ఇదిగో నిన్నే,
నవ్వుని నీ వరకూ
చేర్చడం ఎలా? ఉత్తరాలకి కూడా
కళ్ళుంటే బాగుణ్ణు... నా ఆనందాన్నంతా
కళ్ళకు కట్టినట్టు చూపెట్టును.
//కొనసాగింపు క్యాప్షన్లో//-
ఇదిగో నిన్నే,
ఈరోజు నాకు ఎంత అవమానం జరిగిందో తెలుసా!? నీ మటుకు నువ్వు విలాసంగా నా మనసులో కాలం గడిపేస్తున్నావు.
నేను మాత్రం నలుగురిలో ఎంత
అల్లరిపాలు అవుతున్నానో!!
(కొనసాగింపు క్యాప్షన్లో)-
ఇదిగో నిన్నే,
ఇలా ఉత్తరాలు రాసీ రాసీ
బదులు రాకపోయేసరికి
ఏదో రోజు నేనే వదిలేస్తాను
అనుకుంటున్నావేమో..
అలా ఏం జరగదు!!
//కొనసాగింపు క్యాప్షన్లో//-
ఇదిగో నిన్నే,
ఏంటీ... అప్పుడెప్పుడో ఎండలు దంచేసేటప్పుడు ఓ ఉత్తరం రాసి పడేసి మళ్ళీ ఇప్పుడు వానలు ముంచేసేటప్పటికి కానీ నువ్వు గుర్తురాలేదు అనుకుంటున్నావా...!?
ఏం చెయ్యమంటావు బాబు..
//కొనసాగింపు క్యాప్షన్లో//-
ఇదిగో నిన్నే,
ఈ కథలూ కవితలూ రాసే వాళ్ళ మాటలు ఎలా నమ్మగలం? కలం కదిపితే చాలు అన్నీ ఉపమానాలే. అక్షరం ముడితే చాలు అంతా అతిశయోక్తులే! ఏంటీ? నీకూ
అలానే అనిపిస్తుందా? నా ప్రేమ ఓ
అతిశయోక్తిలా కనిపిస్తుందా?
//కొనసాగింపు క్యాప్షన్లో//-
ఇదిగో నిన్నే,
నేను నిన్ను ప్రేమిస్తున్నానా?
ప్చ్... తప్పుగా చదివావు.
నేను "నిన్ను" ప్రేమిస్తున్నానా?
లేక నా ఆలోచనలను
ప్రేమించుకుంటున్నానా?
//కొనసాగింపు క్యాప్షన్లో//-
వింటున్నావా?,
ప్రేమకి ఎన్ని ప్రాణాలు?
నువ్వు ఎన్ని సార్లు
చంపేస్తున్నా
మళ్ళీ మళ్ళీ
పుడుతూనే వుందీ..!?
//కొనసాగింపు క్యాప్షన్లో//-
ప్రాణం పోవాలంటే ఎంత సేపూ... పోయే ప్రాణాన్ని చివరిగా తడిమే సమయం కూడా మిగలనంత సేపు. ఇందాకటి వరకూ చెట్టుకొమ్మకు తోడుగా ఊసులు చెప్పిన కోయిల ఎక్కడో వచ్చిన శబ్దానికి ఒక్కసారిగా ఎగిరెళ్ళిపోయినంత సేపు. చేరువవుతుంది అనుకునే అల తీరాన్ని మనసారా హత్తుకునే లోపే సంద్రంలోకి కలిసిపోయినంతసేపు. నేనంటూ ఉన్నానో లేనో పోల్చుకోలేనంత సేపు. మనసు నుండి తుడిపేయలేనంత సేపు. మర్చిపోలేనంత సేపు. చావుని ఒప్పుకోలేనంత సేపు. అలా అని నాతో పాటూ నువ్వూ చచ్చిపోలేనంత సేపు. ప్రాణం పోవాలంటే ఎంత సేపు?
ప్రేమ పుట్టినంత సేపు!!-
వింటున్నావా!?,
ప్రేమ చెరపలేనంత వైరమేమీ
కాదు కదా మనది...
మరి మౌనం పూడ్చలేనంత
'దూరం' ఎందుకు ఏర్పడింది?
మాటలు చేరనంత వేరుగా
'దగ్గర' ఎప్పుడు మారిపోయింది?
(కొనసాగింపు క్యాప్షన్లో)-
ఇదిగో నిన్నే,
దేవుడు మా చెడ్డోడు అబ్బా. ఇంతలా ప్రేమించే గుణం మనిషికిచ్చి, కక్కుర్తిగా మనసు మాత్రం ఒక్కటే ఇచ్చాడూ...! పాపం చిట్టి గుండె ఒక్కటే ఎంతని మోస్తుంది...? ఎంతకని దాస్తుంది? అందుకే అప్పుడప్పుడూ ఇలా
బయటపడిపోక తప్పట్లేదు..
//కొనసాగింపు క్యాప్షన్లో//-