన విజయ మారుతం..!!
-
పొగడ్త...! పాయసం లాంటిది
ఎంత తియ్యగా ఉన్నా మనకి హాని చేస్తుంది..!!
విమర్శ...! వేపాకు లాంటిది
ఎంత చేదుగా ఉన్నా మనకి మేలే చేస్తుంది..!!
-
జననం..! కొన్ని రోజులకు చలనం..!
ఆటలతో తీరిక లేని బాల్యం..!
చదువులతో ఖాళీ లేని కౌమారం..!
వెంటనే ఉద్యోగం కోసం పయనం...!
మనీ వేటకై ప్రతిరోజూ పలాయనం..!
ఇంతలో కళ్యాణం...!వెంటనే సంసారం..!
సంపాదించింది ఆస్వాదించేలోపు రోగాల మయం..!
ఈలోగా మీదపడే వృద్ధాప్యం..! ముగిసే ఆయుర్దాయం.!
విశ్రాంతి లేని జీవితం..! విరామం లేని విజయం..!
ఇదే వందేళ్ళ మనిషి బతుకు చిత్రం..!!!
-
కనిపించని గాలి
కురిపించే నింగి
కనిపెంచే నేల
కురిసే నీరు
కాల్చే నిప్పు
వీటిలో దేనిమీద ఆధిపత్యం చెలాయించాలని
చూసినా ప్రళయం తప్పదు
-
Everyone have Unique Talent Elephant can't fly in high sky
like Eagle
Tiger can't Capable To lead the forest like Lion-
ఒకరిని ద్వేషిస్తే వారిలో మంచి గుణాలు
కూడా చెడ్డవి గానే కనబడతాయి.
అదే, ఒకరిని ప్రేమిస్తే వారి చెడు గుణాలు
కూడా మంచివే అనిపిస్తాయి.-