96. కరోనాతో
పోతున్నా.. ప్రాణాలు//
మాస్కుల కాడ..ఇంకా తెగని బేరాలు/
97. ఇంకో
కొత్తది వచ్చినా వైరస్//
మనిషి నిర్లక్ష్యం ముందు మైనస్/
98.శానిటైజర్
వాడమంటే..సోకు//
వీళ్లే సమాజానికి మేకు/
99. కాలం
నేర్పుతూనే ఉంటుంది పాఠాలు//
మనవే మర్చిపోయి వెళ్లే ప్రయాణాలు/
100.కరోనావి
తీరని దాహాలు//
లెక్కకు చిక్కలేదు.. ఎన్నో దేహాలు/-
69.ప్రశ్నించే//
గళాన్ని బలం బంధించింది/
ఇప్పుడది కలమై..వేల గొంతుకల ఉప్పెనవుతుంది-
63.సన్మార్గంలో//
ఎగరమని రెక్కలిచ్చాను కలానికి/
మనసు కాదు కదా కళ్లెం.. వేయడానికి
64.అయినా//
చిగురిస్తుంది యువ కలము/
'పెద్ద' పులుల గాండ్రిoపులకు జడవదు నిజము
65.దులిపితే
చాలు కలం రెక్కలు
కొనేసాక..ఈకకు కూడా జేజేలు
సంధ్య.Ch
-
66.వాట్సప్ స్టేటస్
మైక్ అయ్యింది
అన్ని ప్రశ్నలు వినలేక డేటా పరారయ్యింది
67.స్టేటస్
మైకులో అరవడం ఫ్యాషన్
వ్యూస్ వస్తే తీరినట్టే టెన్షన్
68.సభలకు
లాక్ డౌన్ వేసింది లాక్
సామాజిక మాధ్యమం తీసుకుంది మైక్
-
Facebook పెన్ కౌంటర్లు
86.నకిలీ
ఖాతాలతో ఫేస్ బుక్
అక్కడంతా ఫేక్ లుక్
87.కొత్త కొత్త
ఎడిటింగుల లభ్యత
సంతలోనే ఇక సభ్యత
88.కొత్తగా
వలవేస్తూ హ్యాకర్
ముందు మనసవ్వాలి లాకర్
89.నిజాలకు
రెస్పాన్డ్ నిల్
అవాస్తవలు అవుతున్నాయి వైరల్
90.ఐనవాళ్లను
తిన్నావా అని అడగరు
ఎమోజీలు పెట్టడంలో బిజీ వారు
-
49.మాత్రలతో
సగం జనాల పరార్లు
సూటిగా,ఘాటుగా నచ్చాయంట పెన్ కౌంటర్లు
50.కవితల్లో
కన్నీళ్ళకు నో ఎంటర్
గురిపెట్టింది... పెన్ కౌంటర్
-
31.బాబోయ్/
వార్తల్లో పి ఆర్ సి ముచ్చట/
ఇంకెన్నిసార్లు పెంచుతారో.. జనాల్లో చర్చట
32.జీతం/
చూసుకొని పెట్టే లోను/
తప్పదిక.. జీవిత కాల ఫైను
33.ఈ ఎం ఐ ల/
చిల్లుల కుండ/
నింపదే జీతం.. చల్లగుండ-
60.పెళ్ళైన కొత్తలో//
పువ్వు చుట్టే భ్రమరం/
తేనె..చెంచాడైతేనే మధురం
61.పంచారుగా//
ప్రేమ చెంచాడంత/
ఇక ఆంక్షలు చాంతాడంత
62.భావోద్వేగాల//
వాటాలో చెంచాడు చాలు//
అతి సర్వత్రా విడవమన్నారు పెద్దలు-
51.ఉద్యోగికి//
జీతాలివ్వడం భారo/
ఆత్మాభిమాని..రోజు కూలీ బ్రతుకే నయం
52.మూడేళ్ళుగా//
జీతాల ముచ్చటేసింది పేపర్/
టి ఆర్ పి కోసం హెడ్డింగులు సూపర్
53.ఒక్కడే//
కొంటున్నాడు వేలల్లో ఓట్లు/
లక్షల మంది జీతాలు కలిపితేనే కోట్లు
54.పి ఆర్ సి//
మ్యాటర్ నింపుతూ పేపర్లు/
ధరల పట్టిక మారుస్తూ వ్యాపారులు
-
27.పుస్తకాలు/
చేదంటారేమో పిల్లలు/
అందించారుగా అంతర్జాల మిఠాయిలు
28.సీరియళ్ల/
పెట్టుబడే మనాళ్ళ ఉద్వేగాలు/
ఎంతమందికి పుట్టుకొస్తాయో త్వరలో హృద్రోగాలు
29.ఇంటింటా/
బుల్లితెర వెలుగులు/
ఏంటో అస్సలు మిస్సవ్వరీ ట్యూషన్లు
30.పుస్తకాలు/
గెలిచాయి మనసులు/
ఇప్పుడంతా లైక్ ల కోసం ఏడ్పులు
సంధ్య. Ch
-