తల్లికేమొ చిక్కడు
మగువలకూ దొరకడు
మునులకే దక్కాడు
ఓ కూనలమ్మ!-
9 MAR 2021 AT 20:08
నిను చూడ నా కళ్లు
కోరింది మది ఇల్లు
నీ రాక హరివిల్లు
ఓ వన్నెలమ్మ!-
9 MAR 2021 AT 19:49
నిన్న దాక అణువును
నేటి మొదలు తనువును
మరునాడు వేణువును
ఓ వన్నెలమ్మ!
నిన్న మొన్నటి అణువు
నేటి మొదలున తనువు
ఇకముందు వేణువు
ఓ వన్నెలమ్మ!-
1 MAR 2021 AT 6:04
కన్ను ఆమె కొట్టే
పెన్ను అతడు పట్టే
చిన్ను..! కవిత పుట్టే
ఓ వన్నెలమ్మ!-
10 SEP 2021 AT 7:28
ముందు పూజల రేడు
స్థూల కాయము వాడు
సూక్ష్మ బోధలు చూడు
ఓ కూనలమ్మ.!-
4 MAR 2021 AT 21:53
భవ జలధికి మందులు
నాదు హృదికి విందులు
చిన్ని కృష్ణ చిందులు
ఓ వన్నెలమ్మ!-