మనుషులను పెంచాను మోసగించారు
మొక్కలను పెంచాను ఫలాలనిచ్చాయి!-
ముదినేపల్లి మడిచేలో...
కృష్ణమ్మ పరవళ్ళ క... read more
నిందించే వాళ్ళని నిందించనీ
దోషిగా చూసేవారిని చూడనీ
దేవుడే నిన్ను ప్రేమిస్తుండగా
నీకు చింతయేల?
-
నా ప్రియమైన కుమారులారా
నాలాంటి చేతకాని తండ్రి మీకు ఉండకూడదు
కానీ ఏం చేస్తాం
ఏమీ చేతకాని నేనే మీ తండ్రిని
-
కాలం ప్రతీ ఒక్కరినీ సరికొత్తగా
వరుస పెట్టి మరీ పరిచయం చేస్తూ వుంది
వారి అసలు రూపం ఇదేనని!-
మనల్ని ప్రేమించేవారు మనకు దూరమైతే
మనం బాధపడాలి గాని
మోసం ముసుగు మాటునుండి
మనల్ని పదే పదే మోసగించేవారు
మనకు దూరమైతే ఆనందపడాలే తప్ప
అసలు చింతించగూడదు.-
మోసపరులు మంచివారిని చంపేస్తే
ఈలోకం ఊరుకున్నా
కాలం ఊరుకోదు
దేవుడసలే ఊరుకోడు.-
కాలం నామీద తిరగబడిందా లేక
ఈ కాలం మనుషులు తిరగబడుచున్నారా
కాలమెప్పుడూ తన కర్తవ్యం తాను నిర్వర్తిస్తుంది గాని
మనుషులే కాలాలు గడిచే కొద్ది
మనుషుల వలే కాక మృగాల వలే మారుచున్నారు-
ఆర్ధికంగా నేను సహాయపడలేను గాని ఎందుకంటే నా బ్రతుకే ఆర్ధికంగా అధ్వాన్నం
నన్ను ఏదైనా పని చేసిపెట్టమని ఎవరైనా సహాయం కోరితే చేయకుండా ఉండలేను
అటువంటి నన్ను ఎవరైనా కావాలనే కోల్పోయారంటే అది తప్పక వారి మూర్ఖత్వమే.-
మీకు నచ్చినట్లు బ్రతకడానికి
ఇది మీ జీవితం కాదు, నా జీవితం
నా జీవితాన్ని నాకు నచ్చినట్లు
నన్ను బ్రతకనివ్వండి.
మీ సలహాలు తీసుకునేంతగా నేను బ్రష్టుపట్టిపోలేదు
చెడు త్రోవలో నడవకుండా నా అంతరాత్మ చెప్పింది నేను వినగలను
మీ మాటైతే వినాల్సిన అవసరం నాకు లేదు-