అక్షరాలు కన్నీళ్లని తెప్పిస్తాయ్
హృదయం లో బాధని ముద్రిస్తాయి.
అక్షరాలు ఆనందాన్ని తెప్పిస్తాయ్
అంతులేని కలల్ని నింపుతాయి.
అక్షరాలు స్ఫూర్తిని తెప్పిస్తాయ్.
ముంచుకోస్తున్న చీకటిని పారద్రోలుతాయి.
అక్షరాలు నిరుత్సాహన్ని తెప్పిస్తాయ్.
మనసు బారాన్ని మరింత పెంచుతాయి.-
భరించగలవాడికే భగవంతుడు
బాధ్యతలు ఇస్తాడని అంటారు...కానీ
భాద్యతలు తీసుకోవాలనుకున్నాడు కాబట్టే
ఎదురయ్యే ప్రతిధీ భరిస్తున్నాడు..-
బాధలు చెప్పుకోగలగడం కూడా ఒక ఆర్ట్..
ఎంత రసవత్తరంగా చెప్పుకుంటే అంత బాధ ఉన్నట్లు...-
నిజాన్ని తెలుసుకోవడానికి చెప్పే అబద్ధానికి,
నిజాన్ని దాయడానికి చెప్పే అబద్ధానికి వ్యత్యాసం ఉంటుంది..-
"ఆమె/అతను" అని వేరు చేసి మాట్లాడే వాళ్ళ కోసమా !?
నీ గురించి కూడ నువ్ ఆలోచించుకోనంత వాళ్ళ కోసం ఆలోచించావ్...-
మునిగే వరకు చూసి చివరన చేయి అందించే వాడికిచ్చే విలువ....
మునగకుండా ముందే చూసుకున్న వాడికి ఉండదు సమాజంలో...-
ఒక మెట్టు ఏదిగాం అని చెప్పలేను కానీ
మెట్టు దిగకుండా నిలబడ్డాను అన్న తృప్తి అయితే ఉంది.-
నాకేం కావాలో అడుగుతావ్...
కానీ నీకేం కావాలో అడగడం నేనెపుడు చూడలేదు..
నా కడుపు నిండటం గూర్చి ఆలోచిస్తావ్ ...
కానీ ముందు నీ కడుపు నింపుకోవడం నేనెపుడు చూడలేదు..
నే బాధపడినపుడు ఓదార్చుతావ్...
కానీ నీ కష్టమెపుడు చెప్పుకోవడం నేనెపుడు చూడలేదు..
నే కోప్పడిన భరిస్తావ్..
కానీ పల్లెత్తు మాటైనా నువ్వనడం నేనెపుడు చూడలేదు...-
చూసేవాడికి ప్రతి ఒక్కరి గెలుపు సులభమే అనిపిస్తది...కానీ కేవలం గెలిచినోడికి మాత్రమే తెలుసు వాడు పడ్డ కష్టాలు, అవమానాలు,వెక్కిరింతలు.
-