కొందరి నిజస్వరూపాలు తెలిసినా కూడా నిలదీయకు, ఎందుకంటే వాళ్లు మంచి వాళ్ళు అని చెప్పుకోవటానికి తిరిగి నీ మీదే నిందలు వేస్తారు...✨
-
సంతోషం అనేది డబ్బులోనే దొరికితే, కేవలం ధనవంతులు మాత్రమే నవ్వాలి ఈ లోకంలో...✨
-
కరిగే కాలంలో ఆనందంతో వర్షించే భాష్పాలకన్నా, కలతల కన్నీటి ఆనవాళ్ళే అధికం...✨
-
కదిలే కాలాన్ని బట్టి మనిషి మరుతాడో లేదో తెలియదు కానీ, తగిలే గాయాలను బట్టి మాత్రం మనిషి ఖచ్చితంగా మారిపోతాడు...✨
-
ప్రతి ఉదయం ఒక పునర్జన్మకు చిహ్నం, కాబట్టి నిన్నటి చెడు క్షణాలన్నింటినీ మర్చిపోయి. ఈరోజునీ అత్యంత అందమైన రోజుగా చేసుకోండి...✨
-
ధైర్యం కోల్పోయిన క్షణాలకు చెప్పు మిత్రమా.. విజయం మరెంత దూరంలోనో లేదని.. ఇంత కష్టపడ్డావ్.. ఇప్పుడు ఢీలా పడితే ఎలా, సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. సర్దుకుపోతూ సమరం సాగిస్తూనే ఉండాలి మరీ...✨
-
కోరుకున్నవన్నీ కోల్పోయిన తర్వాత ఏం జరిగినా పెద్దగా ఫరక్ పడదు, నవ్వుతూ నడవడం అలవాటు అవుతుంది అంతే...✨
-
ఒక్కసారి నటిస్తున్నారు అని తెలిసాక, ఎంత నిజాయితీగా ఉన్న నమ్మాలి అనిపించదు...✨
-
జీవితం అంటే.. ఎప్పుడో చదివేసిన పుస్తకం కాదు, ఎప్పుడూ చదవాల్సిన పుస్తకం...✨
-
జీవితంలో నటించటం నేర్చుకోకపోయినా పర్లేదు కానీ, నటించే వారిని గుర్తించటం ఎలానో నేర్చుకోపోతే చాలా నష్ట పోవాల్సి వస్తుంది...✨
-