మనసు లోన
తలపు వాన
కురిసి గీతికయ్యింది!
పదము కదల
యదలు మురవ
వెరసి వీణ మోగింది!!-
20 NOV 2021 AT 9:51
29 OCT 2021 AT 7:00
విరిసిన సుమమా
కురిసిన హిమమా
తాకిన నీవూ పరిమళమా
తలిచిన గుణమా
మొలిచిన వనమా
ఎదిగిన నీవూ పావనమా-
29 OCT 2021 AT 7:09
తిలకం దిద్దుకు
జెండా నెత్తుకు
కదిలే భారత యువతంతా
నెత్తురు నొంపుతు
సమరము సలుపుతు
త్యాగము చేసే బ్రతుకంతా-
29 OCT 2021 AT 7:57
మమతల మనమా..
కలతల వనమా..
ఎందుకు? నీవూ నూతనమా.!
కవితల స్వరమా..
కదిలిన కలమా..
ఏమిటి? నీవూ చేతనమా.!!-
29 OCT 2021 AT 8:43
కోకిల ధ్వనిలా..
మురళీ లయలా..
పిలుపే ఏదో కదిలెనలా.!
పొంగిన నదిలా..
అంగన హృదిలా..
వలపే లోలో నలిపెనెలా.!!-
29 OCT 2021 AT 0:20
వినవే మనసా
వేదన నడుమా
వనమున వెదురై పడి ఉండి
సాధన ఫలముగ
వేడుక కదలగ
కృష్ణుని వేణువు నేనయ్యా-
28 OCT 2021 AT 22:07
ఎదురై శిశిరం
తోడై పవనం
జీవన శోభను బాపెనుగా
వచ్చిన ఆమని
పచ్చని దారిని
జీవన పథముకు చూపెనుగా!!-