QUOTES ON #AMATERASUTELUGU

#amaterasutelugu quotes

Trending | Latest
31 JAN 2018 AT 13:23

పునరపి జననం
పునరపి మరణం
పునరపి వృద్దా
శ్రమమే శరణం
ఇహ సంసారే
బహుదూష్ఠారే
కృపయా పారే
పాహి మురారే

-


1 MAR 2021 AT 1:36

జననం మరణం ఆశయ ఖననం
సాగే రణమే జీవన పయనం
మంచికి చెడుకి రెంటికి అందని
మధ్యలి లోకం జీవన సమరం

మానని గాయం మారని వైనం
ఆశల తీరం మహా భూటకం
మాటలు మధురం మనసున వైరం
కల్లన బతుకే జగన్నాటకం

యుద్ధం యుద్ధం యుద్ధం యుద్ధం
అనుదినమనుక్షణం తప్పని యుద్ధం
గూటికి నీటికి కూటికి కాటికి
అన్నదమ్ములకె జరిగే జగడం

హృది శాంతి కపోతం ఏ గూటినున్నదో?
మది ప్రేమ సాగరం ఎక్కడున్ననో?
అక్షయమక్షర ఆనంద సౌరభ
మకరంద సేవిత మిళిందమెక్కడో?

-


17 APR 2020 AT 0:34

నీలవేణి కురులవీడని
మేలి బంగరు సిగ పాపిడి కన్నా
కోమలాంగి భుజమును పట్టిన
అందాల వంకీలు మిన్న!
లతాంగి నడుమును శృంగార రీతిన
ముద్దులాడు వడ్డాణము కన్నా
మధువని వంటి అధరమధురాలపై
సులేపనముగా మిగులుట మిన్న!
వర్ణన కష్టం ప్రేయసి అందం
లెక్కలు కడుతూ చెప్పడానికి
చెలి చెప్పుల కంటిన ధూళిది భాగ్యమే
క్షణకాలం తనతో చరించడానికి

-


11 APR 2020 AT 22:00

తొలిమారు నిను చూసిన రోజెల్లా గురుతే
నీ సంచిలో దాపెట్టిన రోజాలూ గురుతే
ఎవరెవరా అని వెతికిన నీ కన్నులు గురుతే
నీ తలపుల మైమరచిన కలలన్ని గురుతే

చలి జ్వరమో చెలి జ్వరమో పట్టేనాపూటే
పరవశమూ కలవరమూ కలిసొచ్చేనానాడే
నిను చూడని ప్రతి ఘడియా శతృవులాగుందే
తొలిప్రేమ పరిమళమే పిచ్చెక్కిచేస్తోందే

ధైర్యంగా తొలిసారి మాట్లాడుట జ్ఞాపకమే
పరిపాటిగ ప్రతిరోజది కొనసాగుట జ్ఞాపకమే
నీ నవ్వుల చెంపలపై వాలేటి ముంగురులు,
సరసముగా ఛీపొమ్మను ఆ పెదవులు జ్ఞాపకమే

ఒంటరిగా నీతోటి మాటాడిన ఆ రేయి
ఇరువురము ఒకటయిన ఆహ్లాద దినమోయి
గుడిగంటల పలకరింపున జతకట్టిన మరుదినము
మదిగంటలు పులకరింప మనువాడిన సుదినము

-


6 MAR 2019 AT 23:54

భావపు భారాన్ని
మొత్తంగా మోసే
మెత్తటి పల్లకి
కాగితం కాగా

బాధల బలగాన్ని
ప్రాణంగా పోసుకుని
పయనించే ఝరులే
కవిత్వం కాదా

-


30 MAY 2020 AT 23:44

తరలిపోకు బాల్యమా
నా తొలి నేస్తమా
కోర్కెలు కల్మషాల
చెరను వేసి, భావ్యమా?

-


19 SEP 2020 AT 16:49

కొన్ని ప్రశ్నలకు సమాధానం
వెతకకపోవడం మంచిది.
మరి కొన్నింటిని అసలు
సంధించకపోవటమే మంచిది.

-


29 MAY 2019 AT 20:17

చిట్టి పొట్టి పిట్ట- చిన్నారి పిట్ట
మా ఇంటి చూరులోన - మసిలేటి పిట్ట
పొట్టి ముక్కు పిట్ట - పొన్నారి పిట్ట
పోసి రాళ్ల గుట్ట - నీళ్ళు తాగేనట్ట

పొద్దు పొడవగానే - లేచేను పిట్ట
పాట పాడడంలో - గొప్ప దిట్ట
తోటలోన దూరి - ఆట పాటల పిట్ట
పళ్లతోటి నింపె - చిట్టి పొట్ట

సందె పొద్దు మళ్లీ - వచ్చేను పిట్ట
చందమామ రాగ - చెట్టు వద్ద
చూరులోన చేరె - చక్కనైన పిట్ట
చిట్టి పొట్టి పిట్ట - చిన్నారి పిట్ట

-


27 APR 2020 AT 0:54

"త్రిమూర్తులు కాదు ఏకమూర్తే!", అన్నాను నేను.

"అదేంటి? - పుట్టించేవాడు, పోషించేవాడు,లయకారకుడు- ముగ్గురు కదా!", అతనన్నాడు.

"కవితని పుట్టించేది భావమే! పోషించేది భావమే!
అక్షర రూపంలో మూర్తీభవిస్తుంది కాబట్టి చావులేదు", బదులిచ్చాను.

-


28 MAY 2021 AT 0:57

మనసుతొ కూడిన నన్నూ
చూసారా ఎవరైనా
ఎచ్చోటన ఉన్నానో
చెప్తారా ఎవరైనా

-