విద్యుత్ వెలుగుల ప్రపంచం
మోటార్ వాహనాల కీకీ రాగం
వర్షానికి ఆహ్వానం పలికే గాలి ప్రవాహం
ఆహ్లాదాన్ని ఇచ్చే తెలుగు సంగీతం
ముచ్చటలో మునిగిన కాలం
అన్నిటినీ ఆస్వాదిస్తూ జాలువారే కలం
అందించిన చిరు కావ్యం.. మీకోసం-
నిత్యం పరిగెత్తే గజిబిజి ప్రపంచాన్ని
నిద్రపోతున్న పసిపాపంత అందంగా
ఎడారిలో మంచినీటంత అద్భుతంగా
కనిపిస్తున్న ఈ క్షణం.. చూపిస్తున్న ఈ సమయం
మరుపురాని జ్ఞాపకం
- జగదీశ్-
నేను చూడలేని తను
జాబిల్లి వెలుగులో వెన్నెల పాటలే పాడింది కానీ
మండే సూర్యుడి ఉగ్ర రాగాలను మౌనంగానే వినిపించింది
చిట్టి అలల అలకలే చూపించింది కానీ
తనలో సునామీకి నన్ను దూరం చేసింది
సంద్రమంతా ప్రేమను పంచింది కానీ
పిల్ల కాలువంత కోపాన్ని కూడా దాచింది
నా కోసం సర్వస్వము ఇచ్చింది కానీ
నాలో అర్థ భాగాన్ని కూడా అడగలేదు
తన ప్రపంచాన్ని జయించిన వీరుడిగా కీర్తిని ఇచ్చింది
నా ప్రపంచానికి మాత్రం ఆమడ దూరంలోనే ఆగిపోయింది..
-
ఈ సంబరాలకు సారాంశం
అద్భుతాల మీద ఆశ కాదు
మార్పు మీద మమకారం మాత్రమే
Happy New Year-
మాటలు నుండి మౌనాలకు
అల్లర్లు నుండి బాధ్యతలకు
జీవితాల నుండి జ్ఞాపకాలకు
సంతోషాల నుండి బ్రతుకు పోరాటాలకు
చాలా దూరం వచ్చేశాం మిత్రమా..!-
మతం లేదు
గతం లేదు
వాటితోనే ఆగిపోతే
రేపన్నది లేదు
చిన్న లేదు
పెద్ద లేదు
హద్దులు చూస్తుంటే
పురోగతే లేదు
కులం లేదు
ధనం లేదు
బేధాలతో నడిస్తే
బంధమే లేదు
కోపాలు లేవు
ద్వేషాలు లేవు
భావోద్వేగాలకు బరువేస్తే
ప్రశాంతతే లేదు
నీది కాదు
నాది కాదు
ఈ దేశం అందరిది
బాధ్యత మనందరిది-
పరిగెత్తే ప్రయత్నాలు..
చలనం చూపని పాదాలు..
చరణ స్పర్శ కోసం సంద్రమే పరిగెత్తినా..!
కూసింతైనా కదలని కదం ఆమెది..!
పాదం తాకెవరాకు ఆగని తత్త్వం అతనిది..!
ఈశ్వరుడుకే అర్థంకాని వ్యథ వీరిది..!-
దరి నేనై..
అల నువ్వై..
సంద్రం చెప్పే కథ మనమై..
బ్రతికేద్దాం మిత్రమా..!
నిత్యం కలిసుండే ఎడబాటై ..!
-
అలకల అల..
దరి చేరనంటే ఎలా..!
ఎగసి పడే మీ సవ్వళ్ల గోల..!
కొసరు కొసరు మాటలకేనా..!
సరదా ముచ్చట్లకైనా ఆగవేలా..!-