మార్పు మంచిదే కానీ అదే మార్పు మనం కావాలి అనుకునేబంధం కూడా మనకోసం మారగలిగితే అదే నిజమైన ప్రేమ .మన భావాలకు, మన వ్యక్తిత్వానికి ప్రేమ విలువ ఇవ్వగలిగితే ఆ ప్రేమే మనల్ని మనంగా నిలబెట్టగలదు జీవితాంతం ప్రేమించగలదు లేకపోతే నిన్ను నీ మనసుని కోరికలను అన్నింటినీ లాగేసుకునే ప్రేమ అక్కర్లేదు
-
జనన మరణాలే కాదు, గమన గమ్యాలు కూడా మన చేతుల్లో ఉండవు కాలం ఎటు తీసుకెళ్తే అటు వెళ్తూ ఏది పరిచయం చేస్తే అది తీసుకుంటూ నిన్న నుంచి నేటిలో, నేటి నుంచి రేపటిలో ఇదే కాలచక్రంలో తిరుగుతూనే ఉంది అలాగే గడిచిపోతూనే ఉంది కాలం ఎవరి కోసం ఆగదు నీవు ఉన్న లేకపోయినా కాలచక్రం ఆగదు
-
ఇది ఒక అంతులేని కథ అంతం లేని వ్యధ
కథలాగే ఉంటుంది కానీ జీవితాన్ని సూచిస్తుంది
ఈ కథలో రాజు నేనే, మంత్రి నేనే ,బంటు నేనే, సేవకుని నేనే, కానీ ఎవరికీ సొంతం మాత్రం కాలేను
ఎవరికి వారే అని ఈ ప్రపంచంలో నాకు నేను ఒక ప్రశ్న గానే ఉండి పోతున్నాను ఎవరికీ అర్థం కాదు ఎవరికి సొంతం కాదు-
నేను రాయాలనుకున్నా ఓ అందమైన కావ్యాన్ని
అంతులేని అంతం లేని ఈ ప్రపంచాన్ని ఎన్నో ఎన్నో ప్రశ్నించాలనుకుంటున్నా
ఎక్కడ మొదలైంది నిరాశ ఎక్కడ అంతమవుతుంది
ఎన్నో అంతులేని కథలు అంతంలేనివిగా అఘాతంలో జారిపోతున్న జీవితాలు ఇంకా ఎన్నో మరెన్నో రాయాలని ఉంది ఎక్కడ మొదలైంది ఎక్కడ చేరుకున్నాను ఎక్కడ నా అంతం తెలియని ఒక ప్రశ్న జవాబు వెతుకుతూనే ఉన్నాను-
ఇదే నిజం నీవు నమ్మిన నమ్మకపోయినా ఇదే నిజం నీవు ఎవరికి అవసరం లేదు కానీ వాళ్ళ అవసరాలకు నీవు కావాలి ఇంకా ఎంతకాలం మేలుకోలేవా దూరం పెట్టలేవా వాళ్ల అవసరాలకు పొగుడుతారు ఆ తర్వాత ఆకాశం పైనుంచి కిందకు తోసేస్తారు తెలిసి తెలిసి మళ్ళీ అదే తప్పు చేస్తున్నావు ఎందుకు మేలుకో
-
చిన్న ఆశ మొదలైంది కానీ ఆశకు రెక్కలే లేవు
ఏదో సుదూర తీరాలకు ఎగిరిపోవాలని ఉంటుంది కానీ రెక్కలులేని ఆశకు అది సాధ్యమా ఎలా అయినా సాధించాలని ఎగురుతుంది పడుతుంది లేస్తుంది ఎగురుతుంది కానీ అక్కడే మిగిలిపోతూ ఉంది.-
Life చాలా నేర్పింది, ఎన్నో మలుపులు గెలుపులు అపజయాలు ,బాధలు ,ఒంటరితనం ప్రతిదీ నేర్పింది. నేర్చుకోలేకపోయింది ఒకటే మోసం చేయడం అబద్ధం చెప్పడం నేర్చుకోలేదు కానీ నన్ను నేను మోసం చేసుకోవడం నేర్చుకున్నాను .
-
అందరికీ కనిపించే ఆ కన్నుల్లో చెప్పుకోలేని ఎన్నో జ్ఞాపకాలు, బాధలు, బందీగా చేసిన బంధాలు మిగిల్చిన కన్నీరు ఎవరికి కనిపించదు
-
అలవాటు
ఒకరికి ఎప్పుడూ అలవాటు పడకూడదు అనే నిజాన్ని తెలుసుకున్న కానీ ఆలస్యమైంది
మనిషి ఎప్పుడూ ఒంటరే కానీ ఏదో ఆశ ఎవరోఒకరు తోడుంటారని
ఆశ తీరని కోరిక మిగిలిపోతుంది ఎప్పుడు అనుకోలేదు
కొన్ని బంధాలు వీడ్కోలు చెప్పకనే ఒంటరిగా వదిలి వెళ్లిపోతాయి
శరీరాన్ని విడిచిన ఆత్మల ఒంటరిగా వదిలేస్తారు-
తిరిగిరా బాల్యమా
ఎటు చూసిన కన్నీరే మిగిలింది
సమయమే లేదు ఆలోచనలకు
మళ్లీ ఒక్కసారి వచ్చి హత్తుకోవా
నాకోసం కొన్ని జ్ఞాపకాలుతేవా
ఒకనాటి నా బాల్యం తిరిగిరావా
ఆ బాల్యంలోనే ఆగిపోవాలి కాలం
కనులు తెరిచి కలలు కంటున్నానేమో బహుశా
బాల్యం జ్ఞాపకాలు గుర్తొచ్చిన ప్రతిసారి ఏదో లోకంలోకి విసిరేసినట్టు వెళ్ళిపోతున్న
ఓ నాబాల్యమా తిరిగి రావా మళ్ళి ఒకసారి-