శ్రీధర్ వనపర్తి   (గాయత్రీ ✍️)
179 Followers · 40 Following

Joined 11 April 2019


Joined 11 April 2019

పరిస్థితులతో పోల్చుకోవడం ..
పగిలిన అద్దంలో ముఖం
చూసుకోవడం రెండు ఒకటే ,.
ఈ రెండు నిన్ను తక్కువ చేసి
చూపిస్తాయి ..,— % &

-



త్రిశంకు స్వర్గం త్రివర్ణ స్వప్నం ,.
కత్తుల ఒడిలో కాలిన స్వప్నం ,.
తీరని కష్టం రావణ కాష్టం
రగులుతోంది రణరంగ భారతం ..,— % &

-



" నీకు చదవడం తెలిస్తే
ప్రతి మనిషి జీవితం
ఒక పుస్తకం అవుతుంది ,,— % &

-



మనిషికి ఉపయోగపడని
భూమిని పోరంబోకు భూమి
అంటారు ,.
సమాజానికి ఉపయోగపడని
మనిషిని పోరంబోకు మనిషి
అనాలి ..,— % &

-



దూరమయ్యాక గతాన్ని
తవ్వుకుని బాధపడటం కంటే
కలిసి ఉన్నప్పుడు అపార్థాలను
పూడ్చుకుని ఉండటం మంచిది ,.
గోడకూలితే మళ్ళీ కట్టుకోవచ్చు
కాపురం కూలితే కట్టుకోలేము ..,— % &

-



చదివిన కొద్దీ అర్థం
కాకపోగా
అయోమయంలో పడేసే
అందమైన పుస్తకమే మగువ ✍️— % &

-



నీకు నచ్చినట్లు నువ్వుండాలి
అంటే ధైర్యం కావాలి ..
ప్రపంచానికి నచ్చేలా
ఉండాలంటే సర్దుకుపోవాలి ..,— % &

-



" మనిషి లోపలి బాధకు
అమ్మ అంటాడు ,.
బయట బాధకు అబ్బ అంటాడు ,.
లోపలి బాధను అమ్మ తీరిస్తే
బయట బాధను నాన్న తీరుస్తాడు ,,— % &

-



ఎదుటి వాడి ప్రవర్తన నచ్చితే
మంచివాడిలా కనిపిస్తాడు ,.
నచ్చకపోతే చెడ్డవాడిలా కనిపిస్తాడు ,.
అంతేకానీ ఇక్కడ
మంచి చెడు అంటూ ఏ రోజు
ప్రత్యేకంగా వుండదు ..,— % &

-



నీవు మంచి అవకాశాన్ని
మిస్ అయితే
నీ కళ్ళను కన్నీటితో నింపవద్దు ,.
ఎందుకంటే అది నీ ముందున్న
మరో మంచి అవకాశాన్ని
దాచిపెడుతుంది ..,— % &

-


Fetching శ్రీధర్ వనపర్తి Quotes