मेरी आंखों में बहती है वो पानी
भरे हुए है उनमें दिल की कहानी
हर बूंद में दिखती हो तुम मेरी रानी
चमकती है आंखों में मेरी पयार की रोशनी-
People person
Nature lover
Scribbler rather a poet
A Lil chef
Introvert
Narcissist read more
"నీకసలు మనసే లేదా"?
అన్న ప్రశ్న నన్ను అడగగా
అపుడే గ్రహించా
నిజంగానే లేదని ఎక్కడో ఉన్న తన దగ్గరుందని
తన ప్రపంచం తన చుట్టూ....
నా ప్రపంచం మాత్రం ఎక్కడో ఉన్న తను
అది తను గ్రహించే సరికి బహుశా
ఈ ప్రపంచంలోనే ఉండనేమో నేను-
I always wanted my dreams come true not the fears
But I Guess the universe heard wrong, it has let my fears come true
And the fear was that if you ever lose interest in me-
ఆ పరిచయం నూతనం
అయితేనేం! పలకరింపులో తొణికిసలాడే సాన్నిహిత్యం
అవదా మరి ఆ ఇరువురి చిరకాల బంధానికి ఆరంభం!?
ఓ సరికొత్త జీవితానికి స్వాగతం!!-
కమ్ముకున్న బుగ్గ ఎర్రబడెనో
ఎర్రబడ్డ బుగ్గలకు సిగ్గుతో అందం వచ్చెనో-
ఓనాడు జరిగిన పరిచయం
కాలం ఏర్పరిచిన బంధం
కాలంతో దృఢమైన అనుబంధం
ఎన్నటికీ వాడని విరులు
ఆ పెదవులపై వికసించే చిరునవ్వులు
కల్మషం లేని వ్యక్తిత్వం
వెన్ను తట్టి అందించే ప్రోత్సాహం
ఎంత కాలమైతేనేమి అదే కలుపుగోలుతనం
నా అదృష్టమే గా ఆ బంధాన్ని కలవడం
కలిపిన కాలానికి కృతజ్ఞతగా కూసంత కాలం గడపడం
ఆ బంధం అలసట లేని అరుణం!!-
ఒంటరిగా ఈదుతున్న జీవిత సంద్రంలో
తోడు లేక సాగుతున్న తరుణంలో
చిరునవ్వుతో ఎదురై మొదలైన
ఆ తొలిప్రేమ
చెరగని జ్ఞాపకాలు ముద్రించగా
తన్మయం చెందదా హృదయం-
నవ్వులు చెదిరిపోతున్నాయి
ఆశలు ఆవిరవుతున్నాయి
కళలు జీవం కోల్పోతున్నాయి
కలలు కరిగిపోతున్నాయి
నడకలు ఆగిపోతున్నాయి
బ్రతుకులు భారామైపోతున్నాయి
నూతన రాజ్యంగా మారే ప్రపంచానికి
ఎన్నాళ్లీ నిరీక్షణ
ఎపుడా ఆ సామ్రాజ్యపు వీక్షణ-