భరించలేనిది
అద్వితీయమైనది-
రానే రాకుంది నా వంక
వస్తే పోయేదేముంది నీకింక
నీకై వేచివుంది చక్కనిచుక్క
వస్తే గోరింకా చిలుక లెక్క
మనల్ని చూసేవాళ్ళకి పక్క
నువు రాకుంటే గోరువంక
నీకూ నాకూ కటీఫె ఇంక
-
నీ కిల కిల నవ్వుల్లో ముత్యాల జల్లులు
నీ తడబడే అడుగుల్లో సిరి మువ్వ సవ్వడి
నీ కూని రాగాలు చిలకల్ల పలుకులు
నీ దోబూచులాటల్లో చిలిపితనం
నీ నీలాల కన్నుల్లో కొంటెతనం
నీ అల్లరి పనులతో అనుక్షణం
మమ్ము ఆనంద డోలికల్లో తేలియాడుస్తూ..!
అమ్మా, నాన్నల కంటి పాపవై,మా ఇంటి వెలుగై
కలకాలం పున్నమి వెన్నెలలా వెలుగొందాలని
మిలమిలా మెరిసే తారకలన్నీ అక్షతలుగా..
పుట్టినరోజు శుభాకాంక్షలు చిన్ని తల్లీ 🤗😍
సుశ్రీ-
ఓ బుజ్జి తువ్వాయి
ఎంత ముద్దుగా ఉన్నావో
చిరు మువ్వలు కట్టి నువ్వలా
గంతులు వేస్తుంటే చిరుమువ్వల్లో కూనిరాగాలు
పట్టి ముద్దాడాలని దగ్గరకొస్తే అందకుండా
చెంగు చెంగున పరుగులు తీసే నీ చిలిపితనం
గడ్డివాము చాటున దోబూచులాట
నిన్నే చూస్తున్న నా కళ్ళలో ఆనందం
మనసుకెంతో ప్రశాంతం
-
తొలకరి చినుకు ముద్దుకు
తడిచిన పృథ్వి సుగంధాలు వెదజల్లినట్టు..!
అలుపెరుగని అక్షర సేద్యం తో
నిరంతరం సాహితీవనంలో
ఘుప్ఫు,ఘుప్పున గుభాలించే
కవన మాలికలెన్నో,ఎన్నెన్నో
అలవోకగా జాలువారే తన చేకొసలనుంచి..!
పొగడ్తలకు పొంగక,తెగడ్తలకు కృంగక
నిరాశా నిస్పృహలకు తావివ్వక
నిజాన్ని నిర్భయంగా వెల్లడించే
తన ముక్కుసూటి తత్వం.అదరని,బెదరని పోతపోసిన గాంభీర్యం..!
నిండు నూరేళ్ళు నిత్య సంతోషంగా విలసిల్లాలని
ఆ దేవ దేవుని వేడుకుంటూ🙏🙏
పుట్టినరోజు శుభాకాంక్షలు మా🤗🤗
-
మీటినంతనే
నీ చూపుల గిల్లింతలు
నీ పలకరింతల కవ్వింపులు
వలపు కెరటాల సరిగమలు
-
వేదనకిచట ప్రవేశం లేదు పో పొమ్ము
సుఖ సంతోషాల ఆనంద విహారాలకిది నెలవు
-