నువ్వు fail అయినప్పుడు అందరూ నిన్ను పక్కకు పెట్టడం సర్వసాధారణం దానికి పెద్దగా feel అవ్వాల్సిన పని లేదు ఎందుకంటే వాళ్ళకి నీ మీద నమ్మకం ఒక్కటే లేనట్టు లెక్క.ఇంకొకళ్ళు ఉంటారు నువ్వు success అయినప్పుడు దాన్ని చూసి ఒర్వలేక నిన్ను పక్కకు పెట్టేస్తారు ఎందుకంటే వాళ్ళకి అసలు నువ్వుంటేనే గిట్టదు.ఎప్పుడైనా నువ్వు fail అయినప్పుడు వదిలేసే వాళ్ళకంటే నువ్వు success అయినప్పుడు నిన్ను వదిలేసే వాళ్ళే ఇంకా danger.
-
ప్రపంచంలో ఉన్న ప్రతీ మనిషి సగటు జీవితం లేబర్ మీద ఆధారపడి ఉంటుంది.ఆధునిక కట్టడాలకైనా,నాగరికతకైనా ఒక రోజువారి పనులకైనా అది లేబర్ వల్లే సాధ్యం అవుతుంది.ఒక్కటి గుర్తుపెట్టుకో నువ్వు లేకపోతే labour కి ఏమీ నష్టం లేదు కానీ ఒక లేబర్ వాడు లేకపోతే నువ్వు లేవు.
-
పైసల్ ఉంటే నువ్వు హీరోవి మాత్రమే అవుతావ్, అదే power ఉంటే నువ్వు హీరోకే అమ్మామొగుడివి అవుతావ్. అందుకే power ఉన్నోడి దగ్గర ఆధిపత్యం, అధికారం రెండూ చెలాయించలేం. యుగాలు మారినా, తరాలు మారినా అందరూ తలొగ్గేది, గజగజ వణికేది ఒక్క power ఉన్నోడి దగ్గర మాత్రమే.
-
భారతదేశంలో ఎప్పుడైతే జనులు అందరూ కుల, మత, భాష, ప్రాంతీయ భేదాలు లేకుండా జాతీయవాద(Nationalist) భావాలు కలిగి ఉంటామో అప్పుడే బాగుపడతాం. మన దేశానికీ స్వాతంత్రం వచ్చింది కూడా ఇలాంటి భేదాలు పక్కన పెట్టినప్పుడే. ఏదైనా సమస్య లేదా విపత్తు వచ్చినప్పుడు మాత్రమే కలిసి పోరాడడం నేర్చుకున్న మనం, ఉట్టిగా ఉన్నప్పుడు కూడా ఏకత్వం పాటించాలి. అప్పుడే దేశంలో ఒక సమైక్యతా భావం అనేది ఏర్పడుతుంది.
-
మానవుడిగా పుట్టి స్వార్ధానికి పోయి ప్రకృతికి అన్ని విధాలుగా అన్యాయం చేసేసి మనం చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చుకుని దేవుడు మన అందరికి ఎదో అన్యాయం చేసేసాడు అని తన మీద నింద వేస్తే ఎలా? మనమంతా జరగబోయే విపత్తుని గ్రహించకుండా అన్ని మర్చిపోయి మౌనంగా ఉంటే ప్రకృతి చేసిన గాయాన్ని మర్చిపోతుందా? మనం చేసిన తప్పులన్నిటికీ అనుభవించాలి లేదా చేసిన తప్పులన్నిటి నుండి పరివర్తన చెంది ఇప్పటికైనా ప్రకృతితో కలిసి బతకడం నేర్చుకుందాం. కరోనా మహమ్మారి అనేది దేవుడు పెట్టిన శాపం కాదు, దేవుడు సృష్టించిన ప్రకృతి మనకి నేర్పిన గుణపాఠం. ప్రకృతిలో భాగం అవుదాం, ప్రకృతితో ఐక్యం అవుదాం. మన ప్రకృతి మన సొంతిల్లె అనే భావనతో కాపాడుకుందాం.
-
సింహం బోనులో ఉంది రోజూ ఎదో ఒక మాంసపు ముద్ద పడేస్తే తినేసి హాయిగా పడుకుంది. అడవిలో ఉన్న సింహానికి మాత్రం ఒక రోజు ఆహారం ఎంతకీ దొరకలేదు, ఒక్క సరైన వేట కోసం ఎదురుచూస్తోంది సరిగ్గా అదే సమయానికి ఒక అమాయకమైన జింక కొంచెం దూరంలో ఉంది దాన్ని వేటాడి మరీ చంపి తినేసింది అప్పుడు నిద్రించింది. ఇక్కడ matter ఏంటంటే రెండు సింహాలు తిన్నాయి పడుకున్నాయి కానీ అడవిలో ఉన్న సింహానికే పొగరు ఎక్కువ దానికి ఉన్న విలువే వేరేలా ఉంటుంది. అలాగే ప్రతీ మనిషి దేనికోసమైనా అలమటించాలి అడవిలో ఆకలితో ఉన్న సింహం మాదిరిగా కసితో పరిగెత్తాలి ఒకవేళ success వచ్చినా, రాకపోయినా.
-
Be ruthless,merciless and dominant until you get success. That's the only way to win in life.Fight for what you want and dare for whatever you believe.
-
మనకెందుకులే అని వదిలేస్తే ఎందుకు రా పట్టించుకోవట్లేదు అంటారు తీరా ప్రతీ విషయం పట్టించుకుంటే నీకు సంబంధం లేని విషయాల్లో కల్పించుకోడం అవసరమా అంటారు ఏమిటో ఈ జనాలకి బతుకు మీద ఉన్న ఉబలాటం.
ఇక్కడ matter ఏంటంటే ప్రతీ ఒక్కడు వాడి privacy ని కెలకమని వాడే అవతలవాడికి చెప్పి మరీ దాన్ని నాశనం చేసుకుంటాడు. మన దేశం సగం సంకనాకిపోయేది ఇలాంటి వాళ్ళ వల్లే ఇంకో సగం ఇలాంటి ఎదవల మాటలు పట్టించుకోవడం మూలాన. ఇలాంటి వాళ్ళని మనం పక్కనబెట్టి ముందుకు వెళితే మనలో విజ్ఞత పెరిగి వివేకవంతుల్లా ఆలోచిస్తాం తద్వారా మన దేశంలో పురోగతి అనేది పెరుగుతది.-
మనకి ఏదైనా బాగా కావాల్సింది దక్కకపోతే చాలా బాధపడతాం ఎంతగా అంటే అది miss అయ్యింది అని మనం పుట్టడం ఎందుకు రా భగవంతుడా అని అనుకునేంతగా బాధపడటం సరిగ్గా ఆలోచిస్తే అది నీకు దక్కాలంటే నీకు ఉండాల్సిన అర్హత ఏంటి అని ఆలోచించు నీకే అర్ధం అవుతుంది నువ్వు దానికి ఎంతగా సరిపోతావా లేదా అని. ఈ ప్రపంచంలో భగవంతుడు అందరికి కావాల్సిన నూకలు పడేస్తాడు మనం దానికోసం వెతుక్కోవాలి అంతే, పక్షికైనా దేవుడు దాని గూట్లో ఆహారం ఏమి పడేయడు అది వెతుక్కోవాలి అంతే. జీవితంలో ఏదైతే నీకు దక్కట్లేదో దానికి ఉండాల్సిన అర్హత కోసం కష్టపడు అప్పుడు కావాల్సినవన్నీ నీకే దక్కుతాయి ఎందుకంటే అర్హత అనేది ఒకళ్ళు ఇచ్చేది కాదు నువ్వు సాధించుకుంటే వచ్చేది.
-
ఎక్కువ పనులు ఉన్నా ప్రశాంతంగా ఒక్కళ్ళమే చేసుకోవచ్చు కానీ negative నా కొడుకులు మన చుట్టూ ఉంటే చిన్న చిన్న పనులు చేయాలన్నా ఏదో విసుగ్గా ఒక burden లా feel అవుతాం. అందుకే ఎవరి అవసరం ఉన్నా లేకున్నా ఎక్కువ పనులు చేయడం నేర్చుకోవాలి లేకపోతే ఒక independent వ్యక్తిలా society లో బతకడం చాలా కష్టం అయిపోతుంది.
-