నాణేనికి బొమ్మబొరుసు ఉన్నట్లే.....
ప్రతీ మనిషిలో మంచి చెడు రెండు ఉంటాయి....
మంచిని మాత్రమే తీసుకుంటాను, చెడును దరి చేరనీయను అనుకుంటే ఈ లోకంలో 100 కి 100% లోపాలే లేని మనిషే ఉండడు...
అందమైన గులాబీని కోయాలి అంటే గులాబీల చుట్టూ ముళ్ళను కూడా దాటాలి....
-
అతి వాడకంతో అనర్థాలని కొని తెచ్చుకుంటున్నామా??
మనుషుల మధ్య నుండి దూరమై, మర మనుషుల్లా తయారవుతున్నామా??-
కష్టమొచ్చిందని కన్నీరు కారుస్తూ కూర్చుంటే కడ వరకు పోటీలో ఎలా నిలుస్తావు??
గెలుపు తీరాలను ఎప్పటికి చేరుకుంటావు??-
మన వాళ్ళలో మనకు సాయం చేసేవారు తక్కువ.....
మనం ఎదిగాక మాత్రం మావాడు అని చెప్పుకునే వారే ఎక్కువ...😁-
ఈ రోజుల్లో జీతాలతో జీవితాలని ముడిపెడుతూ...
ఆస్తుల లెక్కలేసి అమ్మాయిలని కట్టబెడుతున్నారు....
కానీ ఆ లెక్కలు తప్పి, కట్టుకున్న వాళ్ళతో కలకాలం కలిసుండలేకపోతున్నారు....-
తాతల కాలం నుండి వస్తున్న తరీఖా కదా...
మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడు తప్పులు చేస్తాడు...
కానీ...
మనం చేసే తప్పు వల్ల మనం ఇంకొకరి ముందు తల దించుకునే పరిస్థితి ఎప్పుడు రాకూడదు మిత్రమా..!-
ఓటమి ఖాయం అనుకున్న స్థితిలో ఓర్పుగా ఆడి, తన జట్టును ఓటమి అంచుల నుండి గెలుపు తీరాలకు చేరవేసాడు చూడు...
అది అతని "గుండె ధైర్యం & తనపై తనకున్న ఆత్మ విశ్వాసం"-
నీది కాని రోజు నీ నీడని కూడా నువు నమ్మకు!!
నిలువునా నిన్ను ముంచేస్తది...-
సమాజం పోకడలు అసలు సమజే కావు...!!
తెల్లగా ఉన్న వెంట్రుకలకేమో కలర్ వేసి నల్లగా చేయాలట.....
నల్లగా ఉన్న చర్మం తెల్లగా అవటానికేమో ఫెయిర్ నెస్ క్రీములు వాడాలట......
లేనిదానికోసం పాకులాడటం మానేసి, ఉన్నదానితో సంతృప్తి పడేదెప్పుడో???🤔🤔-