జీవిత సత్యాలు
అనవసరం అనుకున్నవి అన్నింటినీ
చేయిస్తుంది అవసరాలు
చూడకూడదు అనుకున్నవి అన్నింటినీ
చూయిస్తుంది నిస్సహాయత
తెలియాల్సిన పని లేదు అనుకున్నవాటిని
తెరదింపి మరీ వీక్షింపచేస్తుంది కాలం
మాటలు అక్కర్లేదు మనసులతో అనుకునప్పుడే
మనుషుల్ని గుర్తుచేస్తుంది గాయం
అన్నీ తెలుసు అనుకుంటూ విర్రవీగే వివేకానికి
అనుభవాల పాఠం నేర్పుతుంది అవివేకం
అనుకున్నవి జరగలేదని జారిపడినప్పుడు
అనుకోకుండా జరిగేవాటితో పైకి లేపేదే జీవితం.-
నేను మగాడ్ని,
మనసున బాధని బయట పెట్టలేను.
నేను మగాడ్ని,
కంటిలో నీటిని నలుసుగా చెప్తాను.
నేను మగాడ్ని,
కన్నీటిని మనసారా జాలువార్చలేను.
నేను మగాడ్ని,
బలవంతుడ్నే కానీ బంధాలలో చిక్కిన బలహీనుడ్ని.
నేను మగాడ్ని,
అంతులేని శ్రమతో నడిచే నడి రేయిని.
నేను మగాడ్ని,
కుటుంబాన్ని కాపాడే కనురెప్పను.-
నడిచిన దారుల కథలు మరిచి
వెనుతిరగక గతాన్ని వదిలి
నీ నవ్వులో నా జీవితాన్ని చూసి
నీ హస్తాన్ని నా దైర్యం అనుకొని
నాలోని లోపాలను పూడ్చే కుసుమం నీవని
ప్రపంచాన్ని పక్కకు నెట్టి నా మది
ఇక అన్ని నీవే అని నా ప్రాణం
నీతో నడవాలని నా పాదం
నీలో భవిష్యత్తును చూస్తూ నయనం
ఓ కొత్త లోకంలోకి నెట్టింది నీతో నా ప్రయాణం.-
రెండు మనసులు ప్రేమతో ఏకమై
ఒక ప్రాణానికి ఊపిరి పోస్తే
పుట్టేదే ఆ ప్రేమకు చిహ్నం,
మరొక జీవితం.-
వాన చినుకు
నీ
చల్లని
స్పర్శతో
నాలో నూ చేరి
మదిని తేలిక చేసి
చిన్నతనపు చిలిపితనాన్ని
చిరునవ్వులతో గుర్తుచేస్తావు.
కోల్పోయిన నేస్తంలా తిరిగొచ్చి
ఊరటనిచ్చి వెళ్ళిపోతావు.
నీకూ నాకూ అనుబంధం
మాటల్లో చెప్పలేని
తీయదనం.-
పరిగెడుతోంది కాలం
పరిగెడుతోంది కాలం గాయాలను మరిపిస్తూ,
చూయిస్తోంది కొత్త దారులను మలుపులు తిరుగుతూ,
నమ్మిస్తోంది ముందు జీవితం చాలా అందమైనది అని.-
క్షణికావేశం స్వయంనాశనం
అసహనాగుణం అత్మాంతం
నీలోని ఓర్పే చిరకాల నేస్తం
జీవన్మరణాల నిత్య సంఘర్షణ నువ్వు జీవించే జీవితం
అర్థంలేని పంతాలు పనికిరావు దేనికీ
అర్థం చేసుకో
ప్రేమను పంచుకో-
ఎంతటి ఉబలాటం మనసుకు
చీకట్లో ఆ నింగి తారని తాకాలని
తాకుట కుదరదు అని తెలిసినా
కలలు కనటం మానదే ఆ హృదయం
బహుశా దానికి కూడా
తారానవ్వాలనే ఉబలాటమేమో.-
ముందుగా బాధని
పరిచయం చేసి
బరించే శక్తిని ఇచ్చి,
తరువాత అల్ప
సంతోషాన్ని కూడా
అంతులేని మాధుర్యంతో
హృదయాన్ని తాకేలా
చేయటం అలవాటు
అనుకుంటా!-
ఆకాశపు పందిరి ఆనందాల మంజరి
కోటి తారల కోవెల కమనీయ దృశ్యం
చీకటి కమ్ముకున్న వేళ వెలుగు దివ్వె
రమనీయమైన కావ్యం నీ రూపం.-