బాధ్యత అనుకుంటే బరువు కాదు బంధం
ఏ కష్టాన్నీ లెక్కచెయ్యదు పేగుబంధం...
బాధలెన్ని ఉన్నా తన కడుపు కాలినా
ప్రేమగా సాకుతుంది తనబిడ్డని తల్లి....
రుధిరాన్ని పాలధారగా మార్చి పెడుతుంది...
జీవిత చక్రంలో తాను పసిబిడ్డగా మారినప్పుడు
అసరాకి అర్రులు చాచుతుంది ...
బాధ్యత బరువనుకే ఈరోజుల్లో...
ఆదరణ కరువై కన్నీళ్లు మింగుకొని బతుకుతుంది
తనని భారమనుకోని తల్లి ఇప్పుడెలా
భారంగా మారిపోతుందో...???
పొత్తిళ్లలో అందుకున్న మురిపాలు ...
అమ్మ పసిబిడ్డగా మారినప్పుడు
తిరిగి ప్రేమగా మార్చి అందించే మనిషి
పునీతుడు పూజ్యనీయుడు...
కాలచక్రం లో తన స్థానం మారడం
లిప్తపాటులో జరిగిపోతుంది.....
సంస్కారాన్ని ముందు తరాలకి
ఆచరణ ద్వారానే అందించగలం...
బంధానికి భాధ్యతలకి విలువనిద్దాం...-
22 MAR 2018 AT 10:30
27 DEC 2017 AT 1:02
ప్రేయసి / ప్రియుడు అలక లో ప్రేమ కనిపిస్తోంది కానీ......!
అమ్మ ఆవేశం లో ఆప్యాత్య.....!
తండ్రి దెబ్బ లో బాధ్యతా కనబడదు....!-