ఎండిన ఏరు అన్న వారే
నీరు నిండాక దాహం తీర్చుకుంటారు
నీవు ఇప్పుడు వ్యర్థం అనుకున్న వారే
ఏదో ఒక రోజు
నీ గొప్పతనం అర్థం చేసుకుంటారు-
పొద్దుకి పదిసార్లు కాపీ రాతలు రాసినవారు ..
ఇప్పుడు వాటిని డిలీట్ చేసి..
ఎదుటివారికి ఇప్పుడొచ్చి
నీతులు బోధించాల్సిన అవసరం లేదు
పక్కోడి రాతలు తెచ్చి కోడిరాతలు రాయలేదు .
ఇతరుల వాటికి నేను నా పేరు తగిలించుకోలేదు-
ఎవరో చెప్పింది చేసే దానికంటే
నాకు నచ్చింది చేసినప్పుడే
నేను ఎక్కువ ఆనందంగా వుంటా
ఆ పని తప్పైనా ఒప్పైనా-
మూలకు పడి ఉన్నన్ని రోజులు
కదలని బండరాయని తిట్టిన వారే
దైవం రూపంలో చెక్కిబడినప్పుడు
కాళ్ల మీద పడి మరీ
సాష్టాంగ నమస్కారం చేస్తారు👈🏿-
అంబరాన్ని చూపిస్తూ
అందలంలో ఉన్న
కన్నులకి కాదు మొక్కేది.
అవనిని స్పృశిస్తూ
అడుగున ఉండి
గమ్యాన్ని చేర్చే
పాదాలకే మొక్కుతాము-
గడిచే కాలాన్ని జరిగే నిజాల్ని
చూపించే దారులే కనులు
ఒక్కసారిగా ఆగిపోతే ఆ చూపు
భవిష్యత్తు గమ్యాలన్ని అవరోధాలు
-
మనల్ని వద్దు అనుకునే వాళ్లు
మనతో గిచ్చి కయ్యం పెట్టుకుంటారు
మనం కావాలి అనుకునే వారు
ప్రతి చిన్ని యుద్ధానికి అయినా
పెద్ద రాజీ కుదుర్చుకుంటారు-
ఒంటి మీద మోసే
వయసును బట్టి మనిషి
విలువ లెక్కగట్టలేం
మనసున మోసే
మానసిక ఉన్నతిని
బట్టి అర్థం అవుతుంది
వారి జీవితం అనుభవం-
విశ్వాసం ఉంచండి ఎప్పటికైనా
జీవితమంటే కన్నీళ్ల చిరునామా కాదు
కమ్మని కలల వీలునామా అవుతుందని-
ఇంకొకరిని నొప్పించడం రానప్పుడే
మనసుకు ఎక్కువగా నొప్పిని
బరించాల్సిన పరిస్థితి ఎదురౌతుంది-