మనసుల కలయికకు అనుమతి అడగదు
మనుషుల కలయికకు అనుమతి ఇవ్వదు-
ఆకాశమంత కాగితంపైన
ఇసుకరేణువులన్నీ అక్షరాలైనా...
సరిపోవుగా అమ్మని పొగడాలంటే!-
అదేంటో
ఇకపై బాధపడకూడదు అనుకున్న ప్రతిసారి కన్నీరు రెట్టింపు అవుతూ వస్తుంది
కానీ
ఇకపై సంతోషంగా ఉండాలి అనుకున్నప్పుడు మాత్రం నవ్వు రాదు
బహుశా
నా నవ్వు తనతోనే ఉండిపోయిందేమో-
మనకు వచ్చిన కష్టం నుంచి
బయటపడడానికి
మనకు ఒక్కదారి కూడా కనపడదు
అదే పక్కనోడి కష్టాలకు వంద సలహాలు ఇస్తాం...
-
You are
An
Oxford dictionary
Every one need it
Or had it
but no one
read it fully-
ఏమి చెప్పను అమ్మ గురించి
దేవుడికి దండం పెట్టుకోవడం కూడా తెలీదు మా అమ్మకి
నీ గురించి దండం పెట్టుకో అమ్మ అంటే
నా పిల్లలు బాగుంటే చాలు అనే అమ్మ గురించి ఏమి చెప్పను
మా అమ్మకి ఆకలి విలువ తెలీదు
తినేదానికి రమ్మంటే మీరు అందరూ తినండి
నేను తర్వాత తింటాను అంటుంది మళ్ళీ తినదు
మా అమ్మకి ఆరోగ్యం మీద శ్రద్ధ ఉండదు
ఎంత జ్వరం వచ్చినా అమ్మ ఆకలి అంటే అలాగే వెళ్ళి వంట చేస్తుంది
మా అమ్మకి కోపం ఎక్కువ
నేను సమయానికి తినకపోయినా
సమయానికి పడుకోక పోయినా
ఎప్పుడూ కోప్పడుతుంది
మా అమ్మ మొండిది
కూరగాయలు తరిగేటపుడు చెయ్యి తెగినా
అలాగే వంట చేస్తుంది కానీ తెగిన వేలికి మందు వేస్కోదు...
ఈ కోపం,అశ్రద్ధ, మొండితనం ఇన్నింటిలో
సాధారణంగా ప్రేమే ఎక్కువగా ఉన్నది మా అమ్మ....-
మీ అభిమానం వర్ణణాతీతం...
మీ పలకరింపు మాటలకు అతీతం...
మన స్నేహం ఇలాగే కలకాలం
ఉండాలని కోరుకుంటూ...
మీ జీవితం ప్రతిక్షణం
ఆనందమయం అవ్వాలని
మనసారా కోరుకుంటూ...-