మర్చిపోవాలి అని నువ్వు చేసే ప్రయత్నమే,
నిన్ను తనని మర్చిపోకుండా చేస్తుంది.-
నీ బాధ నీ బలహీనత అయితే దాన్ని నీలోనే దాచుకో
ఎందుకంటే అది అవతలి వాడికి ఆయుధం అవ్వచ్చు-
ఆనందం అందరితో పంచుకో
బాధ నా అన్నవాళ్ళతో మాత్రమే చెప్పుకో
నీ బాధ నిన్ను మెచ్చని వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వచ్చు
గిట్టనివాళ్ళకి నీపైన తిరగబడే అవకాశాన్ని ఇవ్వచ్చు
అంతెందుకు నీ బాధ ఇంకొందరికి భారంగాను అనిపించవచ్చు-
నీకు ఎదురయ్యే సమస్యలు కనుపాపకి అడ్డుపడ్డ పొరలులాంటివి
అవి దాటి నువ్వు చూడగలిగిన రోజు ప్రపంచం నీదవుతుంది-
కుదరదని చెప్తే తను కొన్ని రోజులే బాధపడుతుంది
కాదని కొనసాగిస్తే నువ్వు జీవితాంతం భాద పడాల్సి వస్తుంది-
నా ప్రయత్నం నిన్ను మెప్పించటానికి కాదు....
నన్ను నేను నిరూపించుకోడానికి....-
ప్రేమించే మనిషి నీతో ఉంటే
ఎంత దూరమైనా చేరువగానే కనిపిస్తుంది-
ప్రేమించటానికి అడ్డురాని అలవాట్లు
విడిపోవడానికి కారణాలు అవుతుంటాయి
-
బంధాలను బలహీనతలుగా భావిస్తే
బాధ్యతలు బరువుగా అనిపిస్తాయి...-