QUOTES ON #వన్నెలయ్య_రెక్కలు

#వన్నెలయ్య_రెక్కలు quotes

Trending | Latest
24 MAY 2021 AT 10:16

దిక్కులు ఎన్నో
తిరిగి వచ్చింది
రెక్కలు ఎన్నో
తొడిగి నిలిచింది


నా మనసు
కలము

-


18 SEP 2020 AT 8:06

ఉన్నట్టే ఉందేమో
స్వేచ్ఛ లేకుండా ఉంది
ఎగురుతూనే ఉందేమో
ఎల్లలు దాటలేకుంది


గగనతలంలో పతంగి
భూతలంలో లతాంగి

-


5 OCT 2020 AT 14:54

కోరి కోరి ప్రేమిస్తే
యద లోన చోటిచ్చె
మరి మరి ఆశిస్తే
నిద్రించే పతి వచ్చే


ఉమా
రమా

-


15 SEP 2020 AT 15:27

అనుకోకుండా వచ్చింది
నిండా తడిపేసి
చెప్పకుండా వెళ్ళింది
అంతా తానయ్యి


సాయంకాలం వర్శం
ప్రాయంకాలం వనిత

-


19 AUG 2020 AT 17:08

ముక్కలై పగిలి పోయింది
ఎంతకూ అతకకుండా
గాయమెంతో పెద్దది
ఉంచలేను దాచకుండా


కుండ
మనసు

-


11 MAY 2021 AT 10:12

శవాలు గుట్టలయ్యాయి
కాల్చేవారు లేరు
కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయి
తుడిచేవారు లేరు


ప్రకృతి ప్రకంపనం
కరోనా విజృంభణం

-


4 OCT 2020 AT 13:06

తలపు
రెక్క విప్పి ఎగిరింది
అలుపు
లేక రెక్కలు విదిల్చింది


నా కవిత
రెక్కలు కవిత ప్రక్రియ

-


6 DEC 2021 AT 9:55

ఇపుడు ప్రతి ఇల్లు
వృద్ధాశ్రమం
ఇక నీ సంపదలు
వృధా శ్రమం


విదేశాల్లో సంతానం
విడివాటే బహుమానం

-


11 AUG 2021 AT 20:33


బ్రతుకు
గాడితప్పుతుంది..
ఆ తర్వత
శూన్యమౌతుంది..


అలక్ష్యంగా ఉన్నా..
నిర్లక్ష్యం చేసినా..

-


7 MAY 2021 AT 9:27


తానో దుర్గం
అనిపిస్తాడు..
ఇలలో స్వర్గం
దింపేస్తాడు..


అతడు
అతని బాటలో

-