విశ్వ జననీ వాసవీ
మా హృదయ గీతి అందుకో....
నిత్య సింధు సత్య సింధు
మా ఆత్మ హారతి అందుకో...
కలం పారగా
గళం పారగా
సేవ వీణీయ మ్రోగగ
మా ఆత్మ హారతి అందుకో....
విశ్వజనని వాసవి మా హృదయ గీతి అందుకో....
జై వాసవి జై వాసవి🙏🙏-
మంచి వాళ్ళను కావాలని
బాధ పెట్టి క్షోభ పెట్టిన పాపం ఊరికే పోదు...
నీకు ఉరితాడుగా మారటానికి వేచి చూస్తుంది....
నీ వెంటే నీ నీడలా....!!!-
ఎండుటాకులు
పండుటాకులు
ఎప్పటికైనా నేలరాలవలసినదే తప్పదు ఏదీశాశ్వతం కాదు
నేల రాలే వరకు ఆ పండుటాకులు చెట్లకు ఎంత సారాన్ని అందించి ఉంటాయి..చిన్నమొక్క చెట్టు గా మారేదాక ఆ పండుటాకుల పాత్ర ఎంతో ఉంటుంది కదా....
మరి నీకు ప్రాణం పోసి పెంచి పోషించిన పాత్ర ధారులు ఎందుకు అభాగ్యులుగా మిగిలి పోతున్నారు...
కష్టమంటే తెలియకుండ పెంచినందుకా...
వాళ్ల కష్టమంతా ధారపోసి సాకినందుకా....
నువ్వు ఎదగడానికి సోపానమైన వారి పట్ల నువ్వెందుకు పాషాణంలా మారుతున్నావ్....
నువ్వనే చిగురు తొడగడానికి వారి జీవితాన్నే ధారపోసిన పండుటాకుల మీద నీకెందుకంత చిన్న చూపు...
నువ్వూ రేపటి పండుటాకువే.... అది మర్చిపోకు....
మనిషి ఆకారం ఉంటే సరిపోదు మనిషివన్న విషయం మర్చిపోకు!!!
-
ఆడవారి ఏడుపు
ఇంటికి మంచిది కాదు
అంటే అర్థం...
వారిని ఏడిపించకూడదనా...
ఏడిపించినా దిగమింగాలనా....
-
అమ్మంటే ప్రేమ అమ్మ ప్రేమ అమృతం
అమ్మంటే.... మాటలలో చెప్పలేని మమకారం...
అనుభవం లోనేగాని
అక్షరాల్లో చెప్పలేని అనుబంధం...
ఆప్యాయతల చరిత్రలో
చెరిగిపోని శిలాక్షరాలు అమ్మ ప్రేమ...
బిడ్డలే లోకం అమ్మ కు
ఎదుటి వాళ్ళు మా లోకం అన్నా మారదు తన లోకం...
అలుపెరుగని ఆరాటం అమ్మ
మరుపురాని మమతల మణిహారం అమ్మ....
తిరిగి ఆశించదు అమ్మ ప్రేమ...
శాసించదు అమ్మ ప్రేమ...
తప్పులెంచలేదు అమ్మ ప్రేమ...
లోపాలతో సహా ప్రేమించేది అమ్మ ప్రేమ...
తప్పు చేసిన కడుపు లో పొదుపు కుంటది కన్న పేగు
అదే కదా అమ్మ ప్రేమ... అదే కదా కన్న ప్రేమ...
బిడ్డ మనసు చిన్నబోతే విలవిలలాడుతుంది
అమ్మ మనసు...
అదే కదా అమ్మ ప్రేమ...
మమ్మల్ని కన్న మా అమ్మ ప్రేమ...
అమ్మ కు అక్షర నీరాజనాలు...
-
సిధ్దలక్ష్మి, మోక్ష లక్ష్మి, జయలక్ష్మి సరస్వతీ
శ్రీ లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా
🙏🙏🙏🙏🙏-
అమ్మ...
ఆత్మీయత, ఆప్యాయతల పంటకి అలసిపోని తోటమాలి....
మమతానురాగాల ఎరువు వేసి
ఓపిక(తో) నీటి ఊట తో
తన జీవిత(కాల)మంతా
దారపో(సే)సిన భూదేవి...
సహనంతో బంధాలను
సారవంతం చేసే సమర్థురాలు...
-
ఓ చిన్న చిరునవ్వు...
వేవేల ఆశలతో
వేచి చూస్తుంది...
ప్రశాంతమైన జీవిత పయనం కోసం.....-
నాకర్థం కాదు....
నీ ఏడుపేంది.... అసలు...
నువ్వు బాగా లేవనా...
ఎదుటోళ్లు బాగుపడ్డారనా....
జరా పని జూసుకోరాదు!!!
-