నా గది కిటీకీ రెక్కలు కూడా జంటగానే ఉన్నాయ్..
నీకు దూరమైన నేను తప్ప...
-
VAMSI KRISHNA PODAPATI
(వంశీ)
610 Followers · 160 Following
Joined 13 March 2018
21 FEB 2024 AT 10:25
14 DEC 2023 AT 23:13
కలిసి ఏ దూరమూ నడవలేదు
విడిచి ఏ తీరమూ చేరలేము
నువ్వు నా కోసం పుట్టుకొచ్చిన జీవనది
నేను నీకోసం వేచి ఉన్న నీలి కడలి-
28 JUL 2023 AT 2:25
ఎందుకు చేరుకోలేదు అని అడిగే
మనసుకు ఏం బదులు చెప్తావ్...?
దారిలేదనా!
దారి తెలిసీ అడుగేయలేదనా...!-
29 OCT 2022 AT 19:33
నెత్తుటి చిత్తడికి పూసిన పూలెప్పుడూ
ఎరుపురంగులోనే ఉంటాయి.
చిద్రమైన బతుకుల పరిమళాలను
వెదజల్లుతూనే ఉంటాయి.-
16 SEP 2022 AT 10:32
అందేనా ఆకాశం అని ఏం ఆలోచిస్తావ్!
ముందైతే ఎగిరి చూడు, పడినా మళ్ళీ లేస్తావ్.-
22 AUG 2022 AT 10:52
అదేంటో అక్షరాలు కొన్ని
అమాంతం పక్క పక్క చేరి
లతల్లే అల్లుకుంటు పోతే
సుమించే కొత్త పదములేవో!
ఇదంటూ కచ్చితంగ చెప్పే
సరైన అర్థమేది లేదే!
సరిగ్గా నిన్ను చూసినపుడు
ఇల్లాగే తల్లకిందులైతే
ఇదంటూ దాని గోల అంటూ
ఎలాగా చెప్పగలదు మనసు?-
22 AUG 2022 AT 0:18
చలిమంటలెందుకు?
ఒక్క నీ తలపుతో వెచ్చబడుతుందీ దేహం!
చితిమంటలెందుకు?
ఒక్క నీ తలపుతో తగలబడుతుంటే ఈ దేహం!-