మనసైన వారు వస్తున్నారని చూసే ఎదురుచూపులో ఉంటుంది మనసుకి ఆనందం..
రావడం లేదని తెలిస్తే అదే మనసులో కలుగుతుంది ఎదో తెలియని భారం..
మనసున ఉన్నవారు అనుకోకుండా ఎదురుగా వస్తే ఆశ్చర్యంతో మాటలేరాని మౌనం..
మళ్ళీ మనల్ని వీడి వెళ్లిపోతారు అనే ఊహే భరించలేక తెలియని ఉద్వేగం..Seshi Rekha.N✍
-
జీవితం ఎవ్వరికి సాఫీగా సాగదు
సమస్యల వలయంలో తిరుగుతూనే ఉంటుంది
మనకి కలిగిన సమస్యలకి మనం ఎలా స్పందించాలి వాటి నుంచి ఎలా బయటపడాలి అనేది మనం చేసే ఆలోచనా విధానం పైనే ఆధారపడి ఉంటుంది..Seshi Rekha.N✍-
ప్రేమ అనేది ఒక మాయా ప్రపంచం
మనల్ని పట్టించుకోకపోయినా మనసున ఉన్న వారిని మరువలేము
మనమే కావాలని కోరుకునే వారిని మనసున
చేర్చలేము
గతం అనుకుని వర్తమానాన్ని ఆనందించలేము
సాగుతున్న జీవితంలో ఆనందంగా ఉండలేము
ఇదే ప్రేమ మాయ...Seshi Rekha.N✍
-
అనుకోకుండా జరిగిన సంఘటనకి ఏమి తోచక బాధ పడుతూ సమయాన్ని వృధా చేసేకంటే మనసుని దృఢంగా చేసుకుని లేని ధైర్యం
అయినా తెచ్చుకుని ఆ పరిస్థితి నుంచి బయటపడితే మిగతా పరిస్థితులు అన్ని అవే అనుకూలంగా మారతాయి..Seshi Rekha.N✍-
సంతోషంగా సాగాల్సిన నా జీవితంలో ఇతరులు వలన మనశ్శాంతి లేకుండా పోయింది అని అనుకోవడం అవివేకం..
స్వతహాగా నేను చేసిన తప్పిదాల వలనే మనశ్శాంతి పొగుట్టుకున్నాను అని తెలుసుకోవడం వివేకం.Seshi Rekha.Narina✍-
మూడురోజుల ముచ్చటైన కాంతి సంక్రాంతి
హరిదాసుల సంకీర్తనలు
గంగిరెద్దుల డోలు సన్నాయిలు
గుమ్మాలకి మామిడి తోరణాలు
ముంగిట్లో రంగవల్లుల చిత్రాలు
సాంప్రదాయ వంటల ఘుమఘుమలు
మంచుతెరల మధ్య భోగిమంటల సందడులు
రివ్వురివ్వున ఎగిరే గాలిపటాలు
కోడి పందాల సమరాలు
కొత్త అల్లుళ్లతో సరదా సంబరాలు
అన్ని కలగలిపి ఆత్మీయులందరు ఒక్కచోట కలసి జరుపుకునే ఆనందాల సంబరాల సంక్రాంతి..💐 సంక్రాంతి శుభాకాంక్షలతో మీSeshi Rekha.N
-
అప్పటివరకు మనకి తెలియని విషయం కొత్తగా తెలిసింది అంటే దాని వల్ల
ఉపయోగం ఉందని గ్రహించి
దృష్టి సారించడం మొదలుపెడితే మనం చేరుకోవాలి అని అనుకున్న లక్ష్యానికి ఉపయోగం అవ్వవచ్చు..Seshi Rekha.N✍-
మన ఆలోచనలలో మార్పు వచ్చినపుడు మన చుట్టూ అల్లుకుని ఉన్న ప్రతి విషయంలో మనకి ఎంతో మార్పు కనపడుతుంది
కానీ ఆ ఆలోచనలు అనేది ప్రతికూలం నుంచి అనుకూలంలోకి వచ్చినపుడు మాత్రమే అది సాధ్యం..Seshi Rekha.N✍-
దుస్తులకి సువాసన పూసుకున్నంత మాత్రానా
ఒంటికి ఉన్న మాలిన్యం పోదు
అలాగే నాది నేను అనే అహం ఉన్నంతవరకు
మనసు నిర్మలం అవదు..Seshi Rekha.N✍
-
మనసు ప్రశాంతంగా ఉంటే ప్రయాణం ఎంత హాయిగా ఉంటుందో
గందరగోళంగా ఉన్నపుడు అంతే చికాకుగా ఉంటుంది అందుకే అలసిపోయామని అడ్డదారిలో వెళ్ళేకంటే
ఆలస్యం అయినా రహదారిలో వెళ్లడం ఉత్తమం..Seshi Rekha.N✍
-