అదృష్టం ఉంటే ఆడపిల్ల పుడుతుంది
కానీ ఋణం ఉంటేనే
కొడుకు పుడతాడు ...
మనం వండి వార్చింది తినాలి అన్నా
మనకు వండి వార్చి పెట్టాలి అన్నా
కడుపున పుట్టిన కొడుకు ఒకడు ఉండాలి ...!!!
-
ఈ పేరు, ప్రఖ్యాతలు అన్నీ
దేవుడిచ్చిన వరం ...
ఈ దుఃఖాలు, బాధలు అన్నీ
మనసు తెచ్చుకున్న శాపం ...!!
-
నేనే ఉలి , నేనే శిల్పం
నిన్ను తలుచుకుంటూ ,
నన్ను మలుచుకుంటూ ...!!-
పొలముంటే ఆరు నెలలకో ,
మూడు నెలలకో ఒక్కసారే పంటకోత ...
అదే మనసుంటే
ప్రతి రోజూ గుండె కోత ...!!-
బురద పాముని కొట్టినా
ఎదురు తిరిగి
ఏమీ చేయలేదని
దాన్ని కొట్టి కొట్టి చంపుతారు
మనుషులు ...
అదే స్థానంలో
ఒక తాచుపాము ఉంటే
ఆమడ దూరం పారిపోతారు ...
నేటి సమాజానికి
త్రాచుపాములానే ఉండాలి
లేదంటే కోరలు పీకి
మెడలో వేసుకుని
తిరుగుతారు ఈ మనుషులు "...!-
చెప్పుకుంటే
అందరి బాధలూ
అర్థమవుతాయి ...
చెప్పకోలేనిది
చెప్పుకున్నా
అర్ధం కానిదే
ఆడపిల్ల బాధ "...!-
ముందున్న రోజుల్లో ....
పురుషుల కన్నా
మహిళలే ఎక్కువ
ప్రాధాన్యత సంతరించుకుంటారు ...
అన్ని రంగాల్లో
ముందంజలో ఉంటారు ...
ఇప్పటికే ప్రతి విభాగంలో
మహిళలు
ఉన్నత స్థాయిలో ఉన్నారు ...
నేవీ నుండి విమానయానం వరకూ
ఆర్మీ నుండి ఆయుధ దళాల వరకూ
అగ్రగామిగా వెలుగొందుతున్నారు
అనడంలో ఎటువంటి
అతిశయోక్తి లేదు మిత్రమా "...!-
రాళ్ళకోసం పరుగులు పెట్టి
రత్నాలను వదులుకోవద్దు ...
ప్రతి మనిషిలోనూ
ఎదో ఒక లోపం ఉంటుంది ...
సర్దుకుపోయిన సంసారం
చాలా ఆనందంగా ఉంటుంది "..!-
నోరు ఉన్న మనుషులమే
వేసవిలో నీరు దొరకక
గొంతు తడవక
నానా అవస్థలు పడుతున్నాము ...
అలాంటిది
మూగ జీవుల బాధ
వేసవిలోవర్ణనాతీతం ...
వన్య ప్రాణులు మానవ మనుగడకు
ఎంతో అవసరం
వన్య ప్రాణులను కాపాడుకోవడం
మన బాధ్యత "..!-