"అమ్మ" తాను తిన్న తినకపోయినా పిల్లలు కడుపు నిండితే చాలు అనుకుంటుంది..!!
-
ప్రతి ప్రాణికి నిజమైన గురువు ఎవరంటే "ఆకలి"
"ఆకలి" "అవసరం" ప్రతిదీ నేర్పిస్తుంది..!!-
BMW కార్లు లో తిరిగిన రోడ్డుపై బిక్షం ఎత్తుకొని బతికిన కోట్లు సంపాదించిన కు కూటికి లేకుండా బతికిన ప్రపంచ అందాల పోటీలో పాల్గొన్న అందహీనంగా ఉన్న రాజభవనంలో పడుకున్న పూరి గుడిసెలో జీవితం గడిపిన మనిషి దేహం చేరాల్సిన గమ్యాస్తలం ఇదే చివరికి కాలి బూడిద కావాల్సిందే అతిగా ఆశపడకు ఉన్నదాంట్లో తృప్తిగా బతకడం నేర్చుకో..
-
వీడు మంచోడు వాడు మంచోడు అనే రోజులు ఏనాడో పోయినయ్ ఎలాంటి వాడైనా డబ్బులు ఉంటేనే మంచోడు...
-
కల్మషం లేని స్నేహం జీవితం ముందు తరాలకు జీవన విధానాన్ని పెంచుతుంది..
-
'నోటు' తో ఓటును కొన్న నాయకులు 'ప్రభుత్వం'లోకి వచ్చిన 'దోపిడి' గురించే ఆలోచిస్తారు కానీ ప్రజల కష్టసుఖాల గురించి ఆలోచించాల్సిన సమయం ఉండదు మారాల్సింది నాయకులు కాదు 'నోటుకు' ఓటును' అమ్ముకునే' మనమే..!!
-
'జీవితం' విలువ 'కాలం' విలువ 'డబ్బు' విలువ తెలియాలంటే 'కన్న తల్లిదండ్రులను' మనం 'కన్న పిల్లలను' 'పుట్టిన ఊరును' వదిలి 'బయట దేశానికి' వస్తే 'జీవితమంటే' ఏంటో తెలిసి వస్తుంది..
-
అన్ని బాగున్నాయి అనుకున్నప్పుడు వచ్చే కష్టాలతోనే మన జీవితం మొదలవుతుంది వాటిని తట్టుకొని నిలబడడమే జీవితం....
-