🌹🌹ఇస్మార్ట్ పోరి 🌹🌹
పః అరె దేఖో దేఖో భాయ్ ఇస్మార్ట్ పోరి రోయ్.
జర సోంచో సోంచో యార్ మెరె దిల్ కి ధడ్ ఖన్ రోయ్.(2)
....టైట్ జీన్స్ తో మెరిసెరా.
....నా హైట్ తోని సరిపోయెరా.
....నే సైట్ కొట్టి వస్తనురా.
....ఈ నైట్ పార్టీ ఇక నాదిరా.
చః తన అందం చూసాక అల్లాడిపోతున్నా.
తన నడకను చూసాక నిలకడగా లేకున్నా.
కలవరమె పడుతున్నా కనికరించదు నా పైనా.
కలవాలని చూస్తున్నా కనిపించదు కాస్తయినా.
....ఆ పిల్లి కళ్ళ పోరి నాదిరా.
....నా మనసే వశమైనాదిరా.
ఖతర్నఖ్ గా ఉందిర కైపెక్కించే ఆ సుందరి.
సుందరి.... సుందరి
చః తన స్మైల్ చూస్తుంటే నా మైండ్ పోతుంది.
తన స్టైల్ చూస్తుంటే నా గుండె జారింది.
తన కంటి రెప్పల్లె కాపాడుతూ ఉంటా.
తన తోడే లేకుంటే నా తనువే చాలిస్తా.
....ఆ కోల కళ్ళ పిల్ల నాదిరా.
....కలలో నైనా నే మరువరా.
ఖతర్నఖ్ గా ఉందిర కైపెక్కించే ఆ సుందరి.
సుందరి... సుందరి....
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
రచన స్వరకల్పన
రాంచందర్ చెండ్యాల
కాగజ్ నగర్-
💔హృదయ వేదన💔ప్రేమ గీతం💔
💔💔💔💔💔💔💔💔💔💔
పః నా హృదయములో వేదనలే మిగిలిందిలే.
నా హృదయ కోవెలనే చెదిరిపోయిందిలే.2.
....దుఃఖాన్ని నింపినావే..నాకు
....దూరమైనావే....2
*ప్రియతమా నా ప్రాణమా**
1చః నీ జ్ఞాపకాలతో నరకయాతన.
నాకు బతుకే బారము అయిపోయిందిగ.2.
నీ మరణమే నా గుండెలో ప్రళయమే.
నిన్నిడిసి నేనెట్ల బతుకుదునే.
....జాలి లేని దేవుడాయెనే....
....మన పాపమేమి ఉన్నదే..
*ప్రియతమా నా ప్రాణమా**
2చః ప్రేమించడమే మనకు శాపమా.
ప్రేమలో ముంచి పోతివి నీకు న్యాయమా.
కాస్తయినా కరుణ లేని దేవుడు.
కలకాలము కన్నీళ్లను మిగిలించెను.
....నువు లేక బతకలేనే....
.... నిను మరిచి పోలేనే.2...
*ప్రియతమా నా ప్రాణమా**
రచనః స్వర కల్పనః
రాంచందర్ చెండ్యాల
కాగజ్ నగర్
.-
💐దోర వయసు దొరసాని💐ఫోక్ సాంగ్.
పః దోర వయసు దొరసానివే నీ ఓర చూపు చూసినాక దాసోహునైపోతినే.
దోచినావు నా మనసునే నా సర్వస్వం నీవేనని మనవి నీకు జేస్తున్ననే.
....మన్నించవే కాస్త మాట ఆలాకించమ్మ.
....మనువాడవే భామా నా మహరాణివి నీవమ్మ.
**మన కలయికనే అవ్వాలి కలకాలము.
నా జత గూడుము.
నీ సరి జోడి ను.
1చః కన్ను కొట్టినావే నాకు కంటి కనుకు లేదె భామా.
కంగారే మొదలాయెనె కలుసుకోవాలని ప్రేమ.
నీ పైట కొంగు తాకగానే పరవశించినానమ్మ.
నీ తడి పెదవులు చూసినాక తపియిస్తున్నానె భామా.
....నీ నడుం ఒంపులన్ని
నాజూకుగున్నాయి.
....నా తనువు మనసంతా నిన్నే జపియిస్తుంది.
****ఈ ప్రేమ మందిరములో నా జతగూడుము.
నీ సరి జోడి ను.
2చః ఆకాశమంత ప్రేమనే కురిపిస్తానమ్మ.
అవరోదలెనైనా నిను చేరుకుంటా భామా.
....నా గుండెల్లో నీకు గుడి కట్టుకుంటానే.
....నీ కండ్లల్లో నీళ్లు రాకుండా జూస్తానే.
****ఈ ప్రేమ మందిరములో నా జతగూడుము.
నీ సరిజోడి ను.
రచనః స్వర కల్పనః
రాంచందర్ చెండ్యాల
కాగజ్ నగర్.-
🙏🏼కళలు🙏🏼కళకారుడు🙏🏼గురించి పాట.
పః కళలు నేడు కనుమరుగవుతున్నది.
కళాకారుల బతుకు భారమే అయినది.
.. కన్నీళ్లనె మిగిలించి కాలమెల్లిపోతుంది.
..కళాకారులకు బాసటగా లేక పోయింది..
....అంతరించి పోతుంది.అందలేకనే ఉంది....
అయినగాని..అయినగాని..
నిరాసనే చెందక, నిట్టూర్పే నింపక,నిలుస్తారు నిరంతరం, నిలువెత్తు సాక్ష్యిగా.
1చః భాగవతము చూసేందుకు బారి జనం వచ్చేవారు.
భలేగుందని నాడు బాధలన్నీ మరిచే వారు.
యక్ష గానాన్ని విని యెందరో మురిసే వారు.
యెనలేని గౌరవం తోనే యెందరో ఉండేవారు.
హరి కథల కమనీయము కళ్ళారా చూసేవారు.
హయిగా కళలన్ని నాడు కళకళలాడుతూ ఉండేను.
.. బుర్ర కథ ల వేషాలు.
..బుడ్డన్ ఖాన్ హస్యాలు.
..చిరుతల రామాయణము.చెక్క భజన గీతాలు.
..గణమైన గాత్రాలు.గాయకుల గానాలు.
**కళలన్ని చెదిరిపోయెను*
**కళకారులను మరిచినము*
2చః కాలి కడుపుతో కళకారుడు కాలమెల్లదీస్తుండు.
కాయ కష్టములు జేసి నేడు కలతలెన్నో పడుతుండు.
పూట గడవక దిక్కు తోచక పుస్తలమ్ముకుంటుండు.
పుట్టెడు బాధలతోనే నేడు పస్తులెన్నో ఉంటుండు.
చాలి చాలని బతుకులతోని జీవనమే సాగిస్తుండు.
చావుతోనె పోరాటమే చేస్తూ కళలకు ప్రాణం పోస్తుండు.
.. నిస్వార్థమైన సేవకుడు. నిజాయితీకి వాడు వారసుడు.
.. మనసున్న మహ నాయకుడుమానవత్వమే ఉన్నోడు.
..గర్వించుదాము అందరము.
.. గౌరవించుదాము మనమందరము.
**కళలకు కళాభివందనము*
**కళాకారులకు అభివందనము*
రచనఃరాంచందర్ చెండ్యాల
కాగజ్ నగర్-
🌹🌹ఓ బావో🌹🌹new folk song.
నీ బైక్ సప్పుడు నేను విన్నప్పుడల్లా.
నీకోసం బయటికెల్లి చూస్తున్నా నీ వల్లా.
నీ కిర్రు చెప్పుల సప్పుడు విన్నప్పుడల్లా.
నీకోసం పరుగున వస్తున్నా నీవల్లా.
....కోరమీసమున్నోడా.
.... కోరుకున్న నిన్నేరా.
కౌగిలిలో నను నీవు కరిగించుకోవెరా.
****ఇలా... ఇలా.... ఇలా....ఇలా...
1చః నీ హైట్ చూసి నేను నే ఐసైపోయారా.
నీ సైగలతోనే నన్ను సంపుతున్నావురా.
నీ చిలిపి నవ్వు చూస్తే చిరాకులు పోయెరా.
నీ మాటలతోనే నన్ను మాయ జేసినావురా.
....ఎయ్..నల్లని బావయ్యో.
ఎదకోత తీర్చి పోరో.నను ఏలుకోవురో.
2చః నీ ఎడబాటే నేనింకా తట్టుకోలెనురా.
నీతో కలిసుండాలని కోరుకుంటున్నారా.
నీ చేయి వదలకుండా కలకాలము ఉంటారా.
నీ మంచి మనసు చూసి నిను మనువాడకుంటారా.
....ఓయ్..సక్కని బావయ్యో.
ఓపికతో ఉండయ్యో.మనం
ఒకటవుదామయ్యో.
రచన స్వరకల్పన
రాంచందర్ చెండ్యాల
కాగజ్ నగర్-
నా మల్లి🌹💐డిజె ఫోక్ సాంగ్
పః నిన్నే ప్రేమించినానే ఓ మల్లి.
నీ ప్రేమను దాచకే సిరిమల్లి.
మనసియ్య రావే జాబిల్లి.
మనువాడు కుందామే నా లిల్లి.
నిన్నే ప్రేమించినానే ఓ మల్లి.
నీ ప్రేమను దాచకే సిరిమల్లి.
మనసియ్య రావే జాబిల్లి.
మనువాడుకుందామే నా లిల్లి.
****మన్నించవే.**మాట్లాడవే.
****మనసియ్యవే**మనువాడవే.
🌻💮🌼💐🌹🏵️🥀🌻💮🌼💐🌹
1చః ఉదయాన్నే లేచిన నీ రూపమే చూస్తను.
నీ రూపమే చూస్తను.
నీ రూపమే చూస్తను.
ఊపిరే ఆగును నిన్ను చూడకుంటెను.
నిన్ను చూడకుంటెను.
నిన్ను చూడకుంటెను.
నా ప్రాణము కన్న నిన్నే ప్రేమిస్తను.
నిన్నే ప్రేమిస్తను.
నిన్నే ప్రేమిస్తను.
నా ప్రాణాలైన ఇస్త నిన్ను విడిచి బతకను.
నిన్ను విడిచి బతకను.
నిన్ను విడిచి బతకను.
....నా ఊహలలో నువ్వే నా ఊపిరివి నువ్వే.
నా ఊహలలో నువ్వే నా ఊపిరివి నువ్వే.
మరణించే దాక నిన్ను మరిచిపోలేనే.
🌻🌹🏵️🥀🌻💮🌼💐🌹🏵️🥀🌻🌻
2చః కన్నీళ్ళే రాకుండా నిన్ను చూసుకుంటను.
నిన్ను చూసుకుంటను.
నిన్ను చూసుకుంటను.
కష్టాలెన్నొచ్చిన కడదాక ఉంటను.
కడదాక ఉంటను.
కడదాక ఉంటను.
దేవతలాగ నిన్ను ఆరాదిస్తుంటను.
ఆరాదిస్తుంటను.
ఆరాదిస్తుంటను.
దేవుడినైన నేను ఎదిరించి వస్తను.
ఎదిరించి వస్తను.
ఎదిరించి వస్తను.
నా గుండెల్లో నువ్వే గుండె చప్పుడువి నువ్వే.
నా గుండెల్లో నువ్వే గుండె చప్పుడువి నువ్వే.
ఎన్ని జన్మలైన నీ కోసం నేనేలే.
రచనః స్వరకల్పనః గానంఃరాంచందర్ చెండ్యాల.కాగజ్ నగర్.-
పః ఈ పైరగాలికి పరువాలన్ని పరేషాన్ చేస్తున్నాయే.
ఈ ఏకాంతానికి ఎదలో తీయని కలవరింత పెడుతున్నాదే.
నా తమకము చూసి తళతళ మెరిసే తారలెల్లి పోతున్నాయే.
నా తీపి దాహమే తీరేందుకని తొందరనే పెడుతున్నాదే.
....ఈ వెన్నెల రాతిరి లోనా....
.... ఇసుమంత జాలి చూపలేవా...
.... కలిసొచ్చిన ఈ రేయి లోనా....
....కలవరమే పెడుతుందే లోనా....
****కారు మబ్బులే కమ్ముకున్నవే కౌగిలిలో నువు కరిగిపో****
నా కౌగిలిలో నువు కరిగిపో.
1చః మంచు కురుస్తుందే నా మనసైన మగువ నీవే.
మన్నించి చేరుకోవే నా మదిని దోచినావే.
నీ పైట కొంగుతోనే నన్ను పలకరించినావే.
నున్నని నీ నడుమే చూసి నిలకడగా లేనే.
....మత్తుగా.... గమ్మత్తుగా....2
..గాలి వీచేస్తుందే..గారాబు చేసెస్తుందే..2
**నీ పరువం పలకరింపుకై పరితపిస్తున్నదే*
2చః తహతహగా ఉందే మనలో తెల్లవారుతుంటే.
తపనలు మొదలవుతుందే తెరచాటున నువ్వుంటే.
విరహమే పెరుగుతుందే విధి నిరిక్షణలలోనే.
విందు చేసుకుందామే వీలైన ఈ రేయి లోనే.
.... ఏకమై.... మమేకమై....2
..ఒకటవుదామే..ఓడి పోదామే..2
**ఈ చల్లని వెన్నెల ఏకాంతం మనకోసమేలే*
రచన
రాంచందర్ చెండ్యాల
కాగజ్ నగర్-
🙏🏼🙏🏼గంగమ్మ తల్లి🙏🏼🙏🏼పాట.
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
పః గంగమ్మ తల్లి నీకు వందనమో.మాకు
గండాలే రాకుండా నువు చూడమ్మో.
కడలినే నమ్ముకున్నాం ఓయమ్మో.మాకు
కన్నీళ్లను లేకుండా నువు చూడమ్మో.
.... పసుపు కుంకుమలతోనీ పూజిస్తాము మేము.
....పట్టు వస్త్రాలు పెట్టి కొలిచేమమ్మ నిన్ను.
****కష్టా నష్టాలు తీర్చి మమ్మాదుకోవమ్మా.
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
1చః సుడి గుండంలోనా మేము చిక్కినము.
సుడి గాలిలోన విలవిల లాడినము.
మాకు దారి చూపించమ్మ గంగమ్మ.
మా బతుకు బారము నీదే ఓయమ్మ.
.... ప్రతియేటా నీ జాతర చేసేము గంగమ్మ.
.... ప్రతిరోజూ స్మరియించేము మాయమ్మ.
****నీ పైనే ఆశలు అమ్మ గంగమ్మ తల్లి.
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
2చః జీవనోపాధి మాకు కరువాయే.
జీవన ఆదారమే మాకు లేదాయే.
మా ఆకలి తీర్చగా రావలమ్మ గంగమ్మ.
మా ఆపదలు బాపలమ్మ ఓయమ్మ.
....మా ఒడిదుడుకులు చూడవే తల్లి గంగమ్మ.
....మా దినదిన గండాలన్ని తీర్చమ్మ.
****నిన్నే నమ్ముకున్నాం గంగమ్మ తల్లి.
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
రచన
రాంచందర్ చెండ్యాల
కాగజ్ నగర్.-
**ఓ పిల్లా** new folk song
💐🌼🥀🌺💮💮🏵️🌹🌹🌻🥀🌺💮
పః నీ కాలి మువ్వల సప్పుడు విన్నప్పుడల్లా.
నా గుండెల్లో గుబులవుతుందే ఓ పిల్లా.
.... నిన్ను పదే పదే చూడాలని ఉందే మల్లా.
....నా కోసమొక్కసారైన రావేమే పిల్లా.
....అలలా అలజడిలా....
....అందని జాబిలిలా....
అలిగి ఉన్నావ ఓ నా జవరాలా
ఆశల వెల్లువలా
అల్లుకుపొయావిలా.
**ఇలా..ఇలా..ఇలా..ఇలా**
🌻🌹💐🌼🥀🌺💮💮🏵️🌹🌻🌺💮💮
1చః నీ ఓర చూపుతోనే నా ఓపిక పెంచావే.
నీ ఒంపుసొంపులు చూసి ఓడిపోయానే.
నీలో పరువాలు అన్ని పరవశించి పోయే.
నీ పడుచు అందాలే పదిలంగా ఉన్నాయే.
.... నాజూకు నల్ల పిల్లో....2.
నట్టేట ముంచబోకే.
నను ప్రేమలో దింపావే.
నన్నాదరించవేమే.
🌻🌹🏵️🏵️🌼🥀🌺💮💮💐🌻🌹🌹🏵️
2చః నిను కంటికి రెప్పల్లా నెను కాపాడుకుంటా.
నీ కాళ్ళు కందకుండా నే కాపాలాగ ఉంటా.
నీ అందానికి ఆనందాన్నే చేరుస్తా.
నికు ఆకాశము అంత ప్రేమనే చూపిస్తా.
....నను నమ్మవేమే పిల్లో....2.
నకరాలు చేయబోకే.
నను చంపి వెళ్ళమాకే.
నా కొంప ముంచినావే.
🌻🌹🌹🏵️💐🌼🥀🌺🌺💮💮💮🏵️🌹
రచన స్వరకల్పన
రాంచందర్ చెండ్యాల
కాగజ్ నగర్-
❤️బావ మరదలు❤️ జానపద గీతం.
పః m.ఓసి...పిల్లో నా మరదలు పిల్లో నిన్ను చూడకుండా.2.
అరెరే...ఉండలేనె పిల్లో నాకు ఊపిరాడదాయే.
నిన్ను చూడకుండా నేను ఊరుకోను లేవే.
F.ఒరే...బావో నా మేనబావో నిన్ను మరువలేనో.2.
అరెరే మనసు ఆగదాయే బావో మాటలాడకుంటే.
మాటలాడకుంటే మనసు ఆగమాగమాయే.
1చః m.మూతి విరుపులు ఎక్కువాయెనే.
ముక్కు మీదనే కోపమున్నదే.
F.ముసిముసి నవ్వులు నవ్వుతుంటవో.
ముద్దు కోసమే మురిసి పోతవో.
M****సిగ్గుపడుతవే...సిగ్నలిస్తవే.
చిన్న తప్పులే చేసి చూద్దమే.
....పిల్లో....ఓసి పిల్లో.
ఒసి పిల్లో నా మరదలు పిల్లో నిన్ను చూడకుండా.
ఉండలేనే పిల్లో నాకు ఊపిరాడదాయే.
2చః f.వరసైన నా మేనబావవో.
వచ్చి నన్ను మనువాడుకోవురో.
M.వాలుజడతో నను కట్టెసావే.
వలపులు నాపై కురిపిస్తావే.
F****చేసిన బాసలు మరిచిపోకురో.
మురిపెము తీర్చి ముంచబోకురో.
.... బావో...ఒరే బావో...
ఒరే బావో నా మేనబావో నిన్ను మరువలేనో.
ఒరే బావో నా మేనబావో నిన్ను మరువలేనో.
అరెరె మనసు ఆగదాయే బావో మాటలాడకుంటే.
మాటాలాడకుంటే మనసు ఆగమాగమాయే.
M:నిన్ను చూడకుండా నేను ఊరుకోను లేవే.
F:మాటలాడకుంటే మనసు ఆగమాగమాయే.
M:పిల్లో నిన్ను చూడకుంటే నాకు ఊపిరాడదాయే.
F:బావో మాటలాడకుంటే మనసు ఆగమాగమాయే.-