Paid Content
-
"Sree Krishna told "
Listen to your heart and take decision.
Don't be confused by other's advice
Your heart voice is my voice .
"Bhagavad Gita "
-
కామం యొక్క ప్రభావం:
అప్పుడు అర్జునుడు ఇష్టంలేకపోయినా మనిషి పాపాలు చేయడానికి ప్రేరణ ఏమిటని అడిగాడు. కృష్ణుని సమాధానం రజోగుణం నుండి పుట్టే కామక్రోధాలే దీనికి కారణం. పొగ చే అగ్ని,మాయచే పిండము కప్పబడినట్లు కామంచే జ్ఞానం కప్పబడి ఉంది. ఈ కామం మనస్సును ఆవరించి,వివేకాన్ని హరించి మనుషులను భ్రమింపచేస్తోంది. కాబట్టి ఇంద్రియనిగ్రహంతో కామాన్ని విడువు.
శరీరం కంటే ఇంద్రియాలు, వాటికన్నామనసు, మనసు కన్నా బుధ్ధి ,బుధ్ధి కన్నా ఆతమ గొప్పది. ఆత్మ వీటన్నిటికన్నా పైన ఉంటుంది. కాబట్టి బుధ్ధితో మనసుని తద్వారా కామాన్ని జయించు.-
|| వసుదేవసుత౦ దేవ౦ క౦సఛాణూర మర్ధన౦
దేవకీపరమాన౦ద౦ కృష్ణ౦ వ౦దే జగద్గురు౦ ||
నీవు అనవసరంగా ఎందుకు దిగులుపడుతున్నావు? నీవు ఎవర్ని చూసి భయపడుతున్నావు? నిన్ను ఎవరు చంపగలరు? ఆత్మకు పుట్టుక గిట్టుకలు లేవు. జరిగినది మంచికోసమే జరిగింది. జరుగుతున్నదేదో మంచికోసమే జరుగుతోంది. జరగబోయేది మంచి కోసమే జరగబోతుంది. గతాన్ని గురించి మనస్సు పాడుచేసుకోవద్దు. భవిష్యత్తును గురించి దిగులుపడవద్దు. ఏమి నష్టపోయావని నీవు బాధపడుతున్నావు? నీతో కూడా నీవు ఏమి తెచ్చావు? ఏమి పోగొట్టుకున్నావు? నీవు ఏమి తయారుచేసావు? ఆ చేసినదేదో నాశనం అయింది. నీవు ఏమీ తీసుకురాలేదు. నీ దగ్గరున్న దాన్ని నీవు ఇక్కడే పొందావు. నీకు ఇవ్వబడినదేదో అది ఇక్కడే ఇవ్వబడింది. నీవు తీసుకున్నది ఈ ప్రపంచంనుండే తీసుకోబడింది. నీవు యిచ్చింది, ఈ ప్రపంచం నుండీ తీసుకున్నదే. నీవు వట్టి చేతులతో వచ్చావు. వట్టి చేతులతో పోతావు. ఈరోజు నీదైనది. గతంలో అది మరొకడిది. అదే ఆ తరువాత మరొకడిది అవుతుంది. నీవు దాన్ని నీ సొంతం అనుకుంటావు. దానిలో లీనమైపోతున్నావు. ఈ అనుబంధమే అన్ని దుఖాలకు మూలకారణం.
-