తెలిసెనే నా నువ్వే..
నా నువ్వు కాదనీ..
ఈ పాట ట్యూన్కి నేను రాసుకున్న లిరిక్స్..
In caption..-
ఉండిపోవద్దే.. నాకు నువ్వొద్దే..
సప్లై నాకొద్దే.. నన్ను వదిలేయవే..
అయ్యో.. అయ్యో.. పెన్ను పేపర్పై కదలనన్నది
మళ్ళీ.. మళ్ళీ.. మైండు బ్లాంక్ అవుతనన్నది
టెన్షన్ మనిషే అయితే నాలా ఉందా అన్నట్టుందే
మోమాటాలే వద్దన్నాయే అడగాలంటే ఆన్సరే
ఉండిపోవద్దే.. నాకు నువ్వొద్దే..
వెళ్లిపోరాదే.. నన్ను వదిలేయవే.. ఓఒఒఓ
హాల్లో ఫస్ట్టైం నిన్నే చూసాక
చెయ్యే శివరే అయ్యే ఒకలాగా
ఏదో లోకంలో నేనే ఉన్నాలే
ఫోనే లోకానికి కింగులే
చల్లని ఏసీలో చెమటలు పెట్టిస్తూ
నన్నే నువు మర్డరు చెయ్యకే
నెక్స్టజన్మలో బుద్ధిగా చదివొస్తాను ప్రామిస్సుగా
జాలీ చూపించీ నన్నే వదిలెయవే
మళ్ళీ నీకెదురు అవ్వనులే
టెన్షన్ మనిషే అయితే నాలా ఉందా అన్నట్టుందే
మోమాటాలే వద్దన్నాయే అడగాలంటే ఆన్సరే
-
తియ్యని ఈ ప్రేమ పాటనే పాడింది హృదయమే...
ప్రాణమా నీవచట క్షేమమా నేనిచట క్షేమమే...
ఆశలెన్నొ ఊసులై ప్రేమ తోటలో...
తొలి చూపు కలయికే గుండె లోతులో...
ఒహో
తియ్యని ఈ ప్రేమ పాటనే పాడింది హృదయమే..
ప్రాణమా నీవచట క్షేమమా నేనిచట క్షేమమే...
గుండెల్లో మాటయేదో మౌనంగా ఉండిపోయే...
మౌనమాగే ఆ క్షణమే వచ్చేనే...
ఎంత దూరమైన గాని నా శ్వాస చేరుకుని...
నిన్ను తాకీ మైమరచీ ఉండేనే...
ఆగనంటు నా మనస్సు నీ పిలుపు తట్టగానె పరుగుతీసెనూ...
నిన్ను వీడి ఉండలేక నీగుండె లోతులోనె గూడుకట్టెనూ...
మనసు మూగబోదు...
మాట అనుటరాదు...
చూపులేగ మనకు వారధీ..
-
అలుపులేని పయనం
జరుపుతోంది హృదయం
ముగింపేలేని ప్రయాణం
మరువలేని కాలం
మరువలేక ప్రాణం
ఇలా ఎంత దూరం
సాగించాలి మదనం-
నలిగే నా మనసా
వినవే ఈ మాటా
కలగా కదిలే ఓ నదివే నువ్వూ...
సడియే లేకా
నువ్వొదిలీ పోకా
వ్యథగా మిగిలే ఓ నిజమే నువ్వూ.. ఉఊ
[ In caption ]-
అలుపులేని సమరం, జరుపుతోంది ప్రాయం
ముగించేదెలా ఈ కరోనం..
మధురమైన పయనం, తలుచుకుంటు ప్రాణం
పోగొట్టేదెలా ఈ ప్రమాదం..
గతంలో విహారం, భయంతో సంసారం
అదంతా వద్దంటే, తిరగడం అంతమంతే..
ఏవో జ్ఞాపకాలు, షెకాండ్ల జోరు
అదంతా గుర్తొస్తే ,ఆందోళనే అంతా..
ఒక్కరితో మొదలయ్యీ, క్షణమైన ఆగదుగా
లక్షలకు వ్యాపించే, ఈ కరోన..
మాస్కులు వేసే, కాలం వచ్చిందా
విచ్చలవిడితనం తగ్గిందా..
నరనరాలలోన కరోనా నామ
చివరకుమిగిలేది ఇదే ఐతే
గడపదాటి బయటికిపోతరమా..!-
కుర్రోళ్లంటే లవ్ చెయ్యాలి పెద్దోళ్లంటే సైడివ్వాలి
సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్ వీ ఆర్ ద లోకల్
సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్ వి ఆర్ ద లోకల్
సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్ లోకల్ బాయ్స్ హియర్...
Movie: Nenu Local Lyrics: Sri Mani
స్టూడెంట్సంటే ఫెయిలవ్వాలి టీచర్లంటే మార్క్స్ ఎయ్యాలి
మార్క్స్ మార్క్స్ మార్క్స్ ప్లీజ్ వీ ఆర్ ద ఫెయిల్యూర్స్
మార్క్స్ మార్క్స్ మార్క్స్ ప్లీజ్ వీ ఆర్ ద ఫెయిల్యూర్స్
మార్క్స్ మార్క్స్ మార్క్స్ ప్లీజ్ ఫెయిల్యూర్స్ బ్యాచ్ హియర్..
-
నాలుగ్గోడల మది గది కూడా
నాలుగు దిక్కులు ప్రేమని మోస్తూ
ఏడే చుక్కల ముగ్గుల ఆశ
ఏడడుగుగలతో జత అయ్యే శ్వాస
నా కవితకు ఛందస్సు నీవంటూ...
నా ప్రతి మాటను పాటగ మార్చేస్తూ...
నా కనులకు కాటుక నీవవుతూ...
నా కలలకు రంగులు అద్దేస్తూ...
ఉదయాలకి ఏం కరువొచ్చిందో
రాతిరి నిదురను చెరిపేస్తుంది
మనసుకి నీకూ ఏం బేరం కుదిరో
నన్ను నవ్వించే పని నీకిచ్చింది
నీ పెదవుల పలుకుల తాళంకూ...
నా కనుబొమ్మల నాట్యమే జోడు...
నీ నవ్వుల దివ్వెల ఊసులకూ...
నా మనసుకి గుర్తొచ్చెను ఈడు...-
మేఘాల తెర చాటున దాగున్న నా మనసుని
ఓ గాలై తరిమేసీ చవి చూసావా
గాయాల పొదరింట ఒదిగున్న నా ఎదనీ
ముళ్ళన్నీ పూవులులా పూయించావా
ఉందో.. లేదో.. అని అనుకునె ఆ ప్రేమని
నా నిండా నింపీ నువ్వూ నిజమయ్యావా
కలగా.. మిగిలే.. కథలే నావనుకున్నా
కలమే నువ్వయ్యీ తలరాతని మార్చావా
ఏ దిక్కుకు మొక్కులు మొక్కానో
నలుదిక్కులు నిన్నే నిలిపింది
ఏ చెట్టుకి నోములు కట్టానో
నాకు నీడగా నిన్నే ఇచ్చింది
చిన్న అలికిడికి ఎగిరే పక్షుల గుంపులు
నీ ప్రేమకి కష్టాలు బెదిరి పోయే
చిన్న వెలుగుకె చెరిగే చీకటిలాగా
నన్ను నీతో వదిలేసి వెళ్ళిపోయే-