Saivarun Sidda   (Kadilina Manasu)
11 Followers · 10 Following

Joined 19 March 2019


Joined 19 March 2019
29 APR 2022 AT 11:27

గుండెలోతుల్లో పదిలమాయెనె,
తీరం ఎరుగని కథలన్నీ!
లోలోన మధనపడుతూ,
ఎల్లప్పుడూ కలవరపెడుతూ!
మనసున నిలిచిన స్మృతులన్నీ,
రంగులు మారుతూ,
కంటిపాపల్లో నిదురిస్తున్నాయి కొత్తగా!!
గమ్యానికై నిరీక్షస్తూ,
రేపటి కోసం ఎదురుచూస్తూ!!
రాని రేపటి ఒడిలో,
నేటినంతా నిక్షిప్తం చేస్తూ,
అలసిన ఎదురుచూపులన్నీ,
సొలసి, సొమ్మసిల్లి,
నిరాశల ధారలై,
బైలెల్లి పోతున్నాయి!
మనసుని తడుముతూ,
మనశ్శాంతిని వెతుకుతూ!
కన్నీరెంత అదృష్టం చేసుకుందో కదా!!




-


17 JAN 2022 AT 12:57



నీ వెన్నంటె వస్తున్న నన్నే చూస్తూ,
ఓ సారి చంపలు తడుముతూ,
మరో సారి చిలిపిగా కసురుతూ,
నీ మాటే వినక, నన్నే చేరేటి
కురుల పైనే, నీ కోపమా?
విప్పారిన కురులే, నీకందం!
మూతి ముడుపుతో సిగని ముడిసి,
నువ్వు చెయ్యకే, విధ్వంసం!
పొడవైన ధారలన్నీ, పరిమళాలనే వెదజల్లే!
సుగంధాల గాలులు లేక, ప్రాణమే పోతుందే!
నా ఊపిరి నువ్వయితే!
నువ్వే జత కాకుంటే?
ఈ ప్రాణం, ఇంకెట్ల నిలకడగుంటుందే?
నీ కురులే అలలయ్యి, అలజడి సంద్రాన్నే తెస్తాయే!
నా పాలిట దేవతవే, కాస్తయినా కరుణించే!
లోకానికి తెరకట్టి, నాతో నీకు ముడిపెట్టి,
నా చూపులు నీ వైపు, మళ్ళీ మళ్ళాయే!
ప్రేమంతా కలబోసి! పూవల్లే విరాబూసి!
నా పక్కన నువ్వుంటే! ఈ లోకంతో నాకెంటే?
పెదవంచుల్లోని ఈ మౌనం, కన్నార్పక చూస్తుందే!
నీ కురులను దాటి, మదిని చేరే రోజెపుడోస్తుందే?

-


12 JAN 2022 AT 14:39


అందమైన వెన్నెలమ్మ, అలక నేర్చింది కొత్తగా!
పున్నమి చంద్రుడి ఛాయలన్నీ, చినబోయాయి వింతగా!
గమ్మునుండే గగనమంతా గాబరై, గుబులు పడుతాంది గమ్మత్తుగా!
నీ చిన్ని కన్నులు, మెల్లగ విరిసిన, నవ్వుల పూవులకి, సరితూగక!
నీ సన్నని నవ్వులు, వెన్నంటే తెచ్చిన, తాజా కాంతులతో, పోటీ పడలేక!
నీ ముత్యాల నవ్వులు వెదజల్లిన, నీ కంటి కాంతులు,
అంబారానికే జీవం పోసి, కొత్త సంబరాలను దరికి చేర్చే!
హరివిల్లును హారం చేసి, వెన్నలమ్మనే ఓదార్చే!
పసిడి వర్ణపు పూతలు పోసి, చంద్రయ్యనే ముస్తాబు చేసే!
నీ తేజస్సు, పున్నమి రేయికే నూతన శోభలద్దే!
పునర్జన్మనెత్తిన ఆకాశం,
తళుకు తళుకున మెరుస్తూ,
హర్షగర్జనలు చేస్తోంది,
తనకి ప్రాణం పోసిన దేవతని,
ఆనంద భాష్పాలతో అభిషేకించడానికి!
అందానికే అద్దంపట్టే ఓ మాగువా!
ఇలపై, ఇలా, అలమటిస్తోంది ఒక ప్రాణం!
కన్నీటి సిరలను ధారపోస్తూ,
నిత్యం తన ప్రేమాన్ని అభిషేకిస్తూ!

-


26 DEC 2021 AT 2:53

ఆమె
కదులుతున్న మబ్బలలో,
కలవరమే మొదలాయే!
నీ నవ్వుకి మైమరచి!
గమ్యాన్నే మరచిపోయి!
మదిలోని భారమంతా,
మాటే చెప్పక జారిపోయే!
ఆ నవ్వులోని చల్లదనానికి,
మైమరచిపోయి!

-


3 NOV 2021 AT 1:57

బతుకు బండిని,
ముందుకు లాగేందుకు!
కుటుంబ భారాన్ని,
భుజాలపై మోస్తూ!
పరిస్థితులు పరిచయం చేసిన,
దారులను తొక్కుతూ!
వేసే ప్రతీ అడుగు,
తన ఆశలని, ఆశయాలని
అణగదొక్కుతున్నా!
తరిగే దూరం,
మదిలో భారాన్ని నింపుతున్నా!
నవ్వుతూ నటిస్తాడు!
నటిస్తూ జీవిస్తాడు!
అతడే నాన్న!!

-


18 JUL 2021 AT 23:35

నువ్వు పక్కనున్న ప్రతీక్షణం జ్ఞాపకమై మదిని చేరి,
వేగంగా కాలాన్ని ముందుకు తోస్తున్నప్పుడు తెలియలేదు,
నువ్వే నా ధైర్యమని!
నువ్వు పక్కనలేని క్షణాలను, లెక్కబెడుతున్నప్పుడు తెలియలేదు,
లెక్కలకైనా లెక్కకందని సంఖ్యలున్నాయని!
ఎదుపరుచూపులోనూ, ఆనందం వెతికేటి మనసుకి, అసలే తెలియలేదు,
కన్నీటినే, సమాధానంగా పొందాల్సిన క్షణం, ఒకటుంటుందని!
నీ జ్ఞాపకాలను మోస్తున్న మదికి తెలియలేదు,
భారంగా మారే రోజొకటి, ఉంటుందని !
ప్రేమ, అనురాగం, ఆప్యాయత, అనుబంధాలను,
నీతో పంచుకున్నప్పుడు తెలియనేలేదు,
ద్వేషం, కోపం, బాధ, అసహ్యం అనేవి ఉంటాయని,
అవి నాపై నాకే కలుగుతాయని !
మన పరిచయం మొదలైనప్పుడు తెలియలేదు,
చివరకు మిగిలేది నాకు నేనే అని,
నువ్వు లేని ఆ నేను, ఎవరో అని !
నువ్వే లేని, నేనెవరంటే ?
నాకు కూడా అది తెలియదులే !
చలనం లేని జీవాన్నేమో !
ప్రాణం ఉన్న శవాన్నేమో !

-


2 AUG 2020 AT 11:17

It is still alive !
In the sad reality of your happiness
Being turned into tragedy
On realising that
the person you were talking to, isn't she
It is still alive and lives on
Within the tears, you shed for
Under the shade, of that killing smile
Which kills you everytime
Until your last breath

-


2 AUG 2020 AT 11:12

Once a bond is formed
It can never be broken!
Even if it's weakened,
it is still alive !
Somewhere, deep inside your heart
Within the memories you made
Somewhere, in the thoughts of your heart
that remind you of her all the time
It is still alive !
Behind-the-scenes !
Which broke your heart
Beneath the fire!
Which put all your hopes to ashes
It is still alive !
In the smell of your bedsheet,
Which shared all your pain
in the darkest of nights

-


17 JUL 2020 AT 11:08

Oh My dear cute little princess !!
What else is needed!
Than, leading two lives
One as a friend in your heart!
And the other,
as an unknown admirer in your thoughts
What else is needed!
When the fragrance, of your presence
Presents a flavour of blush to all the smiles
That arose from the heart,
from the roots of bountiful love
That hidden deep inside
What else is needed !
Than, rejoicing your unseen annoyance
Than, sharing your untold happiness
And ofcourse! For being the reasons behind
Either expressed or demolished
Either accepted or rejected
I'll always be here, waiting for your arrival
Whatever it happens,
However it goes,
You're always my cute little crush

-


8 JUL 2020 AT 14:14

I never realised that,
it hurts more than the depressed thoughts !
when ignorance replies, instead of the person !!
And when I got realised !!
You were struggling between life and death
How weak you are
And how cruel we all were !!
It's not a suicide but a murder !
Being bullied by the art of ignorance !
Being the reason, for losing the one last hope !!
It's a mysterious murder !!

-


Fetching Saivarun Sidda Quotes