Veerendra Koppula  
13 Followers · 8 Following

read more
Joined 27 April 2018


read more
Joined 27 April 2018
17 DEC 2023 AT 21:01

నాలంటోడు చెప్తే వింటుందా ఈ లోకం ? అయినా , అంతటి ఓర్పు , సహనం , సమయం ఎక్కడివి వీళ్ళకి ...
నేనేం సాధించానని నా వైపు చూస్తుంది ?
నా ఉనికిని ఇంకా ఈ సమాజం గుర్తించలేదు....
ఇప్పటికీ నాకు ఏ రూపం , నామం లేవు , వాళ్ళు చుడడానికైనా, పిలవడానికైన ....
కలం అనే కళ గర్భం లో పోరాడుతున్న వాడినే నేనింకా...
సాధించాబొయే నా విజయాలే నేను పుట్టాను అనడానికి సంకేతాలు...
ఇంకా ఏ గెలుపును చూడని  నేను , చెప్తే మాత్రం వినేవాళ్ళు ఎవరు ?
ఓడిపోయినవాడి శ్రమ , పోరాటాలు కంటే గెలిచినవాడి సంతకానికే విలువ ఎక్కువ .....

-


14 DEC 2023 AT 13:57

మిత్రమా... ఈ నీ ప్రయాణంలో ఏదైనా కోల్పో ...., అది నవ్వులే అయినా ,  డబ్బే అయినా , సమయమే అయినా , ఆకరికి మనుషులే అయినా ....
ఏమి ఎదురొచ్చినా తట్టుకో ...., అవి ఓటములు అయినా , బాధలు అయినా , చివాట్లు అయినా , అవమానాలు అయినా ,  కన్నీళ్ళే అయినా ...
ఏది ఏమైనా కానీ నీ కలల్ని , ఆశయల్ని  మాత్రం నీ నుంచి దూరం అవ్వనివ్వకు ....
దేనికోసం నీ ప్రయాణం మొదలు పెట్టావో , వాటిని  మధ్యలోనే వదిలిపెట్టి , నీ ఈ ప్రయాణానికి, ప్రయత్నానికి , పోరాటానికి ,
ఓ అర్దం లేకుండా , ఓ  విలువ లేకుండా మాత్రం చెయ్యకు...

-


18 OCT 2023 AT 21:23

నా కలం నన్ను ప్రశ్నించింది.....
నా సిరా సాయంతో లిఖించిన  అక్షరం ఎవరిని
కదిలించలేకపోతే , ఇంకా ఈ అక్షరాలకు
పురుడు పోసి ప్రయోజనం ఏంటి అని ...?
నా రక్తంతో రచించిన ప్రతి మాట ఇంకొకరి
జీవితంలో నమ్మకాన్ని , ఆత్మ విశ్వాసాన్ని
నింపలేకపోతే,ఇంకా ఈ మాటలకి
ప్రాణం పోసి ఉపయోగం ఏంటి అని...?
సమాధానం ఇవ్వలేదు , ఆ పక్కనే
ఉన్న ఖాళీ కాగితాలను చూపించాను....

-


24 SEP 2023 AT 14:31

Thanani thesukuvachi neeku parichayam chestha ani....
Roju neepaina nadusthu , ganatalu koddi kaburlu chepthu nee ontarithananni komchem ayina dooram chestha ani , 
Naaku Baga isthamina oo kaali rastaki (road) maata icha....
Naalage , Aa kaali road kuda , ippatiki ontariga thana raaka kosam eduruchusthu undhipoyindi ...

-


22 AUG 2023 AT 17:41

HBD MEGA STAR ⭐
ఒక సమన్యడు కూడా పెద్ద కలలు కనొచ్చు....
ఆశయం గొప్పైదైతే , పట్టుదలతో ఏదైనా సాధించొచ్చు....
శ్రమిస్తే ఎంతటి అసాధ్యమైన గమ్యాన్ని అయినా చేరుకోవచ్చు ....
ఏమి లేకుండా  , ఏమి తెలియకుండా , ఒంటినిండా ఆశతో , కళ్ళనిండా కలలతో , గుండెనిండా దైర్యంతో ఊరి నుండి బయలుదేరి వచ్చిన నాలాంటి చాలా మందికి స్ఫూర్తి ఆయనే , ఆదర్శం ఆయనే....
ఓటమికి ఎందుకు భయపడకూడదో, గేలుపుకి ఎందుకు పొంగిపోకుడదో,   ఎంత ఎదిగినా  ఎలా ఒదిగి ఉండాలో, ఎలా గెలవాలో , ఎలా నిలవాలో ,  ఆఖరికి ఎలా బ్రతకాలో కూడా ఆయన నేర్పించారు ...
ఆయన ఒక శిఖరం , ఎవరు ఎంత గింజుకున్నా , ఆయనని అందుకోవలనే ... అది అసాధ్యం...

-


6 AUG 2023 AT 14:02

చీకటైనా దైర్యంగా ఉండదా, నువ్వు పక్కనుంటే....
వెన్నెలైన వెలుగులు నింపుకోదా, నువ్వు నవ్వుతుంటే ......
వర్షపు చినుకుల జన్మ ధన్యం కాదా, నిన్ను తాకుతుంటే.......
గాలికైనా గాత్రం వచ్చేస్తోందా, నీ మాటలు మోస్తుంటే.....
ధరిత్రి సైతం దారి తప్పదా, నిన్ను దగ్గరగా దర్శిస్తే...
నక్షత్రాలు నడక నేర్చెనా, నీ వెనక వచ్చేనా , నువ్వు నడిచివస్తుంటే ....
కాలం అయినా కదలిక మాని కలలు కనదా,
నీ వాలు కనులు వాడి కంట పడుంటే ........
చంద్రుడు అయినా తొంగి చుడడా, selfie కోసం ఆశ పడడా , ఇంత అందం నీదై ఆకర్షిస్తుంటే....

-


18 JUL 2023 AT 18:59

Mitama ....
Instagram lo chusesi , prati okkari life lo navvule unnayi , anni rangule unnayi ani Anokovadhu ....
Ila undalani kondaru, Ila endhuku undalekapothunnama ani inkondaru natisthunnaru anthe  ...
Alasipoyina manasulu , otamulatho nindipoyina jeevithalu ...
Unna badhala nunchi , kurukupoyina lothula nunchi , face chesthunna problems nunchi , thappichukovadaniki Vesukunna Musuge idhi ...
dooramga paaripothunna kshanalu matrame ivii,  asalu Nijam vere undhi ...

-


2 JUL 2023 AT 18:10

మిత్రమా .... తీరాన నుంచుని చూస్తూ , ఆ సముద్రం లోతు ఎంత అని చెప్పగలవా...?
నేలపై పడుకుని పైకి చేతులు చాపి , ఆకాశం ఎత్తునీ అంచనా వెయ్యగలవా...?
అలాగే పైపైనా చూసి , కొంచెం కొంచెం తెలుసుకుని ఏ మనిషి లోతుని , ఆలోచనలా ఎత్తుని , ఎప్పటికీ తెలుసుకొలేవ్...
చెప్పేదే వినిపిస్తుంది , చూపించేదే కనిపిస్తుంది , అతని లోపల ఏముందో, వాడికి తప్ప ,  నీకు , ఎప్పటికీ తెలియదు.....
నేను చూసింది ఇంతే , నాకు వినిపించింది ఇంతే అని , వీడు ఇంతే , వాడు అంతే అని , ఎవరి గురించి అంచనాకి రాకు ....

-


19 JUN 2023 AT 19:35

చికటికి ఎందుకు అంత నలుపు అంటే, నీ వాలు
కనుల నుంచి జరీనా చిన్న ఓరా చూపు
తగిలిందేమో....
వెన్నలకి ఎందుకు అంత వెలుగు అంటే, తన చల్లని
కాంతిరేఖ నిన్ను తకిందని ఆనందమేమో....
చంద్రుడికి ఎందుకు అంత అందం అంటే, నీ నవ్వులను
దోచి తనలో దాచుకుందేమో....
పువ్వులకి ఎందుకు అంత పరిమళం అంటే, నువ్వు
విడిచిన శ్వాశలను పీల్చుకుంటునందుకేమో...
సముద్రానికి ఎందుకు అంత అలజడి అంటే , నీకు దూరంగా ఉంటుందని బదేమో....
సూర్యుడికి ఎందుకు అంత యర్రటి కోపం
అంటే,నువ్వు పట్టించుకోవట్లేదనేమో.....

-


5 JUN 2023 AT 13:27

ఏమాయ చేశావే ...
నా చుట్టూ ఉన్న పక్షులన్నీ , నీ గురించే మాట్లాడుకుంటున్నట్లు అనిపిస్తుంది.....
నేనొక అద్భుతాన్ని చూశానని ఈ ప్రపంచం మొత్తం వినిపించేలా అరచి చెప్పాలనిపిస్తుంది...
నేను నిన్ను చూసిన ఆ క్షణాన్ని , నేను పొందిన ఆనందాన్ని , ఆ చంద్రుడికి ఇస్తే , ఇన్ని యుగాల ఒంటరితనం పోతుందేమో అనిపిస్తుంది ....
నీ కళ్ళ నలుపు , చీకటి కంటే నలుపని , ఆ చీకటితోనే గొడవ పడాలనిపిస్తుంది.....
పువ్వులకు , నవ్వడం రావట్లేదని , నీ నవ్వు చూపించి నవ్వడం ఎలానో నేర్పించాలి అనిపిస్తుంది ....
నీ క్షేమ సమాచారం తెలుసుకుని రమన్ని , ఈ అల్లరి గాలిని నీ దగ్గరకి పంపించాలనిస్తుంది....

-


Fetching Veerendra Koppula Quotes