మాతృత్వ పరిమళానికై ఆరాటపడం..!!
అమ్మా అనే పిలుపుకై ఎదురుచూపులు..!!
గుండెల్లో బాధ నే చూపావా ఒక రూపం లేని కన్నీటి ధారలో..!!
మదిలోన పడిన ఒక మదనాన్ని కనురెప్ప చాటులో దిగమింగావ .!!
సాగెన చూపుల పయనంలో చలించిపోయెనా ఒక జీవిత హృదయం ..!!
.. ✍️✍️
-
నేటి ఆలోచనకి తోట్పాటువై
రేపటి ఆశకి మార్గదర్శివై
నిన్నటి కన్నీటికి ఓదార్పువై
నా , నీ అనే బేధభావం లేకుండా మన అనుకునే వారికి ప్రతిరూపమై చేతిలో చెయ్యేసి , అడుగులో అడుగేసి మేధోసంపత్తికి అనుక్షణం చేయూతనిస్తూ,..బాధకి ధైర్యాన్నిస్తూ.. ఆలోచనకి ప్రోత్సాహమిస్తు ఆశకి ప్రతిబింబమై ఒక రూపాన్నిస్తూ భవిష్యత్తుకై నిలువుదట్టంలా నిలుస్తూ సంతోషాన్నిస్తూ,.. ముందుకు నడిపిస్తూ ప్రణయ శ్రీ శ్రవణమయమై చిరునవ్వు ని చిందిస్తు ఆద్యంతం పరితపిస్తూ,..! జన్మదిన శుభాకాంక్షలు
Many more happy returns of day mardal ❤️ 🎂 🥮 🍥 🥞 🧁 🍰 🎂 🥮 🌼 🌸 🍼 🍼 🍼
-- రామ్ GSR-
✍️✍️✍️,..!!
హృదయ చింతన, భావోద్వేగాలు వున్నాయ..లేవా.. అని అడిగే సందర్భంలో కంటికి , కన్నీరు మరియు హృదయానికి జరిగే మాటల గారడి సన్నివేశంలో జరిగే ఒక అద్భుతమైనట్టువంటి కధా కల్పన రచనే నా ఈ " *కదలని కన్నీరు పలుకుతోంది*✍️✍️ "
✍️✍️-- ప్రణయ శ్రీ🖊️🖊️-
🚩
🚩🚩🚩
🚩🚩🕉🚩🚩
🚩🚩🚩
🚩
🙏🙏🙏🙏🙏
ఉ : ఉదయించిన సూర్య కాంతి కిరాణా ల మధ్య లో నుండి
గా : గాన కోకిలమ్మ వసంత గానామృతా లు పాడుతుండంగా
ది : దిక్కులు నాలుగు కూడా పరవశించే శుభసమయాన ,..........
ఇంటి ఆడపడుచు ఇంటి ముందు ముగ్గు పెట్టే సమయాన ఇంటి పెద్ద గుమ్మానికి మామిడి తోరణాలు కట్టే వేళ షడ్రుచుల సమ్మేళన హిందూ బంధువు ల కలయిక
" శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదిన " శుభాకాంక్షల తో,.............!!
~మీ GSR రామ్-
అందుకే ఇందుకే ఎందుకో తెలియదు.. నా ప్రాణమే నీవై వచ్చావ..
ఎన్నెన్ని జన్మల బంధమో ఇది.. ఎ జన్మ ఋణానుబంధమో.. నీ చూపుల వెలుగుల చిరునవ్వుల సవ్వడి ఆకర్షణవై నిలిచావే..
ఎ జన్మ పుణ్య ఫలమో నా మది చేరి నీవై నిలిచావే
గలగల మాటల కోయిల మంత్రమే వినిపించిన నీ స్వర గానమృతమై శ్రవించేన ఒక మాధుర్యమై
అందుకే ఇందుకే ఎందుకో తెలియదే నా ప్రాణమే నీవై నిలిచావ
ఎ జన్మ ఋణానుబంధమో తెలియదు... కానీ కాలం కలిపిన నేలనే నిలిచెనా ఒక అనుబంధానికే నిలువుదట్టమై.. నిలిచేనా
కనులుమూసిన కనులుతెరిచినా మనసే నీవై ఆహ్లాదకరమై నిలిచావే
అందుకే ఇందుకే ఎందుకో తెలియదే నా ప్రాణమే నీవై నిలిచావే
ఓహో ఓహో ఓహో ఓహో ఓహో ఓహో.. హోహోహోహోహో
నీ చూపుల వెలుగుల చిరునవ్వుల సవ్వడి ఆకర్షణే నీవై నిలిచావే
ఓహో ఓహో ఓహో ఓహో ఓహో ఓహో.. హోహోహోహోహో
నా మదినే చేరిన నీమదిలో ఆశల సవ్వడె మనమై కలియాడుతు చిందిన చిరునవ్వే నీవై నిలిచావే..!
అందుకే ఇందుకే ఎందుకో తెలియదే నా ప్రాణమే నీవై నిలిచావే...!!
-- రచన : GSR రామగౌడ్
-
కాలం కలిపిన బంధమా..!!
నీ రూపం ఏమిటో చూపవే ఒకసారి
కాలం కలిపిన బంధమా.!
నీ మాటని తెలపవే ఒక మారు
కలిసిన బంధొలకి సాక్ష్యమై నిలిచావ పలుమార్లు
కాలం కలిపిన బంధమా..!!
నీ చాతుర్యం ఏమిటో చెప్పవే
కంటికి కనబడని కాలమా
నీ ఎదుగుదల ఎక్కడో చూపవే..!!
--GSR రామగౌడ్-
కంటి నుండి కారే కన్నీరుకు సమాధానం ఏమని అడిగితే నా జీవితాశయానికి తోడైన నీ ఆశల సవ్వడికి సయ్యాట తోడైన వేళ అనుకున్న లక్ష్యం కళ్లెదుట సాక్ష్యాత్కరించే సమయాన.. నా దరి చెంతనే వుండే నీ తోడుకై వేచి యున్న నా ఆశయాల సవ్వడికి తోడైన నీ సయ్యాట కొన ఊపిరి వరకు వుండే నా కళ్ల ధారనే నీ రూపమై ఎర్పడగా,..!!
--GSR రామగౌడ్-
చిన్న నాటి నేస్తమా కనబడవా ఈ రోజు
కళ్లముందు కదలాడెన మరుపురాని జ్ఞాపకాలు
చిన్న నాటి స్నేహమై కలియాడిన రోజులకి..
ముడివేసిన బంధానికి నిలబడెన ఒక సాక్ష్యమై
తిరుగాడిన ప్రాంగణమే లీనమై కలిసెనా మన మదిలోన
కదలాడెన చిన్ననాటి జ్ఞాపకాలు
చిన్ననాటి నేస్తమా కనబడవా ఈ రోజు
కంటిచూపు మేర నీవెక్కడో తెలపవే నా నేస్తమా
తరగతి గదిలోన చేసిన అల్లరికై పెట్టిన కేరింతలే వినబతున్నవే నేస్తమా ఓ నేస్తమా,..!!
చిన్న నాటి నేస్తమై కనబడెనా ఈరోజు
కళ్లముందు కదలాడెనా మరవలేని జ్ఞాపకాలు
సరస్వతీ ఒడిలోన పిల్లలమై చేరంగా..
లక్ష్యాన్ని ముద్దాడంగ ..!
అధిరోహణ చేశావా ఉన్నతమైన శిఖరాలను
చిన్ననాటి నేస్తమై కలియాడిన రోజులకి
సాక్ష్యమై నిలిచెనా నీవే ఒక ప్రాణమై,..!!
రచన : -- GSR రామగౌడ్
-
మనసే ఒక పచ్చదనమై ప్రకృతి పరవశించిపోతున్న పరవల్లు చెందే ఒక హృదయానంద హరివిల్లు కి గానామృతమై నిలిచిన గాన కోకిలమ్మ స్వరాలు ఆనందమై హరివిల్లు చెందే ఒకానొక సమయాన మదిలో తలిచే హృదయనాదమే పరమావధిగా మారి పరవల్లు చెందుతున్న మనసు పులకింతలు చెందే క్రమంలో సప్తస్వరనాదమై నిలిచినప్రతి మదిని శ్రవింపచేసేలా కదలాడుతున్నదా..!!
-- GSR రామగౌడ్-