కష్టమొస్తే
కాళ్లు ఇరగొట్టి పంపించకుండా
కాళ్లు కడుక్కోమని ఆహ్వానించేవే "కన్నీళ్ళు"-
విలువలే ఆస్తి
తుమ్మితే ఆగలని చాలమంది అంటూ ఉంటారు
ఇక్కడ తెలియని విషయమేంటంటే
ప్రపంచంలో సెకనుకి 27వేలమంది తుమ్ముతారంట
దాన్నే కనక నమ్మితే ప్రపంచమే ఆగిపోవాలి
-
ప్రేమనేది అందంతోనే ముడిపడి ఉందంటే పెళ్ళైన ప్రతిజంట ముట్టుకుంటే డాగడిపోయేలా ఉండాలి లేదా గుడ్డోలైనా అయ్యుండాలి,అలా లేదు కాబట్టే మన తాతాఅమ్మమ్మల్ని యవ్వనం అయిపోయినా కూడా ఇంకా కలిసుంటూ చూడగలుగుతున్నాం.
-
ఏ ప్రయాణమైనా ఓటమి నుంచి గెలుపుకి వెళ్తుంది కానీ జీవితం అనే ప్రయాణం ఒక్కటే, పుట్టుక అనే గెలుపు నుంచి చావు అనే ఓటమికి వెళ్తుంది మనం ఏ క్షణమైనా ఓడిపోవచ్చు ఈలోగా ఉన్న ప్రతి క్షణాన్ని గెలుద్దాం,సాధిస్తూ కాదు ఆస్వాధిస్తూ
-
"అన్నీ ఉన్నప్పుడు నీతో పక్కాగా ఉంటారు వాళ్ళు కాదు,
ఏమిలేనప్పుడు కూడా నీతో పక్కనే ఉంటారు వాళ్ళు నిజమైన స్నేహితులు"-
అమ్మ ఎలాంటిదంటే
ప్రళయం వచ్చి ప్రపంచం అంతమైపోతుంటే
కొనఊపిరిలో కూడా బిడ్డే బతకాలనుకుంటాది,
బహుశా అమ్మలందరికి జన్మహక్కేమో
దరిద్రంలో కూడా గంజి నీళ్ళు పిల్లలకి ఇచ్చి
కన్నీళ్ళు తాగి పడుకోవడం
-
అమ్మలాంటిదె మనసుకూడా,
అమ్మ బిడ్డకెలా జన్మనిస్తుందో
మనసు ప్రేమకలా జన్మనిస్తుంది
కాకపోతే అమ్మ బిడ్డని పుట్టకముందు మోస్తుంది,
మనసు ప్రేమని పుట్టిన తరువాత మోస్తుంది...
-
నిప్పుని వాడుకుంటే వెలుగిస్తుంది అని అందరికి తెలుసు కానీ పట్టుకుంటే గాయపెడుతుంది అని చెప్పే గొప్పోల్లే "గురువులు"
-