చూడమ్మా క(వి)తా!!
"భావము,భావములో దొర్లే బూతుల గురించి ఓ కవి ఏమన్నాడో తెలుసా??"
'కమ్మని భోజనంలో కలుక్కుమని పంటి కింద రాయి వస్తే ఎలా ఉంటుందో...చక్కని భావ ప్రకటన చదువుతున్నప్పుడు....అచ్చుతప్పులు కనపడ్డం అంతే బాధ పెడుతుంది'
ఏదో భా(షా)వ ప్రేమికుడిని కనుక చెబుతున్నాను..
తప్పనిపిస్తే క్షమించు..మనసు నొప్పిస్తే మన్నించు!!
"దయచేసి అచ్చుతప్పులు లేని భావం పండించు"
-
Its been a year here...
నా ప్రేమ రచనలు చదివి పళ్ళు కనపడకుండా నవ్విన వాళ్ళకి..
నా హాస్య రచనలు చదివి మొత్తం 32 పళ్ళు బయట పెట్టిన వారికి...
నా విరహ రచనలు చదివి పంటికింద బాధ అణుచుకున్న వాళ్ళకి...
నా కథలు చదివి నిజమా అని ఆశ్చర్యపోయిన వాళ్ళతో సహా అందరికీ కలిపి...
పేరు పేరునా కృతజ్ఞతలు!!-
చందూ...!
పాలకి పెరుగుంటేనే...తోడుకుంటుందేమో
ఎండకి గొడుగుంటేనే... నీడ ఉంటుందేమో
నీవు లేని నాకు తోడు-నీడ ఎవరున్నారమ్మా
వినారాదటే ఓ భామా విన్నవించుకోనీ నా ప్రేమా!!
-
'కనపడిన ప్రతి కోట్ కి ఎందుకు నాన్నా లైకులు కామెంట్లు పెడతావ్..!!'
'చూడండ్రా..!!రాసిన ప్రతి కవితలో కంటెంటు ఉండకపోవచ్చు...కానీ ప్రతి కవితలో వాళ్ల కథ ఉంటది...దేవుడా నా కథని ఈ సమాజానికి ఎలారా తెలియజేయాలి అనుకున్నపుడే వాళ్ళకి వరంలా ఈ YQ ప్లాట్ఫామ్ దొరికింది..'
'అలాంటి వాళ్లకి మన తరపున మనం ఏమివ్వగలరంరా....
ఒక లైకో... ఒక కామెంటో తప్ప...హ...మంచోళ్ళురా అంతా మనోళ్లు రా!!'
'నిజమే నాన్నా!!☺️😢'
-SKV-
"పొయ్యి వెలిగించింది
బియ్యం పోసేసింది
అన్నం ఉడుకుతోంది
మెతుకు మెత్తబడింది"
ఇది కవితేవిట్రా చిట్టినాయుడూ..!
నిన్ను కుక్కర్లో వేసి ఉడకబెట్టేవాడు లేక!!
-
మీ కవితలు మాత్రం అంత గొప్పగా ఏం లేవు...గతవారం రాసిన దాంట్లో కూడా ఇలాగే...
ఆపరా..అపరా...ఆపరా..!
కనపడిన కవితలన్నిటికి కొలాబులు రాసే నీవు..సొంతగా కవిత రాసే నాకే కామెంటు పెడతావా...ప్రాణాలు తీస్తాను..!
ఈ రోజు నుంచి మూడు నెల్లపాటు నీవెవరికీ కొలాబు రాయటానికి వీల్లేదు..ఇదే ఈ రాయుడి తీర్పు..!!— % &-
Omicron గురించి విన్నాక ఒకసారి బాజారుకెళ్ళి ఇంటికి రాగానే...నేను!!
ఒక్కడికీ బుద్ధి లేదు
ఒక్కడికీ భయం లేదు
ఒక్కడికీ బాధ్యత లేదు
ఒక్కడికీ మాస్కు లేదు!!
-
అయ్యబాబోయ్ ఈ వయసులో కూడా పద్మశ్రీ గారి హెల్త్ కాన్షియస్ చూశారా...పొద్దున ఆ పరిగెత్తడం ఏవిటండీ..?
హెల్త్ ఆ పాడా...పొద్దున పాల కోసం వెళ్తే..మా ఏరియాలో కుక్క వెంటపడింది..వీధి మలుపులో వీడికి అది కనపడనట్టుంది...!!-
ఇంతింత పొడవు కవితలు రాసినా ఒక్కడూ వీడి కవితలు చదివిన పాపాన పోలేదు...ఒక్కసారిగా వీడికింత ఫాలోయింగ్ ఏంట్రా అనుకుంటున్నావ్ కదూ??
ఏముంది బుర్ర వాడా..నా కవితల్లో ఆక్షర దోషాలు పట్టించిన నా ఫాలోయర్స్ కి...తప్పు కి పదిరూపాయలు చొప్పున paytm చేస్తా అని బయో లో పెట్టా..!! పోలా....అదిరిపోలా..??-