ఆమె గాజుల నలుపు
నలుపు కన్నుల వలపు
వలపు వానలో చెలుని తలపులు
..శ్రీ సంధ్య
-
నన్ను అలా చూడకె
చూడనట్టు నవ్వకె
నవ్వు పూల బాణమే..
నమ్మవె ఓ సంధ్య-
17.ఆమె ఆతని గొడుగు
గొడుగు వెంటే అడుగు
అడుగు పడితే గెలుపు
నిజమేను.. శ్రీ సంధ్య
18.ఆలుమగలై మొదలు
మొదలు జీవన వ్యథలు
వ్యథన వీడని కథలు
సుధలౌను...శ్రీ సంధ్య
-
చెలి సమ్మోహనాలు
చూపులో.. మత్తులే
మత్తులో.. నేనులే
నేను కన్న కలలలొ
...తానులే ఓ సంధ్య
-
సమ్మోహన బాణీ ..మాయా చరవాణి
ఆన్ లైన్ ఆర్డర్లూ
ఆర్డర్ కొ ఆఫర్లు
ఆఫర్ల గాలమనే.. వలలే ఓ సంధ్య
-
సమ్మోహన బాణీ.. మాయా చరవాణి
నట్టింట నెట్టిల్లు
నెట్టింట తెల్లార్లు
తెలవారు జాములో నిద్దురలు ఓ సంధ్య
-
చెలి సమ్మోహనాలు 5
ప్రేమ కవితలు రాసి
రాసి రాత్రిన మురిసి
మురిసి కనులే మెరిసె దివిటిలై ఓ సంధ్య-
చెలి సమ్మోహనాలు
నింగి మిణుకు చుక్కలు
చుక్కలు చెలి చమకులు
చమకు చెరకు మధురాలె రేయిలొ ఓ సంధ్య-
చెలి సమ్మోహనాలు 7
స్వరమైనది హృదయం
హృదయంలా నయనం
నయనానికి ప్రాణం... తానేలె ఓ సంధ్య
-
సమ్మోహన బాణి.. మాయా చరవాణి 1
ఇంటికొచ్చెను ఫోను
ఫోను మాయల బోను
బోను లోపల మనిషి.. విలవిలా ఓ సంధ్య-