**పారిశుద్ధ్య కార్మికుల**గురించి పాట*
ప:పట్టణాన్ని అందంగా మేము తీర్చి దిద్దుతాము.
సేవలో మునిగి తేలుతాము.
పర్యావరణాన్ని మేము రక్షించుతాము.
శ్రమజీవులమే మేము.
.... పారిశుద్ధ్య కార్మికులం....
....ప్రజలకు మేం సేవకులం....
**స్వచ్ఛమైన వాతావరణాన్నే ప్రతి రోజు అందిస్తూ ఉంటాం.
1చ: పరిశుభ్రతకై ప్రధానపాత్ర పోషించెవాళ్ళం.
అపరిశుభ్రత నిర్మూలనకై ముందుకు నిలుచుకుంటాం.
మా ఆకలి బాధలు తీర్చే వాడు లేనెలేడు.
మా వేదనలన్ని చూసెవాడు రానెరాడు.
**మేము కన్నీళ్ళేన్ని కార్చినగాని కనికరించరు కసాయివాళ్ళు.
2చ:ఈ చెత్తబండిని తీసుకెళ్ళుటకు బాధలెన్నో పడుతున్నాం.
మా బతుకు బండిని మోయలేకనే కష్టాలే పడుతున్నాం.
చాలి చాలని వేతనాలతో బతుకునెళ్ళదీస్తున్నాం.
చావలేక మేం బతకలేక జీవనమే సాగిస్తున్నాం.
**మా ప్రాణాలను పణంగా పెట్టి ఆరోగ్యాన్నిస్తున్నాం.
3చ:ఏ ప్రభుత్వము వచ్చినగాని మా బతుకులు మార్చలేదు.
ఏ నాయకుడు ఏలినగాని ఆలోచించలేడు.
మా బాధలు తీర్చే నాధుడే లేడని చింతిస్తూనే ఉన్నాం.
మాపై చిన్న చూపెందుకని రోదిస్తూనే ఉన్నాం.
**మా కడుపు కాలుతున్నా పట్టించుకోరు ఆకలిపోరాటమే చేస్తున్నాం.
- #మయూరి#
20 MAY 2019 AT 8:52