అనుమానాలు
అవమానాలు
సహజం
బరిస్తు బ్రతకాలి లేదా బరితెగించి ఏదురించాలి-
ఎవ్వరి ముందు తల దించకూడదు
ఎవరితో మాట పడకూడదు
జోబిలో పైసా లేకున్నా బట్టల్ మాత్రం high class లో ఉండాలి
రెస్తురెంట్ వెళ్లి starters లేకుండా main course తినాలి
Bill ఎక్కువైతే ఎవడు పే చేస్తాడో అని ఎదురు చూడాలి
Girl friend gift అడిగితే love symbol పంపి కవర్ చేయ్యాలి
Relatives కనిపిస్తే రిప్లై ఇవ్వకుండా వెళ్లిపోవాలి
ఎలాగైనా చచ్చే లోపు బాగా సంపాదించాలి అనే పగటి కలలు కనాలి
అప్పుడే middle class వాడికి satisfaction
-
ఉలి రాయికి తగిలితే శిల్పం అవుతుంది
అదే ఉలి కాలికి తగిలితే రక్తం వస్తుంది
జీవితం అంతే .. శిల్పం లా మర్చుకుంటావో రక్తలే తెచ్చుకుంటావో నీ కష్టం అనే ఉలికే తెలుసు-
ఊబిలో ఊగిసలాడుతున్న ప్రాణానికి
ఉప్మా తినమని ఆశా చూపిస్తే ఎలా
-
నీరు లేని సంద్రంలో వరదలు వచ్చినట్టు
ప్రాణం లేని గుండెల్లో గాలి వీచినట్టు
నల్ల రంగు కమ్ముకున్న నా జీవితంలో వెలుగు రాదా
-
వెలుతురు ఉన్న జీవితంలో
చీకటి చేమురులు ముంచేస్తున్నాయి
ఉంటే బ్రతికి ఉంటే కలుద్దాం
లేదా చిరస్తాయి గుర్తుగా నిలుద్దాం-
పరుగులు తీసే పడవలో ప్రయాణిస్తున్న మనం
పడవ ఆగే లోపు అనుకున్నది సాధించాలి
కలగన్నది కథలా మార్చాలి-
ఎంత తొక్కుతున్న ఓర్చుకునే మట్టి
దాని విలువను ఎప్పటికీ కొల్పోదు
మట్టిని చూసి మనమూ నేర్చుకోవాలి
ఒక్కడు ఎంత తొక్కిన మన విలువను ఎవ్వడు తగ్గించ లేడు-
కాలికి అంటుకున్న బురదను కడిగేసుకునే మనము
మంచిగా నటించే మనషుల వల్ల వచ్చిన బాదను కడిగెయ్యలేమా-