మాటకు, చేస్టకు, ఆలోచనకు, భావనకు అంతేకాదు నమ్మకానికి కూడా శక్తి ఉందని తెలుసుకో..
-
డబ్బు అనే భయం నుండి బయటపడితే సంపద సాగరం అవుతుంది.. ప్రేమగా డబ్బును వదిలి చూడు.. అది నీ మీద ఎంత ప్రేమను చూపిస్తుందో తెలుస్తుంది.
-
ప్రపంచం బాలేదు, వాడు సరిగా లేడు, ప్రభుత్వం సరిగా లేదు అని మొత్తుకుంటున్న ఓ మనిషీ.... మొదట మారాల్సింది నువ్వే అని తెలుసుకో.. దృష్టి మారితే సృష్టి మారును అని బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీ చెప్పారు కదా!
-
తనకు తగిలిన చిన్న గాటుకి, దానికి వచ్చిన కొంచెం రక్తం చూసి బయపడి, బాధపడి, కంగారు పడే ఓ మనిషి...
నీ కంటే చిన్న ప్రాణి యొక్క గొంతు కోసినప్పుడు మరి దానికి అంతకు మించి బాధ కలుగును కదా?
ఓ మనిషి మేలుకో... సత్యం తెలుసుకో!-
సద్గురువు సత్య మార్గమును చూపెడువాడు! ఆత్మజ్ఞానము తెలిపెడివాడు!!
-
Are mama! Do this favour for me! I swear this is the last one!
I don't know how many "last one"s were there in our lives!
My bestie!-
If you really want to be a hero, be a zero in your mind first.
-
నిజానికి నువ్వు నేను అంటూ రెండు లేవు... అంతా ఉంది నేనే!!
అహం బ్రహ్మాస్మి!!-
అయ్యా! గట్టిగా గోలపెట్టి ఉద్రేకపూర్వకంగా అరిచి, బాధ పడి, బాధ పెట్టీ అహింసా జగత్ రావాలంటే ఎలా?
గాంధీజీ శాంతి అంటూ శాంతంగా తెచ్చారు స్వాతంత్ర్యాన్ని కానీ అరుస్తూ కాదు.
శాకాహార జగత్ కోసం పత్రీజి శాంతంగా చేసిన ఉద్యమం 30 సంవత్సరాలుగా కొన్ని కోట్లమందిని శాకాహారులుగా మార్చింది.
అహింసా పరమో ధర్మః
మాటల్లో, చేతల్లో, ఆలోచనల్లో నే కాకుండా మన భావాలలో కూడా అహింసాయుతంగా ఉన్నప్పుడు శాకాహార జగత్ ఈ క్షణం ఇప్పుడు ఇక్కడే జరుగును.
-
పొట్ట నింపుకొనుటకు ఆహారం కావలెను. ఆహారం ఎప్పుడు సాత్విక, శుద్ధ సాత్వికమైనదై ఉండునో అప్పుడు మానవుడు మహనీయుడగును..
-