అదృష్టం on the way లో ఉంటె ,
దరిద్రం on time లో ఉంటుంది-
నాన్న
నేను మొదట పట్టుకున్న వేలు నీదే,
వర్షానికి మేఘం తోడు
నా వెంటే ఉండే నీడవి నీవు,
నా చిరునవ్వుకి కారణం నీవు ,
నా బాధకి ఓదార్పు నీవు,
నా తెగింపుకి పొగరు నీవు,
నా ఓటమికి ధైర్యం నీవు,
నా గెలుపు కి స్ఫూర్తి నీవు ,
నా తొలి గురువు నీవే ,
నా తొలి స్నేహం నీవే,
నా తొలి ప్రేమ కూడా నీవే ,
ఏమి ఇచ్చి తీర్చుకోవాలి నీ ఋణం,
నువ్వు గర్వపడేలా ప్రయత్నిస్తా ప్రతిదినం.
ఇట్లు,
సిద్దు
-
నీ పరిచయం ఒక వరం
కాపాడుకుంటా ప్రతి క్షణం
కష్టపడతా ప్రతి దినం
సాధిస్తా నా లక్ష్యం
-
నువ్వు లేని ఇల్లు
బోరు బోరు మంటుంది,
నీ తోడు లేకపోతె,
ఇల్లు నన్ను కుడా రావద్దంటుంది,
మేఘం లేనిదే వర్షం కురవదు,
నీవు లేనిది ఇంట్లో ఆనందం లేదు,
డబ్బు కోసం ప్రయాణించే బాటసారి,
ఎపుడు తిరిగొస్తావ్ అని చూస్తుంటా ప్రతిసారి,
కాలక్షేపానికి వెతుకుంటున్న ఏదో ఒక దారి,
అలిసిపోయి ఒచ్చిన ,
ఆలస్యం గా ఒచ్చిన,
కడుపు నిండా కూడూ పెడ్త,
కంటి నిండా నిద్ర చేరే దాక కాపు కాస్త
కబుర్లు చెప్తా,
త్వరగా వచ్చేయవా,
-
అనుకోకుండా పరిచయం అయ్యావ్,
తెలియకుండా తోడు అయ్యావ్ ,
ఊహించలేని ఆనందం అయ్యావ్,
భారం కానీ బాధ్యత అయ్యావ్ ,
దూరం వెళ్ళిన దారి తప్పని ఆలోచన అయ్యావ్,
నవ్వుని పంచుకునామ్,
బాధని చెప్పుకునామ్,
ఒక ఏడు ఈ ప్రయాణం
మరువలేనిది,
మర్చిపోలేనిది,
వీడలేనిదా, వీడిపోతుందా ?
కాలానికే ఒదిలేద్దామ్,
అప్పటివరకు,
నిక్కి సిద్దు
-
ఓటమి ?
కోరుకున్నది దక్కకపోతే అదృష్టం లేనట్టు,
రావాల్సింది రాకపోతే రాసి లేనట్టు,
చేరాల్సింది చేరకపోతే గమ్యం లేనట్టు,
చేయాల్సింది చేయకపోతే చేతకానట్టు,
భయం లేకుండా బ్రతికేసా,
బాధ్యత తో అడుగులు వేసా,
అర్ధం కానీ నవ్వుతో గడిపేసా ,
నా కధ కి చివరి మలుపు,
తన పిలుపు,
ఇదే నా గెలుపు-
Being with me is 50% memes and terrible humour, 20% me being shy and 10% being sarcastic and 30% me pathetically confessing how much I admire and 💛 you
-
Dear someone,
Days ago, on the day you cried,
You confessed your dystopia,
Suspended from your happiness,
Your higher calling called on me,
Knew at once no guarantee,
To hold your heart with both my hands,
Warm it up as best as I can,
Tell me, what pain made you so sorrow?
I will distill it all from you,
I wont let this infection spread,
All your past aches, i l help you shed,
Whatever poisoned you before,
I will takecare and I will adore,
I l heal your wounds and with great care,
I know its not within my right,
But i cant see you losing the fight,
If you dont ease your source of pain,
Forever it will remain with you,
I swear, I m only trying to aid
The more I do, the more you might hate,
In this journey, let me be with you,
Together we will distort away this pain
And relieve you from all strain
-
చెలితారా ,
నీ కళ్ళు చూసి నేనేమి మంత్రముగ్దుడ్ని కాలేదు,
నీ ముఖారవిందం,
నీ పెదవులు,
నీ కురులు,
నీ నడుము ఒంపు,
నీ రూపు రేఖలు,
నన్నేం ఆకర్షించలేదు,
నా అక్షరాలా ఆరాటం,
నీకు అందాన్నిచ్చింది,
-
అమ్మ భరించే తొమ్మిది నెలల నొప్పులు,
నాన్న పెంచడానికి పడే తిప్పలు,
20 ఏళ్ళు అక్షరాలా వెనుక వేసే అడుగులు ,
8 ఏళ్ళు డబ్బులు కోసం వేసే పరుగులు,
వెళ్లే దారిలో ఎన్నో పరిచయాలు,
చివరి దాక తోడు వచ్చే స్నేహితులు,
గుణపాఠాలు నేర్పించే ఆకర్షణ ,
అనుబంధం గా మారే ఒక్క ప్రేమ,
ఆ ప్రేమకి ప్రతి రూపంగా పిల్లలు,
మళ్ళి వాళ్ళ కోసం కనే కలలు,
ఇంతేనా జీవితం?
-